
భారత రైల్వేకు చైనా వేగం!
ముంబై: భారత్, చైనా రైల్వేల విషయంలో కలసి మెలసి సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించనున్న సమయంలో ఇరు దేశాల మధ్య రైల్వేల విషయమై సహకార ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ముంబైలోని చైనా కాన్సుల్ జనరల్ లీయూఫా వెల్లడించారు.
ఇందులో భాగంగా చైనా బృందం భారత అధికారులతో గతవారం ముంబైలో తొలి దశ చర్చలు జరిపిందన్నారు. భారత్ రైల్వే మార్గాల్లో రైళ్ల వేగాన్ని పెంచడం, స్టేషన్ల అభివృద్ధి సహా పలు అంశాలు చర్చకు వచ్చాయి. భారత్ చైనా నమూనాను ఉదాహరణగా తీసుకుంటోందని లీయూఫా వెల్లడించారు.