కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ పౌరులు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. తాజాగా రష్యా సైన్యం దాడుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో 1200 మందికి పైగా ఉక్రెనీయుల మృతదేహాలు బయటపడినట్టు ఆ దేశ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో రష్యా దుశ్చర్య ప్రపంచానికి బహిర్గతమైందన్నారు.
మరోవైపు.. దక్షిణ కొరియా ప్రభుత్వ నేతలతో జరిగిన వీడియో మీటింగ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. రష్యాపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రష్యా దాడి వల్ల దక్షిణ నగరమైన మరియుపోల్‌లో వేలాది మంది మృతిచెందారని అన్నారు. మురియుపోల్ నుంచి భారీ సంఖ్యలో శరణార్థులు పారిపోయారని తెలిపిన జెలెన్ స్కీ.. శరణార్థులు ఇచ్చిన ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ వేలాది మంది మృతిచెందారని వెల‍్లడించారు. భారీ గొయ్యిల్లో ఆ మృతదేహాలను ఖననం చేశారని ఆరోపించారు. చెచన్ ఫైటర్లు అక్కడ లూటీలకు పాల్పడినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై రిపబ్లిక్ ఆఫ్ చెచెన్యా దేశాధ్యక్షడు రంజాన్ కడీరోవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ వీడియోలో మాట్లాడుతూ.. మరియుపోల్ మాత్రమే కాదు, కీవ్‌పై కూడా దాడి చేస్తామని పేర్కొన్నాడు. ఈ క్రమంలో కీవ్, ఇతర నగరాలను కూడా స్వాధీనం చేసుకుంటామని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment