
సీఐ నరసింహారెడ్డి
సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ సీఐ నరసింహా రెడ్డితో పాటు హెడ్ కానిస్టేబుల్ బలరాం రెడ్డి, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు (1416), కమలాకర్ (1845)లను సస్పెండ్ చేస్తూ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. హుజూర్ నగర్ పరిధిలో రేషన్ బియ్యం, గుట్కా పాకెట్ల అక్రమ రవాణా విషయంలో చిన్న వ్యాపారులపై కేసులు పెడుతూ పెద్ద వారికి సహకరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వీరిపై వచ్చాయి. దీంతో ఐజీ స్టీఫెన్ రవీంద్ర కొరడా ఝుళిపించారు. సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment