రానా, ప్రకాష్ రాజ్లపై పోలీస్ కంప్లయింట్ | police complaint against Rana and Prakash Raj | Sakshi
Sakshi News home page

రానా, ప్రకాష్ రాజ్లపై పోలీస్ కంప్లయింట్

Published Sat, Oct 22 2016 9:48 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రానా, ప్రకాష్ రాజ్లపై పోలీస్ కంప్లయింట్ - Sakshi

రానా, ప్రకాష్ రాజ్లపై పోలీస్ కంప్లయింట్

స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నటీనటులు, తమ ఇమేజ్ను క్యాష్ చేసుకునేందుకు పలు ప్రకటనల్లో నటిస్తుంటారు. అయితే అలా డబ్బు కోసం నటులు చేసే ప్రకటనలు అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతుంటాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రానా, నటుడు ప్రకాష్ రాజ్ ఇలాంటి ఇబ్బందుల్లోనే పడ్డారు. ఈ ఇద్దరు కలిసి ఓ ఆన్ లైన్ గేమ్కు సంబందించిన యాడ్ లో నటించినందుకు గాను వీరిపై పోలీస్ కంప్లయింట్ నమోదయ్యింది.

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా, ప్రకాష్ రాజ్తో కలిసి జంగిల్ రమ్మీ అనే గేమ్కు సంబందించిన యాడ్లో నటించారు. ఈ ఇద్దరు గ్యాంబ్లింగ్ను ప్రమోట్ చేస్తున్నారంటూ కోయంబత్తూర్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కేసు వేశాడు.  గతంలోనూ రానా ఈ యాడ్ చేయడటంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. తాజాగా కేసుకు నమోదు కావటంతో రానా ఎలా స్పందిస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement