rummy
-
కీలకమైన సమావేశంలో ఆన్ లైన్ లో రమ్మీ ఆడిన డీఆర్వో మలోలా
-
యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఆన్లైన్ గేమ్
పరకాల: ఆన్లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చి ంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో గురువారం రాత్రి వెలుగులోకి వచ్చి ంది. బాధితుడి తల్లి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాలలోని వెలుమవాడకు చెందిన ఎండీ గౌస్‌పాషా గుడెప్పాడ్‌లోని జీకే పెట్రోల్ బంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గౌస్‌పాషా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాందించాలనే ఆలోచనతో రమ్మీ ఆన్లైన్ గేమ్‌కు అలవాటు పడి బంక్‌కు సంబంధించిన రూ.6లక్షలు పొగొట్టాడు. దీంతో బంక్ యజమానులు ఈ నెల 18న ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఆ డబ్బులు రికవరీ చేసేందుకు గౌస్‌పాషా ఇంటిని రూ.100 స్టాంప్ కాగితంపై రాయించుకున్నారు. అదే రోజు ఇంటికి చేరుకున్న గౌస్‌పాషా ఎంతో కష్టపడి తన తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటిని బంక్ యజమానులు రాయించుకోవడం తెలిస్తే తట్టుకోలేరని మనస్తాపం చెంది ఈ నెల 19న పురుగుల మందు తాగాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని..మీరంతా తనను మరిచిపోవాలని తల్లి, తమ్ముడికి ఫోన్ చేశాడు. దీంతో వారు పోలీసులను సంప్రదించగా, పరకాల బంధం రోడ్డులో క్రిమిసంహారక మందు తాగి ప్రాణపాయ స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తన కొడుకు ఆత్మహత్యయత్నానికి బంక్ యాజమానుల వేధింపులే కారణమని బాధితుడి తల్లి ఎండీ ఫర్వీనా పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పరకాల సీఐ రవిరాజుకు ఫోన్‌చేయగా స్పందించలేదు. -
బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్లైన్లో రమ్మీ ఆట
బెంగళూరు: కర్ణాటకలో ఓ ప్రైవేటు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారుల సొమ్మును కాజేశాడు. ఆన్లైన్లో రమ్మీ వంటి గ్యాంబ్లింగ్ గేమ్స్‌కు బానిసైన అతడు మొత్తం రూ.2.36 కోట్లు తన స్నేహుతుడి ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. వాటితో తరచూ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడాడు. బ్యాంకుకు రూ.2.36 కోట్లు నష్టం రావడంతో షాక్ అయిన మేనేజర్ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. అసిస్టెంట్ మేనేజరే ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వీరేశ్ కేషిమఠ్(28) కర్ణాటక హవేరిలోని ఓ ప్రైవేటు బ్యాంకు శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడి వాటికి బానిసయ్యాడు. బ్యాంకింగ్ ఆపరేషన్స్ కోసం ప్రతిరోజు రూ.5లక్షలు బదిలీ చేసే అధికారం ఇతనికి ఉంటుంది. దీన్నే అదునుగా తీసుకొని ఖాతాదారుల ఖాతాల నుంచి తరచూ రూ.5లక్షలు తన స్నేహితుడు మహంతేషయ్య పీ హిరేమఠ్కు బదిలీ చేశాడు. వాటితో రమ్మీ, ఇతర ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. గతేడాది ఆగస్టు నుంచి ఇలా చేస్తున్నాడు. కొన్ని నెలలపాటు ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు కూడా గుర్తించలేకపోయారు. అయితే ఇటీవల ఈ బ్రాంచ్‌లో ఆడిటింగ్ నిర్వహించినప్పుడు రూ.2.36కోట్ల అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో మేనెజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసిస్టెంట్ నిర్వాకం బహిర్గతమైంది. గతేడాది ఆగస్టు నుంచి జరగుతున్న ఈ వ్యవహారం గురించి ఈ ఏడాది ఫిబ్రవరి 7న బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియడం గమనార్హం.మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేషిమఠ్ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్లకు పైగా మోసం జరగడంతో ఈ కేసును రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు. చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్‌లో శిక్షణ.. -
ఇదేం బాలేదు.. కొందరి కోసమే గూగుల్ పాలసీ: విన్జో
న్యూఢిల్లీ: ప్లేస్టోర్‌లో ఎంపిక చేసిన కొన్ని ఫ్యాంటసీ, రమ్మీ గేమింగ్ యాప్స్‌ను ప్రయోగాత్మకంగా అనుమతించాలన్న గూగుల్ నిర్ణయాన్ని దేశీ గేమింగ్ ప్లాట్‌ఫాం విన్జో తప్పు పట్టింది. ఇది పూర్తిగా పక్షపాతపూరితమైన, అనుచితమైన, ఆంక్షాపూర్వక విధానమని వ్యాఖ్యానించింది. ప్లాట్‌ఫాంను తటస్థంగా ఉంచుతూ ఒక మధ్యవర్తిగానే వ్యవహరిస్తామనే గూగుల్ ధోరణిపై అనుమానాలు రేకెత్తుతున్నాయని విన్జో పేర్కొంది. దశాబ్దకాలంపైగా గుత్తాధిపత్యం సాగిస్తున్న కొన్ని సంస్థలకే లబ్ధి చేకూర్చేలా గూగుల్ విధానం ఉందని తెలిపింది. ఇది పోటీని దెబ్బతీయడమే కాకుండా నవకల్పనలకు చావుదెబ్బలాంటిదని విన్జో వ్యాఖ్యానించింది. గతంలో ఫ్యాంటసీ గేమింగ్ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించినప్పటికీ సెప్టెంబర్ 28 నుంచి ఎంపిక చేసిన కొన్నింటిని పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విన్జో అభ్యంతరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: అన్నింటికీ ఒక్కటే కేవైసీ -
ప్లేస్టోర్‌లో మళ్లీ ఫ్యాంటసీ గేమ్స్ యాప్స్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఫ్యాంటసీ గేమింగ్, రమ్మీ గేమ్స్ యాప్స్‌ను గతంలో తమ ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్ .. కొన్ని ఎంపిక చేసిన యాప్స్‌ను తిరిగి ప్రవేశపెట్టనుంది. ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టు కింద వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. 2022 సెప్టెంబర్ 28 నుంచి 2023 సెప్టెంబర్ 28 వరకూ పరిమిత కాలం పాటు భారత్‌లోని డెవలపర్లు రూపొందించిన డీఎఫ్ఎస్ (డైలీ ఫ్యాంటసీ స్పోర్ట్స్), రమ్మీ యాప్స్‌ను దేశీయంగా యూజర్లకు అందించేందుకు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచున్నట్లు గూగుల్ తెలిపింది. అయితే, ఎంపిక చేసిన కొన్నింటిని మాత్రమే ప్లేస్టోర్‌లో అనుమతించడమనేది పక్షపాత ధోరణి అని, ఆధిపత్య దుర్వినియోగమే అవుతుందని గేమింగ్ సంస్థ విన్జో వర్గాలు ఆరోపించాయి. మరోవైపు, ఈ పైలట్ ప్రోగ్రాం ద్వారా పరిస్థితులను అధ్యయనం చేసి, తగు విధమైన చర్యలు తీసుకోనున్నట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. యువ జనాభా, ఇంటర్నెట్ .. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా గేమింగ్ పరిశ్రమ వృద్ధికి భారీగా అవకాశాలు ఉన్నాయని పేటీఎం ఫస్ట్ గేమ్స్ (పీఎఫ్‌జీ) అభిప్రాయపడింది. -
నెలకు లక్ష జీతం.. రమ్మీకి బానిసై, కుటుంబ పరిస్థితి భారంగా మారడంతో..
సాక్షి, చెన్నై: తిరువాన్మీయూరు రైల్వే స్టేషన్లో సంచలనం రేపిన దోపిడీ కథ ముగిసింది. భార్యతో కలిసి రైల్వే ఉద్యోగి ఆడిన నాటకం గుట్టు రట్టయ్యింది. ఇంటి దొంగను అరెస్టు చేసిన పోలీసుల కటకటాల్లోకి నెట్టారు. చెన్నై తిరువాన్మీయూరు ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు తనను కట్టి పడేసి రూ. లక్షా 32 వేలు నగదు అపహరించుకెళ్లినట్టు రైల్వే టికెట్ క్లర్ టిక్కారామ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ముందుకు సాగడం కష్టతరంగా మారింది. అయితే, రైల్వే స్టేషన్ మార్గంలో ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలించిన పోలీసులు విస్మయానికి గురయ్యారు. దోపిడీ జరిగిన సమయంలో ఓ మహిళ రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆగమేఘాల మీద వెళ్లిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఆమె టిక్కారామ్ భార్య సరస్వతిగా తేలింది. దీంతో ఇంటి దొంగ నాటకం గుట్టు బట్టబయలైంది. నెలకు దాదాపుగా రూ. లక్ష వరకు జీతం తీసుకుంటున్న టిక్కారామ్ ఆన్లైన్ రమ్మికి బానిస అయ్యాడు. దీంతో లక్షల చొప్పున అప్పుల పాలయ్యాడు. ఈ నెల కుటుంబ పరిస్థితి భారంగా మారడం, స్టేషన్లో సీసీ కెమెరాలు లేవన్న విషయాన్ని పరిగణించి భార్యతో కలిసి నాటకం రచించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ దంపతుల్ని అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. -
రమ్మీ ఆడి ప్రాణాలు పొగొట్టుకున్న వ్యక్తి
-
రమ్మీ ఆడి ప్రాణాలు పొగొట్టుకున్న వ్యక్తి
సాక్షి, విశాఖపట్నం: ఆన్లైన్లో రమ్మీ ఆడి అప్పులపాలైన వ్యక్తి అనుమానస్పద మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. విశాఖలోని గోపాలప్నటం కొత్తపాలెంకు చెందిన నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి మద్దాల సతీష్‌గా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. సతీష్ గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గోపాలపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ సమీపాన ఉన్న రైల్యే ట్రాక్‌పై ఆదివారం సతీష్ మృతదేహాన్నికనుగొన్నారు. అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే సతీష్ ఆన్లైన్ పేకాటకు బానిసై సుమారు కోటి రూపాయలు పోగొట్టుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా మృతుడు సతీష్‌కు భార్య ప్రత్యూష(28), కూతురు సాయి మోక్షిత(6) ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు రైల్వే హాస్పిటల్‌కు తరలించారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్‌ది హత్య, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. -
గోల్మాల్ గేమ్!
సాక్షి, కరీంనగర్: ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్‌లు ఇల్లు గుల్ల చేస్తున్నాయి. యువకులు జూదానికి ఆకర్షితులవుతూ డబ్బులు పోగొట్టుకుని బజారున పడుతున్నారు. అప్పులు చేసి మరీ ఆడడంతో జీవితాలు రోడ్డుపాలు అవుతున్నాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఆన్లైన్ రమ్మీ ఆడుతూ, క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ లక్షల రూపాయలు నష్టపోయి కుటుంబాలను బజారున పడేస్తున్నారు. లాక్డౌన్ కాలంలో యువతకు మరింత ఖాళీ సమయం దొరకడంతో ఆన్లైన్లో గడపడం ఈ పరిస్థితులకు దారితీసిందని పలువురు పేర్కొంటున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచితే నష్టపోకుండా చూసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఆటల్లో పొగొట్టుకున్న డబ్బులను రికవరీ చేయడానికి అవకాశముండదని పేర్కొంటున్నారు. ఆశతో అడుగు పెడుతూ.. ఆన్లైన్ రమ్మీ ఆడుతూ చాలా మంది గుడ్డిగా మోసపోతున్నారు. వీరివైపు నుంచి డబ్బులు పెడుతూ ఆడుతున్నా ఇంకో వైపు ఎవరూ, ఎలా ఆడుతున్నారో కూడా తెలియకుండా గుడ్డిగా ఆడుస్తున్నారు. డబ్బు సంపాదించవచ్చేనే ఆశతో మొదలైన ఆన్లైన్ రమ్మీ ఆడుతూ డబ్బు పోగొట్టుకున్న తర్వాత తిరిగి రాబట్టుకోవాలని ఆడుతూ లక్షల్లో నష్టపోతున్నారు. చాలా మంది ఆన్లైన్ గేమ్స్‌తో అప్పుల పాలవడంతోపాటు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. జోరుగా ఐపీఎల్ బెట్టింగ్‌లు.. ఐపీఎల్ ప్రారంభమైన రోజు నుంచి క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. సాయంత్రమైందంటే చాలు లక్షల రూ పాయలు ఆన్లైన్లో ఖాతాలు మారుతున్నాయి. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఐపీఎల్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ బెట్టింగ్‌లో ఇటీవల పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులే. ఈజీ మనీ కోసం బుకీలు వాట్సాప్, ఆన్లైన్లోనే బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. యువకులు కూడా డబ్బులు బెట్టింగ్ పెట్టి నష్టపోతున్నారు. పోలీసులు బెట్టింగ్‌ను కట్టడి చేస్తున్నారు. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లాక్డౌన్.. లాస్ కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లకే పరిమితమవడం, అత్యవసరమయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా ఉండేవి. ఇలాంటి సమయంలో టైంపాస్ కోసం ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడ్డారు. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారి అప్పులు, ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టడంతో తల పట్టుకుంటున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. బానిస కావద్దు.. యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ రమ్మీ ఆడి అనవసరంగా డబ్బులు నష్టపోకూడదు. చెడు అలవాట్లకు బానిస కావద్దు. ఆన్లైన్ మోసాలు జరిగిన కేసుల్లో డబ్బులు రికవరీ చేయడం కష్టం. యువత సన్మార్గంలో పయనిస్తూ ఆదర్శంగా నిలవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టిసారించాలి. –వీబీ.కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ సీపీ -
జిల్లాలో మినీ క్యాసినోలు..!
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది.. మూడు ముక్కలాట నిలువునా ముంచెస్తోంది! రాష్ట్రంలో పేకాట క్లబ్బులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంటే జిల్లాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా నడుస్తోంది. జిల్లా వ్యాప్తంగా పేకాట యథేచ్ఛగా కొనసాగుతోంది. నిజామాబాద్ నగరంతో పాటు పలు గ్రామాల్లో ప్రత్యేకంగా స్థావరాలను ఏర్పాటు చేసుకుని పత్తాలాట నడుస్తోంది. ఈ క్రమంలో రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. అడపాదడపా జరుపుతున్న దాడుల్లోనే రూ.లక్షల్లో నగదు పట్టుబడుతోందంటే జిల్లాలో ఏ స్థాయిలో జూదం కొనసాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జూదానికి అలవాటు పడిన పేకాటరాయుళ్లు చాలా మంది అప్పుల పాలవుతున్నారు. అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లడానికి పేకాట కారణమవుతోంది. కొందరు తమ ఆస్తులను అమ్ముకుని పేదలుగా మారుతున్నారు. పేకాట స్థావరాల్లో రాత్రి, పగలూ తేడా లేకుండా పోయింది. సెలవులు వస్తే మాత్రం జూదం జోరందుకుంటుంది. టాస్క్‌ఫోర్స్ దాడులు ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ శివారుల్లో ఓ కోళ్ల ఫారంలో ఏర్పాటు చేసిన పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. మొత్తం 13 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన పోలీసులు.. వీరి నుంచి రూ.4 లక్షల నగదు, తొమ్మిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా బుధవారం నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ పత్తాలాట స్థావరంపై కూడా పోలీసులు దాడి చేశారు. ఇక్కడ కూడా రూ. 1.25 లక్షల నగదు పట్టుబడటం గమనార్హం. రెంజల్ మండలం నాగారం శివారులో ఏర్పాటు చేసిన పేకాట స్థావరంపై కూడా టాస్క్‌ఫోర్స్ బృందం ఆదివారం దాడి చేసింది. సుమారు రూ.లక్ష వరకు నగదుతో పాటు కార్లు, బైక్‌లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో మినీ క్యాసినోలు..? నగరంలోని కొన్ని హోటళ్లు మినీ క్యాసినో (జూద గృహాలు)లుగా విలసిల్లుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆయా హోటళ్లలో ప్రత్యేకంగా ఓ ఫ్లోర్‌లోని కొన్ని గదులను పేకాట కోస మే కేటాయించి జూదాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. పేకాట స్థావరమే హోటల్ కావడంతో ఆట వద్దకే మందు, విందు అన్నిం టిని సరఫరా చేస్తున్నారు. జూదం యథేచ్ఛగా సాగుతోందనే సమాచారం సంబంధిత పోలీసు అధికారులకు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లడం లేదనే విమర్శలున్నాయి. ఎప్పుడైనా దాడులు చేసి కేసులు నమోదు చేసిన్పటికీ.. ఆ హోటల్ వివరాలు, పేకాటరాయుళ్ల పేర్ల ను బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతుండడం విశేషం. గుట్టుగా నిర్వహణ.. కొందరు నిర్వాహకులు పేకాట స్థావరాలను గుట్టుగా నిర్వహిస్తున్నారు. కేవలం నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలాచోట్ల పేకాట స్థావరాలు వెలిశాయి. కేటు పేరుతో ఒక్కో ఆటకు రూ.500 నుంచి రూ.వెయ్యి, రూ.2 వేల చొప్పున ఆటను బట్టి వసూలు చేస్తున్నారు. ఇలా కేటు వసూలు చేస్తున్న నిర్వాహకులు పేకాట రాయుళ్లకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎస్‌హెచ్‌వోలకు మెమోలు.. టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు చేస్తున్న ఘటనలపై స్థానిక పోలీస్స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలకు పోలీసు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేయాలని నిర్ణయించారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోనే పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు వెలిసి, రాత్రి పగలూ తేడా లేకుండా జూదం కొనసాగుతుంటే కనీసం పట్టించుకోకపోవడం వెనుక పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయా చోట్ల పేకాట స్థావరం వెలిసిందనే సమాచారం టాస్క్‌ఫోర్స్ అధికారుల వరకు వెళ్లిందంటే స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వదిలేలినట్లేనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి బాధ్యులుగా చేస్తూ సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేయాలని సీపీ కార్తికేయ నిర్ణయించినట్లు సమాచారం. -
జోరుగా పేకాట..!
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ శివారులో పేకాట జోరుగా సాగుతోంది. పట్టణ సమీపంలోని గ్రామాల్లో గట్లు, పొలాలే స్థావరాలుగా పేకాట నిర్వహిస్తున్నారు. యాద్గార్పల్లి గ్రామ శివారులోని కాల్వపల్లికి వెళ్లే దారిలో కాలువ వెంట ద్విచక్రవాహనాలు వెళ్లే దారిలో, అవంతీపురం సమీపంలోని గట్లు పేకాటకు అడ్డాగా మారాయి. యాద్గార్పల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన సొంత వ్యవసాయ భూమిలో అడ్డాను ఏర్పాటు చేసి డబ్బులు తీసుకొని పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా అవంతీపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అవంతీపురం సమీపంలో పేకాట అడ్డా సాగిస్తున్నట్లు తెలిసింది. ఉదయం 10గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షిఫ్టుల వారిగా పేకాట సాగిస్తున్నారు. పేకాట స్థావరాలకు ఎవరూ రాకుండా ఉండే విధంగా, ఒక వేళ వచ్చినా ముందస్తుగానే సమాచారం అందే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. చేతులు మారుతున్న రూ.లక్షలు మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లి శివా రులో నిర్వహిస్తున్న పేకాట అడ్డాలోనే రోజుకు రూ.15 లక్షల రూపాయల నుంచి రూ.20 లక్షల రూపాయల వరకు బెట్టింగ్‌లు సాగుతున్నట్లు సమాచారం. ఆటలో కూర్చునే వ్యక్తి వద్ద కనీసం పాతిక వేల రూపాయలు ఉన్నట్లుగా ముందుగానే చూపించాల్సి ఉంది. ఆ రూపాయలు ఉంటేనే ఆటలో కూర్చోనిస్తారు. అలా కనీసం ఒక్కో అడ్డా వద్ద 20 మందికి పైగా పేకాట ఆడుతున్నారు. అందర్.. బాహర్ పేకాటలో ఎక్కువ మొత్తం డబ్బులు పెట్టడంతో పాటు అతి త్వరగా ముగించే ఆట అందర్– బాహర్. దీని వల్ల ఒక్కొక్కరు లక్షల రూపాయలు పొగొట్టుకున్న వారు సైతం ఉన్నారు. కేవలం మూడు ముక్కలతో ఆడే ఆటలో ఎవరికి పెద్ద ముక్క వస్తే వారే ఆటలో గెలిచినట్లుగా భావిస్తారు. పెద్ద ముక్క వచ్చిందని భావించే వ్యక్తి పోటీగా కూడా పందెంలో అదనంగా కూడా డబ్బులు పెడతారు. పేకాట వల్ల మధ్య తరగతి వ్యక్తులు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. -
రమ్మీ మాయలో యువత చిత్తు
ఇటీవల తణుకు పట్టణానికి చెందిన కిరణ్ అనే యువకుడు ఆన్లైన్ పేకాటకు అలవాటు పడి పెద్దమొత్తంలో సొమ్ములు పోగొట్టుకున్నాడు. తన సెల్ఫోన్లో ఉండే ఆల్‌లైన్ గేమ్‌లకు అలవాటుపడిన అతను రమ్మీ పేరుతో పేకాటకు ఆకర్షితుడయ్యాడు. ప్రారంభంలో తనఖాతాకు డబ్బులు రావడంతో అత్యాశకుపోయి అదే వ్యాపకంతో ఆడటంతో స్వల్పకాలంలోనే రూ.60 వేలు పోగొట్టుకున్నాడు. భీమవరం పట్టణానికి చెందిన మరో వ్యక్తి ఉద్యోగ రీత్యా ప్రతిరోజు తణుకు వస్తుంటాడు. మార్గం మధ్యలో కాలక్షేపం కోసం ఆన్లైన్లో రమ్మీ ఆడటం అలవాటు చేసుకున్నాడు. గతంలో కొంత మేర సొమ్ములు పోగొట్టుకున్నా వాటిని ఎలాగైనా తిరిగి సంపాదించాలని మరోసారి ఆడటం ప్రారంభించాడు. నెల రోజుల వ్యవధిలోనే రూ. 40 వేలు పోగొట్టుకున్నాడు. ఇలా ఎంతోమంది యువత ఆన్లైన్ జూదం బారినపడి తమ జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు. తణుకు: ఇంటర్నెట్ కేంద్రాలు.. ఇంట్లోనే కంప్యూటర్లు.. అరచేతుల్లో సెల్ఫోన్లు.. ప్రయాణాల్లో ల్యాప్‌టాప్‌లు.. ఇలా అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సాధనాలను ఉపయోగించుకుని జేబులు ఖాళీ చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మెయిల్, ఫేస్బుక్, యూట్యూబ్, పలు వెబ్సైట్లలోకి వెళ్లినవారికి దర్శనమిచ్చే ప్రకటనలు అన్ని వర్గాలను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. వ్యాపకంగా మొదలయ్యే ఆన్లైన్ గేమ్‌ల మాయలో పడుతున్న యువత చిత్తవుతున్నారు. వస్తే రూ.వందలు.. పోతే రూ.వేలు అన్న చందంగా తయారైంది. ఇటీవలి కాలంలో ప్రధానంగా రమ్మీ ఆట యువతను ఆకట్టుకుంటోంది. సరదాగా ఆడుతూ జేబులు ఖాళీ చేసుకుంటూ అనేక మంది మౌనంగా లబోదిబోమంటున్నారు. చేతులారా చేసుకుంటున్న తప్పిదం కావడంతో బయటకు చెప్పుకోలేక అంతర్గతంగా మదనపడుతున్నారు. కాలక్షేపం పేరుతో.. సమాజంలో ఇతర నేరాలకు జవాబుదారీతనం వహించే శాఖలు, విభాగాలు, యంత్రాంగాలు తరహాలో ఇంటర్నెట్ మోసాలను నియంత్రించే వ్యవస్థ లేకపోవడంతో నేరాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా పెద్ద చేపలను పట్టడానికి చిన్న ఎరవేసిన చందంగా ఆన్లైన్ రమ్మీ, పేకాట మొదలుపెట్టిన ఆరంభంలో సులభంగా రూ.వందల్లో సంపాదన చూసినవారు ఆ తరువాత రూ.వేలల్లో జేబులు ఖాళీ అవుతున్నా మానుకోలేని దుస్థితి ఎదురవుతోంది. కాలక్షేపం పేరుతో కొందరు.. అలవాటు మానుకోలేక మరికొందరు.. ఇలా ఇంటర్నెట్ జూదం మాయాజాలంలో కూరుకుపోతున్నారు. ఇలాంటి బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ మానుకోలేక తలలు పట్టుకుంటున్నారు. సామాన్యుల్లో ఉండే ఆశను ఆసరాగా చేసుకుని వల విసిరే ఈ ఆన్లైన్ రమ్మీ తరహా మోసాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి ఉంది. అవగాహన ఏదీ..? జిల్లాలో ఇటీవల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరిగింది. టెలికాం సంస్థలు పోటీపడి మరీ ఇంటర్నెట్ను తక్కువ ధరకే అందిస్తుండటంతో వినియోగదారులు పెరిగారు. జిల్లాలో సుమారు 10 లక్షల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు అంచనా. ఇంటర్నెట్లో జరిగే అనేక మోసాల తరహాలోనే సాగుతున్న ఈ ఆన్లైన్ జూదానికి ఎలాంటి చట్టబద్ధత లేకపోయినా యథేచ్ఛగా దాని హవా మాత్రం సాగుతోంది. లెక్కకు మించిన వెబ్సైట్లు పేరుతో పుట్టుకొచ్చే ఆన్లైన్ రమ్మీ ఆకర్షణలు దర్జాగా జేబులు ఖాళీ చేస్తున్నాయి. సొమ్ములు పోగొట్టుకుంటున్నవారు దాన్ని మోసంకాక తమ దురదృష్టంగా భావించడం ఒక కారణమైతే... తమ అత్యాశే ఈ నష్టానికి మూలం కావడం ఈ ఆన్లైన్పేకాట జోరుకు మరో కారణంగా ఉంది. అత్యాసతో పాటు ఆన్లైన్ నిబంధనలపై ప్రజలకు అవగాహన లేకపోవడం కూడా ఈ సొమ్ములు గుల్ల చేస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా తమ బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసే ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాదాపు అధిక సంఖ్యలో ఇంటర్నెట్ వినియోగదారులకు తెలియకపోవడంతో నష్టపోతే ఏం చేయాలో తెలియని అయోమయం నెలకొంది. చట్టబద్ధత లేదు ఆన్లైన్లో డబ్బుకు ఆశపడి ఆడే పేకాటకు చట్టబద్ధత లేకపోవడంతోపాటు ఎలాంటి అనుమతులు లేవు. ఇలా ఆన్లైన్లో పేకాట ఆడటం చట్టరీత్యా నేరం. అత్యాశతో ఆన్లైన్ రమ్మీ ఆడి సొమ్ములు పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇలాంటి చెడు వ్యసనాలపై యువత మక్కువ పెంచుకోకుండా ఉండాలి. – కేఏ స్వామి, సర్కిల్ ఇన్స్పెక్టర్, తణుకు -
ఆన్‘లైన్’లో పేకాటరాయుళ్లు
- స్మార్ట్ ఫోన్లో దర్జాగా ఆన్లైన్ రమ్మీ - బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు టేబుల్ ప్రత్యక్షం - జిల్లాలో రోజుకు రూ. కోట్లలో ఆట - పేదలు మొదలు అధికారులు, ప్రజాప్రతినిధులు లాగిన్ - తరుచూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆడుతున్న వైనం - 15 శాతం కమీషన్‌ను వసూలు చేస్తున్న ఆన్లైన్ సైట్లు కర్నూలులోని వీఆర్ కాలనీకి చెందిన రాము ప్రైవేటు ఉద్యోగి. ఓ రోజు తన కంప్యూటర్లో నెట్ చూస్తుండగా రమ్మీ యాడ్ కనిపిస్తే క్లిక్ చేశాడు. యూజర్ నేమ్, పాస్వర్డ్ అడిగితే ఎంటర్ చేశాడు. మొదట తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 100 ట్రాన్స్ఫర్ చేశాడు. కొద్దిసేపు ఆన్లైన్లో రమ్మీ ఆడగా రూ.500 వచ్చాయి. దీంతో అతనికి నమ్మకం పెరిగింది. ఆడితే లాభాలు వస్తాయని నిత్యం కంప్యూటర్ ముందే ఉండేవాడు. మొదట రూ. 100 ప్రారంభమై రెండు వేల నుంచి 5 వేలకు పెరిగింది. ఇలా పెరుగుతూ పోతూ పోయింది. కానీ తనకు వచ్చింది ఏమి లేదు. సమయం, డబ్బు వృథా చేసుకున్నాడు. కర్నూలు నగరం గణేష్‌నగర్‌కు చెందిన యువకుడు ఉసేన్ స్నేహితుడి ద్వారా ఆన్లైన్ రమ్మీ గురించి తెలుసుకున్నాడు. మొదటల్లో సరదాగా మొదలై చివరకు బానిసయ్యాడు. మొదట రూ, వెయ్యి, రెండు వేలు లాభాలు వస్తే అదృష్టం బాగుందని రేయింబవళ్లు తన స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ నష్టపోయాడు. నెలకు అతని నెట్ బిల్ రూ. 1000 వచ్చేది. నాలుగైదు నెలల్లో రూ.20 వేలు పోగొట్టుకున్నాడు. కుటుంబ సభ్యుల హెచ్చరికలతో మేలుకొని ఇప్పుడు దానిజోళికి వెళ్లడం లేదు. కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): నెట్టింట్లో జూదం ఆరు షోలు.. మూడు డ్రాప్‌లుగా సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పేకాట రాయుళ్లు కూడా అందిపుచ్చుకుంటున్నారు. గతంలో పేకాట ఆడేందుకు కొండలు, గుట్టలు, పొలాల వైపు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎక్కడ కూర్చుంటే అక్కడే దర్జాగా ఆడేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ఆన్లైన్ రమ్మీ టేబుల్ ప్రత్యక్ష మవుతోంది. జిల్లాలో రోజుకు రూ. కోట్లకు పైగా ఆటలు సాగుతున్నాయి. పేదలు మొదలుకొని మధ్యతరగతి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆటలో నిమగ్నం అవుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. పలు అన్లైన్ సైట్లు 15 శాతం కమీషన్‌తో రమ్మీని నిర్వహిస్తున్నాయి. ఽస్మార్ట్ఫోన్ ఉంటే చాలు ఆన్లైన్లో రమ్మీని ఆడేవయచ్చు. వందలాది ఆన్లైన్ రమ్మీ సైట్ల యాప్‌లు ఉన్నాయి. అందులో ఏదో ఒక్కదాన్ని డౌన్లోడ్ చేసుకొని అకౌంట్‌ను ఏర్పాటు చేసుకొని బ్యాంకు అకౌంట్ నుంచి నగదును జమ చేసుకుంటే చాలు ఆన్లైన్లో టేబుళ్లు సిద్ధంగా ఉంటాయి. ఐదు పైసల ఆట నుంచి..... ఆన్లైన్లో రమ్మీ ఆటకు భలే డిమాండ్ ఉంది. ఐదు పైసల నుంచి కోట్లాది రూపాయల వరకు ఆట జరుగుతుంది. 24 గంటల పాటు వేలాది టేబుళ్లు సిద్ధంగా ఉంటాయి. ఒక్కో టేబుల్ ఆరుగురు రమ్మీదారులు ఉంటారు. ఈ ఆటలో పాల్గొనాలంటే ముందుగా అకౌంట్లో ఉండే నగదును చూపించాల్సి ఉంటుంది. ఆ నగదును బట్టి ఆరుగురికి ఒక్కో టేబుల్ మాదిరి రమ్మీ జోరుగా కొనసాగుతోంది. వీరు ఎక్కడికో వెళ్లి ఆట ఆడాల్సిన పనిలేదు. నలుగురితో మాట్లాడుతూనే కానిచ్చేయవచ్చు. ఎక్కువగా టీ పాయింట్లు, ఇళ్లు, కార్యాలయాల్లోనే ఆట సాగుతోంది. 15 శాతం కమీషన్‌ను వసూలు చేస్తున్న వైనం... ఆన్సైట్లన్నీ రమ్మీ నిర్వహణ కోసం గెలుచుకున్న వారి సొమ్మును 15 శాతం కమీషన్‌ను వసూలు చేస్తున్నాయి. ఓ వ్యక్తి వెయ్యి రూపాయలు గెలుచుంటే అతినికి 15 శాతం అంటే 150 రూపాయలు పట్టుకొని 850 రూపాయలను అకౌంట్లలో జమ చేస్తున్నాయి. ఇలా రేయింబవళ్లు జరిగే ఆన్లైన్ రమ్మీతో ఆన్లైన్ సైట్లకు కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చిపడుతోంది. అయితే దాని నుంచి బాగుపడిన వారు మాత్రం ఎవరూ కనిపించడం లేదు. ఎవరినీ పలుకరించిన పోగుట్టున్నామనే చెబుతుండటంతో అంతా మోసమేనని తెలుస్తోంది. పేదలే సమిధలు... ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న వారిలో ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజలే ఉన్నారు. వీరంతా పగలంతా కష్టపడి సంపాదించిన సొమ్మును రమ్మీ కోసం తగిలేస్తున్నారు. అంతేకాక చిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు, అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా రమ్మీకి అంకితమయినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆన్లైన్ సైట్ల రమ్మీలో నిత్యం కనిపిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఏ స్థాయిలో ఆట జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో రోజులో రూ. పది కోట్లకుపైగా ఈ ఆట జరుగుతోందని అంచనా. కుటుంబాలను నాశనం చేసుకోవద్దు: ఆకే రవికృష్ణ, జిల్లా ఎస్పీ జూదానికి దూరంగా ఉండకపోతే కుటుంబాలు నాశనం అవుతాయి. ఆన్లైన్/ఆఫ్‌లైన్ అయినా జూదం వద్దు. ఆన్లైన్ సైట్లపై దృష్టి సారిస్తాం. సాంకేతిక పరిజ్ఞానంలో నూతనంగా వస్తున్న ఆధునికతను మంచికోసం వినియోగించుకోవాలని, చెడుకోసం వద్దు. ఆన్లైన్ రమ్మీతో సైట్లకే లాభం. పేదలు మాత్రం సమిధలు కావాల్సిందే. -
భల్లాలదేవ ముందే జాగ్రత్త పడ్డాడట!
యంగ్ హీరో రానా, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చిక్కుల్లో పడ్డారు. ఓ ఆన్ లైన్ గేమ్‌కు సంబంధించిన యాడ్ లో కనిపించినందుకు ఈ ఇద్దరిపై పోలీసు కేసు నమోదైంది. ‘బాహుబలి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా, ప్రకాష్ రాజ్‌తో కలిసి ‘జంగిల్ రమ్మీ’ అనే ఆన్లైన్ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ వాణిజ్య ప్రకటన ద్వారా ఈ ఇద్దరూ గ్యాంబ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని కోయంబత్తూర్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కేసు వేశాడు. రానా, ప్రకాశ్ రాజ్ ఈ యాడ్‌లో నటించడంపై సోషల్ మీడియాలో గతంలోనూ విమర్శలు వచ్చాయి. నైతికతలేని గ్యాంబ్లింగ్‌గా దీనిని విమర్శించినవారూ లేకపోలేదు. అయితే, ఈ యాడ్ విషయంలో రానా ముందే జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తన లాయర్ సలహా తీసుకున్న తర్వాత ఆయన ఈ వాణిజ్య ప్రకటనలో నటించినట్టు చెప్తున్నారు. రమ్మీ అంటే గ్యాంబ్లింగ్ కాదని, అది నైపుణ్యానికి సంబంధించిన ఆట అని, దీని కోసం ప్రచారం చేయడం చట్టవ్యతిరేకం కాదని రానాకు లాయర్ చెప్పినట్టు అంటున్నారు. మొత్తానికి రానా, ప్రకాశ్ రాజ్‌లకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త వేసిన కేసు నిలబడదని వినిపిస్తోంది. -
రానా, ప్రకాష్ రాజ్‌లపై పోలీస్ కంప్లయింట్
స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నటీనటులు, తమ ఇమేజ్ను క్యాష్ చేసుకునేందుకు పలు ప్రకటనల్లో నటిస్తుంటారు. అయితే అలా డబ్బు కోసం నటులు చేసే ప్రకటనలు అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతుంటాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రానా, నటుడు ప్రకాష్ రాజ్ ఇలాంటి ఇబ్బందుల్లోనే పడ్డారు. ఈ ఇద్దరు కలిసి ఓ ఆన్ లైన్ గేమ్‌కు సంబందించిన యాడ్ లో నటించినందుకు గాను వీరిపై పోలీస్ కంప్లయింట్ నమోదయ్యింది. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా, ప్రకాష్ రాజ్‌తో కలిసి జంగిల్ రమ్మీ అనే గేమ్‌కు సంబందించిన యాడ్‌లో నటించారు. ఈ ఇద్దరు గ్యాంబ్లింగ్‌ను ప్రమోట్ చేస్తున్నారంటూ కోయంబత్తూర్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కేసు వేశాడు. గతంలోనూ రానా ఈ యాడ్ చేయడటంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. తాజాగా కేసుకు నమోదు కావటంతో రానా ఎలా స్పందిస్తాడో చూడాలి. -
రమ్మీ... రమ్మటోందా?
శ్రీకాకుళం: ఈజీ మనీ... క్షణాల్లో లక్షాధికారుమైపోవాలనే ఆలోచన చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. ఈ ఆలోచననే అదనుగా చేసుకుని ఊరిలో బెట్టింగ్ నుంచి ఆన్లైన్లో పేకాట వరకు అంతా మోసం చేయడానికి రెడీ అయిపోతున్నారు. యువత కూడా ఈజీగా వీరి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఫేస్బుక్ తెరిస్తే చాలు ఊరూ పేరూ లేని వ్యక్తులు ‘మేం అంత గెలిచాం.. ఇంత గెలిచామంటూ’ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏదో వెబ్సైట్ బ్రౌజ్ చేద్దామన్న రమ్మీ అంటూ రమ్మంటూ ప్రకటనలు కనిపిస్తున్నాయి. క్షణాల్లో డబ్బులు సంపాదించాలనే యా వతో జిల్లాలోనూ చాలా మందికి వీటికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా ఉన్న డబ్బులు క్షవరం చేయించుకుని మోసపోతున్నారు. బంగారు ఆభరణాలతోపాటు విలువైన వస్తువులను తనఖా పెట్టి మరీ జూదమాడి కుదేలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ కూడా ఇలాగే తయారైంది. చాలా మంది పాకెట్ మనీగా ఇళ్లల్లో ఇచ్చింది ఇలాంటి బెట్టింగులపై పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బైకులు, సెల్ఫోన్లు వంటి ఖరీదైన వస్తువులను అమ్మి జూదం, బెట్టింగ్‌లకు పెడుతున్న వారూ ఉన్నారు. ఇటీవలి కాలంలో పోలీసులకు చిక్కిన నేరస్తుల్లో ఎక్కువమంది యువకులే కావడం, వీరంతా బెట్టింగ్, జూదంలోనే పట్టుబడుతుండడమే దీనికి నిదర్శనం. బెట్టింగు నిర్వహిస్తున్న వారు అన్ని వర్గాల అధికారులను తమ దారిలోకి తెచ్చుకునేందుకు నెలనెలా లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఆన్లైన్ జూదాన్ని అదుపులోకి ఎలా తేవాలన్నది ఎవరికీ తెలి యడం లేదు. అలాగే జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 20 వరకు జూదశాలలు నడుస్తున్నట్లు అనధికారిక లెక్క ప్రకారం తెలుస్తోంది. వీటిలో కొన్ని ప్రజాప్రతినిధులు, కొందరి అధికారుల కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటిని తక్షణంఅరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.