బీజింగ్: రష్యా-చైనా మధ్య స్నేహం ఇప్పటికీ చాలా ధృడంగా ఉందని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యూ సోమవారం స్పష్టం చేశారు. మాస్కో-బీజింగ్ మధ్య మంచి స్నేహం ఉందని, చైనా-రష్యా సంబంధాన్ని ప్రపంచంలోని అత్యంత కీలకమైన ద్వైపాక్షిక సంబంధంగా ఆయన అభివర్ణించాడు. అవసరమైతే ఇరు దేశాల శాంతి పునరుద్ధరణ కోసం మధ్యవర్తిత్వంపై పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నన నేపథ్యంలో చైనా మాత్రం రష్యాతో తమకు బలమైన స్నేహం కొనసాగుతోందని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా ఉక్రెయిన్‌కు మానవతా సహాయాన్ని అందిస్తున్నామని వాంగ్ తెలిపారు.
చదవండి: రష్యన్ యుద్ధ ట్యాంకు పై రెపరెపలాడుతున్న ఉక్రెయిన్ జాతీయ జెండా!
అయితే గత వారం యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ మాట్లాడుతూ.. రష్యా ఉక్రెయిన్ మధ్య భవిష్యత్తులో శాంతి చర్చలకు చైనా మధ్యవర్తిత్వం వహించాలని తెలిపారు. చైనా మధ్యవర్తిత్వం వహిస్తే పరిస్థితులు చక్కదిద్దుకుంటాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అనేక దేశాల ప్రతినిధులు సైతం ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య యుద్ధం పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలపై ఆర్థిక భారంతో పాటు ఎన్నో సమస్యలు తలెత్తుతాయని, వీలైనంత తొందరలో ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య మధ్యవర్తిత్వానికి చైనా ముందుకు వచ్చినప్పటికీ.. ఈ ప్రతిపాదనపై ఉక్రెయిన్ ఇప్పటి వరకు ఏ విధంగానూ స్పందించలేదు.
చదవండి: యుద్ధం 11 ఏళ్ల బాలుడిని ఒంటరిగా దేశం దాటేలా చేసింది
Comments
Please login to add a commentAdd a comment