
సియోల్ : చైనా, ఉత్తర కొరియాల మధ్య బంధం ఎప్పటికీ కొనసాగుతుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మరోసారి స్పష్టం చేశారు. జిన్‌పింగ్ రెండోసారి అధ్యక్షుడుగా ఎన్నిక కావడంతో.. ఆయనకు ఉత్తర కొరియా నేత కింమ్ జాంగ్ ఉన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగ్ జిన్‌పింగ్‌కు కిమ్ ఒక లేఖ రాశారు.
కిమ్ శుభాకాంక్షలు, లేఖపై హర్షం వ్యక్తం చేసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ఉత్తర కొరియాతో గతంలో మాదిరిగానే ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment