వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీప్రకాశ్ జాదవ్
సాక్షి, సూర్యాపేట క్రైం : హలో డ్రైవర్‌సార్.. మిమ్మ ల్నే.. సీఐసార్ నాకు దగ్గర.. మిమ్మల్ని.. పల్సర్ బైక్ వేసుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లమ్మంటున్నారం టూ.. ఓ గుర్తుతెలియని దుండగుడు.. సరిగ్గా.. 04.44 గంటల సమయంలో డ్రైవర్ కళ్లు కప్పి పోలీసు వాహనాన్ని దొంగిలించాడు. ఈ ఘటన శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సూర్యాపేట రూరల్ సీఐగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ జిమ్ చేసేందుకు జిల్లా కేంద్రంలోని యూనివర్సల్ జిమ్‌సెంటర్‌కు తన కు కేటాయించిన ఆత్మకూర్(ఎస్) మండల పోలీస్‌స్టేషన్ సుమో టీఎస్ 09 పీఏ 1568 నం బరు గల వాహనంలో వచ్చాడు.
సెంటర్‌లో సీఐని దింపిన డ్రైవర్ సమీపంలో పార్కింగ్ చేసేందుకు వచ్చాడు. సీఐ డ్రైవర్ ఎం.సైదులు వద్దకు వచ్చిన దుండగుడు సీఐ మిమ్మల్ని అర్జెంటుగా స్టేషన్‌కు వెళ్లమన్నారని.. మీకు పల్సర్‌బైక్ ఇవ్వమన్నారంటూ తన వద్ద ఉన్న బైక్ డ్రైవర్‌కు ఇవ్వడమే ఆలస్యం.. వెంటనే సుమోలోకి ఎక్కిన దుండగుడు డ్రైవింగ్ చేసుకుంటూ అపహరించుకుపోయాడు.
20 నిమిషాల పాటు ..
డ్రైవర్ సైదులు వద్ద నుంచి సుమోను దొంగలించుకుపోయిన దుండగుడు.. నేరుగా పట్టణంలోని మున్సిపల్ పెద్దవాటర్ ట్యాంక్ మీదుగా.. సద్దుల చెరువు కట్టపైకి సుమోను డ్రైవింగ్ చేసుకుంటూ సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్ ముందు నుంచే వెళ్లాడు. సుమో ఎక్కడాన్ని గమనించిన డ్రైవర్ సైదులు దుండగుడు ఇచ్చిన బైక్‌ను తీసుకుని సుమోను వెంబడించాడు. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో సుమోకు బైక్‌ను అడ్డం పెట్టినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.
సుమోను తిరిగి వెనక్కు అదే రూట్‌లో రూరల్‌పోలీస్‌స్టేషన్ ముందు నుంచి తీసుకెళ్తండడాన్ని స్టేషన్‌లో పోలీసులు గుర్తించారు. గమనించిన కొందరు కానిస్టేబుళ్లు.. సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి సీఐ ప్రవీణ్‌కుమార్‌కు ఫోన్‌చేసి తమకు కేటాయించిన సుమోను వేగంగా నడుపుతూ వెళ్తున్నారని చెప్పారు. వెంటనే సీఐ డ్రైవర్ సైదులుకు ఫోన్ చేయగా.. విషయాన్ని వివరించాడు. వాహనాన్ని అపహరించిన దుండగుడు ముందుగా సుమోకు ఏర్పాటు చేసిన జీపీఆర్‌ఎస్‌ను తొలగించి రూరల్ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోనే వేశాడు. దీంతో దుండగుడు వినియోగించిన పల్సర్ బైక్ టీఆర్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని అన్నాదురై నగర్‌కు చెందిన యాట ప్రవీణ్‌కు చెందిన పల్సర్‌బైక్‌గా గుర్తించారు. వెంటనే అన్నాదురై నగర్‌కు పోలీసులు చేరుకుని యాట నవీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో ప్రవీణ్ తన బైక్‌ను బావమరిది తిరుపతి రాజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తీసుకుని వెళ్లినట్లుగా తెలిపాడు. వెంటనే ప్రవీణ్ వద్ద ఉన్న రాజు, అతని భార్య ఫోన్ నంబర్లు కూడా తీసుకుని విచారణ చేపట్టారు. భార్య ఫోన్ ఫోన్ కలవగానే.. విషయాన్ని పోలీసులు వివరించారు. రాజు భార్య తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని.. పోలీసు వాహనాన్ని తమ వద్దకు తీసుకొచ్చి నట్లు తెలపడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భార్యను చూసిన రాజు.. తిరిగి వాహనాన్ని తీసుకుని అక్కడి నుంచి తన అత్తగారి స్వ గ్రామమైన ఖమ్మం జిల్లా చింతకాని మండలం లోని జగన్నాథపురం గ్రామానికి వాహనాన్ని తీ సుకుని వెళ్లాడు. వెంటనే అక్కడి కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ఎస్పీ జాదవ్ సమాచారం చేరవేశారు.
ఐదు గంటలకుపైగా హైరానా..
ఎస్పీ జాదవ్ అన్ని జిల్లాల కమిషనర్లు, ఎస్పీలకు సమాచారం చేరవేశారు. వెంటనే సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని డ్రైవర్ సైదులుతో పాటు సీఐ ప్రవీణ్‌కుమార్‌ను విచారించారు. జిల్లా వ్యాప్తం గా ఉన్న పోలీస్‌స్టేషన్లలోని సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందిని అప్రమత్తం చేసి విషయాన్ని సెట్ ద్వారా చేరవేశారు. జిల్లా కేంద్రంలోని పోలీసులు 8 బృందాలుగా చీలిపోయి గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు.
కృష్ణా జిల్లా చిల్లకల్లులో స్వాధీనం
దుండగుడు తన అత్తగారి గ్రామమైన ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథరం నుంచి వాహనాన్ని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులోకి ప్రవేశించాడు. అక్కడ వాహనంతో సంచరిస్తుండగా.. అక్కడి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా చింతకాని నుంచి చిల్లకల్లుకు సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పేట ఎంటీఓ ఆర్‌ఐ, సిబ్బంది చాకచక్యంగా వ్యవరించి దుండగుడిని పట్టుకుని చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీ చెందిన తిరుపతి రాజుగా గుర్తించామని ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ తెలిపారు. దుండగుడు దొంగ కాదని.. అతడికి మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment