ఫైల్‌ఫొటో
మాస్కో: రష్యా సైనిక దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో నరమేధం జరుగుతోంది. బాంబులు, మిస్సెల్స్‌తో రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. రెండవ రోజే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు చుట్టుముట్టాయి.
తాజాగా.. ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సైన్యం పోరాటం ఆపితే చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్ ఆర్మీ ఆయుధాల్ని వదలి లొంగిపోవాలని, అప్పుడే చర్చలు ముందుకెళ్తాయని ఆ ప్రకటనలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ వెల్లడించారు. ఈ ప్రకటన అనంతరం తాము కూడా చర్చలకు సిద్దంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం ప్రకటించారు. ఈ తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
శుక్రవారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేయాలని జిన్‌పింగ్ కోరినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని పుతిన్‌ను జిన్‌పింగ్ కోరారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు తాను సిద్ధమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పుతిన్, జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment