
నిందితుడు వెంకటేశం.. బాలిక సిద్రాబేగం
సాక్షి, నారాయణఖేడ్: ఆరేళ్ల బాలికను కడ్నాప్‌నకు యత్నించిన ఘటన నారాయణఖేడ్ పట్టణంలో శనివారం కలకలం రేపింది. నారాయణఖేడ్ పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఎక్బాల్ ఆహ్మాద్ కూతురు సిద్రాబేగం (6) ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెకందిన వెంకటేశం(48) బాలికను భుజంపై వేసుకొని పరుగులు పెట్టాడు.
ఇది గమనించిన కాలనీ వాసులు బాలిక తండ్రి ఎక్బాల్ అహ్మద్‌కు విషయం తెలియజేశారు. బాలికను ఎత్తుకొని పరుగెడుతున్న నిందితుడిని బైక్‌పై వెంబడించి శాస్త్రినగర్‌లో పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కాగా నిందితుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించినట్లు ఇన్‌చార్జి డీఎస్పీ నల్లమల రవి తెలిపారు. నిందితుడిని ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయానికి తరలిస్తామని చెప్పారు.