చైనా అరాచకం.. తైవాన్‌ రక్షణ శాఖ అధికారి ఖతం! | Taiwan Defence Official Found Dead In Hotel Room | Sakshi
Sakshi News home page

చైనా అరాచకం.. తైవాన్‌ రక్షణ శాఖ అధికారి ఖతం!

Published Sun, Aug 7 2022 4:13 AM | Last Updated on Sun, Aug 7 2022 4:14 AM

Taiwan Defence Official Found Dead In Hotel Room - Sakshi

తైపీ: ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్‌ రక్షణ శాఖ అధికారి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించింది. తైవాన్‌ రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగం ఉన్నతాధికారి ఔ యాంగ్‌ లీ–సింగ్‌ శనివారం ఉదయం దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్‌ గదిలో శవమై కనిపించారు. ఆయన మృతికి కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదని రక్షణ శాఖ వెల్లడించింది. 

‘నేషనల్‌ చుంగ్‌–షాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ డిప్యూటీ హెడ్‌ హోదాలో ఔ యాంగ్‌ వివిధ క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బిజినెస్‌ ట్రిప్‌పై కొనసాగుతూ అనుమానాస్పదంగా మరణించారు. ఇదిలా ఉండగా, చైనా దాడుల్లోనే ఔ యాంగ్‌ ప్రాణాలు కోల్పోయాడని తైవాన్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై చైనా ఇంకా స్పందించలేదు. 

ఇది కూడా చదవండి: ప్లీజ్‌ ఆయన్ని అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement