బీజింగ్: చైనా–భారత్ సరిహద్దులో స్థిర నివాసం ఏర్పాటుచేసుకుని చైనాకు రక్షణగా ఉండాలని ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ టిబెట్ పశువుల కాపరులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. టిబెట్‌లోని లూంజె కౌంటీలో తమ టౌన్‌షిప్ గురించి వివరిస్తూ ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు జిన్‌పింగ్‌కు లేఖ రాశారు.
దానికి బదులు పంపుతూ ఆయన...భారత సరిహద్దులో నివాసాలు ఏర్పరచుకోవాలని సూచించారు.చైనా తనదిగా చెప్పుకుంటున్న భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీపంలోలూంజె కౌంటీ ఉంది. ఆ బాలికల కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను జిన్‌పింగ్ ప్రశంసిస్తూ వారికి ధన్యవాదాలు చెప్పారని తెలిపింది. మరింత మంది పశువుల కాపర్లు అక్కడ నివసించేలా ఆ కుటుంబం ప్రోత్సహిస్తుందని జిన్‌పింగ్ ఆశిస్తున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment