జిన్‌పింగ్‌ కోసం రాజ్యాంగ సవరణకు సిద్ధం | China begins parliament season, set to ratify removal of term limit for Xi Jinping | Sakshi
Sakshi News home page

జిన్‌పింగ్‌ కోసం రాజ్యాంగ సవరణకు సిద్ధం

Published Sun, Mar 4 2018 3:43 AM | Last Updated on Sun, Mar 4 2018 3:43 AM

China begins parliament season, set to ratify removal of term limit for Xi Jinping - Sakshi

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌

బీజింగ్‌: కమ్యూనిస్ట్‌ చైనాలో వార్షిక పార్లమెంటు సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను నిరవధికంగా అదే పదవిలో కొనసాగేలా రాజ్యాంగంలో మార్పులు చేసే అవకాశముంది. చైనా పార్లమెంటు అయిన జాతీయ ప్రజా కాంగ్రెస్‌తో పాటు చైనీస్‌ పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటివ్‌ కాన్ఫరెన్స్‌సభ్యులైన దాదాపు 5,000 మంది ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.  ఎన్‌పీసీలో 269 మిలటరి ప్రతినిధులు సహా 2,980 మంది సభ్యులున్నారు. చైనాలో అన్ని రంగాల ప్రముఖులతో ఏర్పాటుచేసిన సీపీపీసీసీలో యాక్షన్‌ నటుడు జాకీచాన్‌ కూడా సభ్యుడిగా ఉండటం విశేషం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement