woman kills children
-
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మహిళ దారుణం
నిజామాబాద్ (ఎల్లారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని మైనర్‌కు హత్య చేసిన ఘటన మండలంలోని మేడిపల్లి జీపీ పరిధిలోగల హన్మంతు తండాలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. తండాకు చెందిన జోగిని లక్ష్మి, తన అక్క కొడుకు రాజు (16)తో కలిసి ఉంటోంది. రాజు తల్లిదండ్రులు కొంతకాలం క్రితం మృతిచెందారు. దీంతో రాజు తన చిన్నమ్మ లక్ష్మి దగ్గర ఉంటూ పశువుల కాపరిగా పనిచేస్తు న్నాడు. లక్ష్మి పలువురితో వివాహేతర సంబంధాలు నేర్పుతుంది. సీతాయిపల్లి గ్రామానికి చెందిన కుర్మ మల్లయ్యతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో తనకు ఆ కుర్రాడు అడ్డుగా ఉన్నాడని భావించింది. ఈక్రమంలో ఆదివారం రాత్రి అతడు నిద్రపోయిన తర్వాత పథకం ప్రకారం ప్రియుడితో కలిసి చీరతో ఉరి వేసి హతమర్చారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సీఐ రామన్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. -
పిల్లలను ఇటుకలతో కొట్టి చంపిన తల్లి
లక్నో : మతిస్థిమితం సరిగాలేని ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ఇటుకలతో కొట్టి చంపింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఫక్కబాగ్లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం విమ్లా అనే మహిళ తన ఇద్దరు కుమారులు రామ్ కిషోర్ (5), కమల్ కిషోర్ (3) లతో కలిసి స్థానికంగా నివసిస్తోంది. బుధవారం సాయంత్రం పిల్లలిద్దరూ ఇంటి బయట ఆడుకుంటున్నారు. ఈ సందర్భంగా పిల్లలను ఇంట్లోకి రావాలని విమ్ల ఆదేశించింది. అయితే వాళ్లు ఎంతసేపటికీ ఇంట్లోకి రాకపోవటంతో కోపం పట్టలేని ఆమె పిల్లలను ఇటుకలతో సుమారు పది నిమిషాల పాటు మోదింది. ఆ సమయంలో పిల్లల ఏడుపు, అరుపులను విన్న పక్కంటివాళ్లు ...పోలీసులకు సమాచారం అందించారు. రక్తమోడుతున్న వారిని చికిత్స ఆస్పత్రికి తరలించారు. రామ్ కిషోర్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, కమల్ కిషోర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. పోలీసులు విమ్లను అదుపులోకి తీసుకుని ఆమెపై మర్డర్ కేసు నమోదు చేశారు. కాగా విమ్ల చాలా సమయాల్లో విచక్షణ కోల్పోయి ప్రవర్తించేదని ఆమె తండ్రి కమ్లేష్ పోలీసులు తెలిపాడు.