కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో సైనికులు, పౌరులు మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో రష్యా దాడులు నిలిపివేయాలని పలు దేశాలు ముక్తకంఠంతో పుతిన్ హెచ్చరిస్తున్నాయి. కానీ, పుతిన్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా తనదైన శైలిలో ఆయా దేశాలను హెచ్చరిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య వొలెనా జెలెన్స్కా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టింది సైనిక చర్య కాదని, పూర్తిస్థాయి యుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచదేశాలకు తెలియజేయాలని ఇతర దేశాల ప్రథమ మహిళలను కోరారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టును రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా జెలెన్ స్కా మాట్లాడుతూ.. రష్యా చెప్పినట్లుగా ఉక్రెయిన్‌లో జరుగుతున్నది ప్రత్యేక సైనిక చర్య కాదు. అది పూర్తి స్థాయి యుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. మీ బిడ్డలు ఉక్రెయిన్‌తో యుద్ధ విన్యాసాల్లో పాల్గొనడం లేదు. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే క్రమంలో మరణిస్తున్నారని రష్యన్ తల్లులకు వినిపించేలా చెప్పండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యుద్ధం మా దేశం మీదే, ఐరోపా సరిహద్దుల్లో జరుగుతుందని భావించకండి. భవిష్యత్తులో మీపై దాడిచేసే శత్రువును ఉక్రెయిన్ ఎదుర్కొంటోందని చెప్పండి. పుతిన్ అణు దాడి గురించి బెదిరిస్తున్నారు.
ఒకవేళ అదే జరిగితే.. ప్రపంచంలో సురక్షితమైన ప్రదేశం అనేదే ఉండదని సూచించండి అంటూ ఆమె ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాలని అభ్యర్థించారు. ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటోంది. తనను తాను రక్షించుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment