
బీజింగ్: పార్టీ ప్రధాన కార్యదర్శిగా రెండోసారి పగ్గాలు చేపట్టనున్న చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ గత ఐదేళ్లలో పార్టీలో తన వ్యతిరేకులు చేపట్టిన రాజకీయ తిరుగుబాటును పలుమార్లు అడ్డుకున్నారని చైనా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అవినీతికి వ్యతిరేకంగా జిన్‌పింగ్ చేపట్టిన కార్యక్రమాలతో ఇబ్బందులు పడుతున్న కొందరు మాజీ రాజకీయ ప్రముఖులు ఈ కుట్ర పన్నారని చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ లియూ షియూ చెప్పారు.
‘పార్టీలో ఉన్నత పదవుల్లో ఉన్న కొందరు పార్టీలో, ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారు. జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చాక అవినీతిపై పోరాటం ప్రారంభించారు. దీంతో జిన్‌పింగ్‌ను పార్టీ బాధ్యతలనుంచి కూలదోసేందుకు విఫలయత్నం చేశారు’ అని లీయూ చెప్పారు. సోషలిజం సిద్ధాంతాలను నమ్మే జిన్‌పింగ్ ఐదేళ్లలో 440 మంది పార్టీ సీనియర్ నాయకులు , 43 మంది ఉన్నతాధికారులు, 2,78,000 మంది పార్టీ కార్యకర్తలను అవినీతి ఆరోపణలపై శిక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment