వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ పౌరులను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం కాల్పులకు తెగబడుతోంది. తాజాగా సుమారు వెయ్యి మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్న మరియుపోల్ థియేటర్‌పై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో మృతుల సంఖ్య తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో చైనా, అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం జో బైడెన్, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరగబోతున్నట్టు వైట్ హౌజ్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధంలో పుతిన్‌కు చైనా సహకరించడం, ఆయుధ సామాగ్రి అందిస్తోందన్న అమెరికా ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చ జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. అంతకు ముందు జిన్‌పింగ్ నాటో విస్తరణను సైతం వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
మరోవైపు.. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం రష్యాను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయస్థానం మాస్కో బలప్రయోగం పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, న్యాయస్థానం తీర్పును లెక్కచేయకుండగా రష్యన్ బలగాలు దాడిని మరింత పెంచాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment