
బీజింగ్: చైనా మిలటరీ రిజర్వు బలగాలు కూడా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ), సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) అజమాయిషీ కిందికి వచ్చాయి. మావో సెటుంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన జిన్‌పింగ్ ఇప్పటికే సీపీసీ, సీఎంసీలకు నేతృత్వం వహిస్తున్నారు. దేశానికి ప్రపంచ స్థాయి సైన్యాన్ని నిర్మించడానికి తిరుగులేని నాయకత్వం అవసరమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వు బలగాలు జూలై 1వ తేదీ నుంచి సీపీసీ, సీఎంసీల ఆదేశాలకు లోబడి పనిచేస్తాయని అందులో పేర్కొంది. ప్రస్తుతం రిజర్వు బలగాలు సైనిక విభాగాలు, కమ్యూనిస్టు పార్టీ స్థానిక కమిటీల అజమాయిషీలో ఉన్నాయి.