
బీజింగ్: టిబెట్‌ను బల ప్రయోగంతో ఆక్రమించుకున్న డ్రాగన్ దేశం చైనా ఇప్పుడు మరో కుతంత్రానికి తెరతీస్తోంది. 2030 నాటికి లక్ష మందికిపైగా టిబెట్ ప్రజలను వారి సంప్రదాయ జీవన విధానం నుంచి దూరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే టిబెట్ పౌరులను వారి సొంత గ్రామాల నుంచి దూరంగా తరలిస్తారు. ఇందుకోసం చైనా చెబుతున్న సాకు పర్యావరణ పరిరక్షణ. సముద్ర మట్టానికి 4,800 మీటర్లకుపైగా ఎత్తున్న ప్రాంతాల్లో నివసించే వారిని ఇతర ప్రాంతాలకు తరలించనున్నట్లు చెబుతోంది. జనావాసాల కారణంగా పర్యావరణం దెబ్బతింటోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నమ్మబలుకుతోంది.
జనాన్ని తరలించడానికి చైనా ప్రభుత్వం తన సైనికులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. వివాదాస్పద సరిహద్దుల్లో కొత్త గ్రామాలను చైనా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవి తమ భూభాగాలే అని వాదిస్తోంది. వివాదాస్పద హిమాలయ ప్రాంతాల్లో 624 గ్రామాలను నిర్మించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు హాంకాంగ్‌కు చెందిన ఓ పత్రిక ఇటీవల వెల్లడించింది. చైనా కుట్రల కారణంగా కనీసం 2 లక్షల మంది టిబెట్ ప్రజలు సహజ ఆవాసాల నుంచి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ముదిరిన రాజకీయ సంక్షోభం.. పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళనకారులు
Comments
Please login to add a commentAdd a comment