
వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు. జిన్‌పింగ్ గొప్ప వ్యక్తని, చైనాలో గత వందేళ్లలో అత్యంత శక్తిమంతమైన అధ్యక్షుడు ఆయనేనని కొనియాడారు. ‘చైనాలో అధ్యక్ష పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టే’ నిబంధనను అక్కడి అధికార కమ్యూనిస్ట్ పార్టీ శనివారం తొలగించిన విషయం తెలిసిందే. దీంతో జిన్‌పింగ్ నిరవధికంగా ఆ పదవిలో కొనసాగేందుకు మార్గం సుగమమైంది. దక్షిణ ఫ్లోరిడా ఎస్టేట్‌లో శనివారం నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమంలో రిపబ్లికన్ దాతలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ...‘ ఇప్పుడు జిన్‌పింగ్ జీవితకాలపు అధ్యక్షుడిగా మారారు. ఆయన తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలడు. దీన్ని నేను గొప్ప విషయంగా భావిస్తున్నాను. అమెరికా కూడా ఎదో రోజు జీవితకాలపు అధ్యక్షుడిని కలిగి ఉంటుంది’ ట్రంప్ తెలిపారు. ట్రంప్ ఈ విధంగా స్పందించడం హాస్యాస్పదమే అయినప్పటికీ దీనిపై పలువురు ట్విటర్‌లో వ్యంగ్యంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment