చైనాలో నోరు తెరవడం అంత ఈజీకాదు. నోరుతెరిచి ప్రభుత్వంపై జోకేయాలనుకున్నా కష్టమే. అలాంటిది ఎర్రపాలకులకు ఎర్రికోపం తెప్పిస్తే ఇంకేమన్నా ఉందా? కోపం తెపిస్తే ఏమవుతుందంటారా? మనుషులు ఉన్న చోట నుంచే మాయమైపోతారు. ఇలా మాయమైతున్న మనుషులు..మామూలు మనుషులు కాదు. వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలున్న ప్రముఖులు కావడం విశేషం. ప్రభుత్వ విధానాలు నచ్చక కళ్లు మూసుకుని కూల్‌గా ఉండలేక ఇదేంటి అధ్యక్షా అని ప్రశ్నిచ్చారు. ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇదిగో చివరికి ఇలా కటకటాల పాలవుతున్నారు. ఇప్పటికే వ్యక్తులు, సంస్థలు' చైనా ప్రభుత్వ తీరుపై హడలెత్తిపోతుంటే తాజాగా.. అదే ప్రభుత్వం దెబ్బకు చైనాలో అతిపెద్ద బీమా సంస్థకు చైర్మన్‌గా ఉన్న వాంగ్ బిన్‌పై కమ్యూనిస్ట్ పార్టీ అవినీతి నిరోధక శాఖ విచారణకు ఆదేశించింది.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దేశంలోని రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్ని ప్రక్షాళన చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చైనాలో అతిపెద్ద బీమా సంస్థ 'చైనా లైఫ్ ఇన్సూరెన్స్' చైర్మన్‌గా ఉన్న 'వాంగ్ బిన్' పై కమ్యూనిస్ట్ పార్టీ చెందిన యాంటీ కరప్షన్ కమిషన్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాంగ్ ప్రభుత్వ విధానాల్ని ఉల్లంఘించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అతడిపై డిసిప్లినరీ యాక్షన్ కింద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు చైనా సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్ పేర్కొంది.
ఇందులో భాగంగా ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్యూరిటీస్ టైమ్స్ ప్రకారం..ఈ ఏడాది అవినీతికి పాల్పడిన వ్యక్తుల్లో చైనా ఫైనాన్స్ రంగంలో వాంగ్ తొలి ఉన్నత స్థాయి అధికారి తెలిపింది. విచారణ పూర్తయితే ఆయనపై డ్రాగన్ కంట్రీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాగా ఇప్పటికే చైనా ప్రభుత్వం తీరుతో దిగ్గజ కంపెనీలు నామరూపాల్లేకుండా పోతుంటే, ఇటీవల కాలంలో 10లక్షల మందికంటే ఎక్కువ మంది అధికారుల్ని చైనా శిక్షించింది.
►ఇటీవల చైనా ప్రాపర్టీ దిగ్గజం ఎవర్‌గ్రాండే అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు సుమారు 300 బిలియన్ల డాలర్ల బాకీ పడింది. గడువులోగా వడ్డీలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యింది. అందుకు ప్రభుత్వం తెచ్చిన విధానాలేనని ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
►260 మిలియన్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న చైనా అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలలో ఒకటైన హువారోంగ్ మాజీ ఛైర్మన్ లై జియోమిన్‌ను గత సంవత్సరం చైనా ఉరితీసింది.
►సెప్టెంబరులో యువాన్ రెంగువో, ప్రపంచంలోని అత్యంత విలువైన స్పిరిట్స్ కంపెనీ కీచౌ మౌటై మాజీ అధిపతి 17 మిలియన్లకు పైగా లంచం తీసుకున్నారనే కారణంగా జీవిత ఖైదు విధించింది.
►2020లో లంచం తీసుకున్నారనే ఆరోపణలపై చైనా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ మాజీ అధిపతికి చైనా ప్రభుత్వం 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
చదవండి: చైనా చిల్లర బుద్ధి, అప్పుడు బయోవార్‌తో కరోనా..ఇప్పుడు బయోటెక్నాలజీతో..
Comments
Please login to add a commentAdd a comment