టోక్యో: కరోనా వైరస్‌ను ముందే పసిగట్టినా ఎవరికి తెలియకుండా చైనా అందరిని మోసం చేసిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. కానీ జపాన్ మాత్రం చైనాతో అంశాల వారిగా మద్దతుకు ప్రయత్నిస్తోంది. అయితే 2018డిసెంబర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఏడు సంవత్సరాల తరువాత కలిసిన మొదటి ప్రధానిగా జపాన్ ప్రధాని షింజో అబే నిలిచిన విషయం తెలిసిందే. చైనాతో మైత్రి కొనసాగించడానికి జపాన్ డైలమాలో పడిందని, చైనాతో పోటీని కొనసాగిస్తునే ఆ దేశానికి సహకారం అందిస్తున్నామని జపాన్ సెక్యూరిటీ డైరెక్టర్ నార్‌శిగ్ మిచిస్త తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, జపాన్ దేశాలు ఆర్థిక, రాజకీయ అంశాలలో సహకారం అందించుకోవాలని ఇది వరకే నిర్ణయించుకున్నాయి.
కానీ ఇటీవల దేశంలో చైనా పెట్టుబడుల విషయంలో జపాన్ పలు ఆంక్షలను విధించింది. ఈ క్రమంలో దేశంలోనే విదేశీ పెట్టుబడులను ఆకర్శించేందుకు జపాన్ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. డిఫెన్స్ రంగంలో జపాన్‌కు చైనా సహకారం అందిస్తుంది, అందువల్ల చైనా విషయంలో జపాన్ సానుకూల వైఖరి అవలంభిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే పర్యాటక రంగంలో చైనా, జపాన్ దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. గత ఏడాది లక్షమంది వరకు చైనా విద్యార్థులు జపాన్ విశ్వవిద్యాలయాలలో చదువుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment