లక్నో : మతిస్థిమితం సరిగాలేని ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ఇటుకలతో కొట్టి చంపింది. ఉత్తర ప్రదేశ్లోని ఫక్కబాగ్లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం విమ్లా అనే మహిళ తన ఇద్దరు కుమారులు రామ్ కిషోర్ (5), కమల్ కిషోర్ (3) లతో కలిసి స్థానికంగా నివసిస్తోంది. బుధవారం సాయంత్రం పిల్లలిద్దరూ ఇంటి బయట ఆడుకుంటున్నారు. ఈ సందర్భంగా పిల్లలను ఇంట్లోకి రావాలని విమ్ల ఆదేశించింది.
అయితే వాళ్లు ఎంతసేపటికీ ఇంట్లోకి రాకపోవటంతో కోపం పట్టలేని ఆమె పిల్లలను ఇటుకలతో సుమారు పది నిమిషాల పాటు మోదింది. ఆ సమయంలో పిల్లల ఏడుపు, అరుపులను విన్న పక్కంటివాళ్లు ...పోలీసులకు సమాచారం అందించారు. రక్తమోడుతున్న వారిని చికిత్స ఆస్పత్రికి తరలించారు. రామ్ కిషోర్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, కమల్ కిషోర్ను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. పోలీసులు విమ్లను అదుపులోకి తీసుకుని ఆమెపై మర్డర్ కేసు నమోదు చేశారు. కాగా విమ్ల చాలా సమయాల్లో విచక్షణ కోల్పోయి ప్రవర్తించేదని ఆమె తండ్రి కమ్లేష్ పోలీసులు తెలిపాడు.
పిల్లలను ఇటుకలతో కొట్టి చంపిన తల్లి
Published Thu, Nov 6 2014 11:08 AM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM
Advertisement
Advertisement