కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా వార్ కారణంగా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ దేశ పౌరులు, విద్యార్థుల తరలింపుపై అన్ని దేశాలు ప్రత్యేక విమానాలను, ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెంచాయి. తాజాగా చైనా తమ దేశ పౌరులను స్వదేశానికి తరలించే ప్రక్రియపై ఉక్రెయిన్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది.
ప‍్రస్తుతం చైనీయులు ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లే పరిస్థితులు లేవని చైనా రాయబారి ఫ్యాన్ జియోన్రాంగ్ ఆదివారం వెల్లడించారు. రష్యా దాడి ముగిసే వరకు చైనీయులు సంయమనం పాటించాలని కోరారు. తాను కూడా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోనే ఉన్నానని చైనీయులకు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉన్న చైనా పౌరులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వీలైనంత త్వరలో చైనీయులను సురక్షితంగా స్వదేశానికి చేరుస్తామని భరోసానిచ్చారు. చైనీయులు సురక్షితంగా ఉండేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
మరోవైపు.. ఉక్రెయిన్ పౌరులతో చైనా దేశస్తులు వాగ్వాదాలు, ఘర‍్షణలకు దొగొద్దని సూచించారు. వారు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని, వారి మనోభావాలను అర్ధం చేసుకొని వారికి సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment