భారత్‌కు సన్నిహితంగా ఉన్న బంగ్లాదేశ్‌ను దగ్గర చేసుకునేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది.
ఢాకా: భారత్‌కు సన్నిహితంగా ఉన్న బంగ్లాదేశ్‌ను దగ్గర చేసుకునేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. కీలకమైన బ్రిక్స్ సదస్సుకు ముందు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. షేక్ హసీనా ప్రభుత్వంతో విద్యుత్, రహదారులు, రైల్వే అనుసంధానత మొదలైన 40 కీలక అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందాల విలువ రూ. 1.3 లక్షల కోట్లు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బంగ్లా, చైనాలు మంచి మిత్రులని, ఉత్తమ భాగస్వాములని చర్చల అనంతరం జిన్‌పింగ్ అన్నారు.