స్వీటీతో జిమ్‌లో రానా హల్‌చల్ | Rana halchal with anuksha and others | Sakshi
Sakshi News home page

స్వీటీతో జిమ్‌లో రానా హల్‌చల్

Published Mon, Nov 30 2015 12:52 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

స్వీటీతో జిమ్‌లో రానా హల్‌చల్ - Sakshi

స్వీటీతో జిమ్‌లో రానా హల్‌చల్

హైదరాబాద్‌: కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ప్రత్యేక పాత్రలతో సాహసాలు చేస్తూ అందరిన్నీ అలరిస్తున్న టాలెండెట్ హీరోయిన్ అనుష్క. జిమ్ బాడీతో, ఆకట్టుకునే నటనతో,  విభిన్న పాత్రలతో  విమర్శకుల ప్రశంసలందుకుంటున్న విలక్షణ నటుడు రానా.  వీరిద్దరూ కలిసి జిమ్‌లో సందడి చేస్తే ఎలా ఉంటుంది? నిజంగానే వీళ్లిద్దరూ జిమ్‌లో జాలీ జాలీగా ఎక్స్ర్‌సైజ్‌లు చేస్తూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఈ  సరదా వీడియోను అనుష్క తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

'సైజ్‌ జీరో' చిత్ర యూనిట్ కి రానా దగ్గుబాటి వ్యాయామ పాఠాలు నేర్పిన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని మెలకువలు నేర్పుతానంటూ రానా అనుష్క(స్వీటీ), ప్రకాశ్‌ కోవెలమూడి, కనికలతో రక రకాల వ్యాయామాలు  చేయిస్తున్న ఈ వీడియో ఇపుడు టాక్ ఆఫ్ ఆది టౌన్.

అయితే 'బయటివాళ్లకే కాదు, సినిమా వాళ్లకూ బరువు పెరిగిపోతున్నామేమో అన్న అభద్రతా భావం ఉంటుంది. సైజ్‌ జీరో అంటే సన్నగా ఉండిపోవడం కాదని అనుష్క మీడియాతో తెలిపింది. శరీర సౌష్టవం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందని, ఎవరికి వాళ్లు సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పింది. వ్యాయామాల్ని, ఆరోగ్య సూత్రాల్ని ప్రోత్సహిస్తా కానీ..  సౌందర్యం పేరుతో లావుగా ఉన్న వాళ్లను  అవహేళన చేయడం తగదని సూచించింది.  

ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వంలో అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌ కీలక పాత్రల్లో నటించిన 'సైజ్‌ జీరో' గత శుక్రవారం నుంచి  థియేటర్లలో సందడి చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అనుష్క 20  కేజీల బరువు పెరిగింది. ఈ క్రమంలో కృత్రిమ పద్ధతిలో కాకుండా ఎంత కావాలంటే అంత సహజంగానే బరువు పెరుగగలనని నిరూపించిన స్వీటీ ఇపుడు మళ్లీ మునుపటి మెరుపు తీగలా మారేందుకు ప్రయత్నిస్తోందన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement