
జిన్‌పింగ్‌తో భేటీ అయిన దోవల్
బీజింగ్: భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. బ్రిక్స్ దేశాల ఎన్‌ఎస్‌ఏలతో జిన్‌పింగ్ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది బ్రిక్స్ బృందానికి జిన్‌పింగ్ నాయకత్వం వహిస్తున్నారు.
సరిహద్దు రాష్ట్రం సిక్కిం సెక్టార్‌లోని డోక్లాం వద్ద చైనా భారత్‌ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఏలతో జిన్‌పింగ్ నిర్వహించిన సమావేశానికి దోవల్ హాజరవడం గమనార్హం. ‘భద్రతా సహకారం, పరస్పర విశ్వాసాలను పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేశారు’ అని జిన్‌పింగ్ అన్నారు. చర్చల్లో భాగంగా దోవల్, చైనా ఎన్‌ఎస్‌ఏ జియేచీతోనూ భేటీ అయ్యారు.