అమెరికాలోకి భారతీయుల వలసలు.. ట్రంప్‌తో మోదీ ఏమన్నారంటే.. | PM Narendra Modi Key Comments Over Illegal Immigration TO USA, Watch Video Inside | Sakshi
Sakshi News home page

అమెరికాలోకి భారతీయుల వలసలు.. ట్రంప్‌తో మోదీ ఏమన్నారంటే..

Published Fri, Feb 14 2025 8:03 AM | Last Updated on Fri, Feb 14 2025 4:04 PM

PM Narendra Modi Key Comments Over illegal immigration TO USA

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అనంతరం భారతీయుల అక్రమ వలసలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు లేదని చెప్పుకొచ్చారు.

వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు దేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. అలాగే, అమెరికాలోకి అక్రమంగా వెళ్తున్న భారతీయుల అంశంపై మోదీ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తాం. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉంది. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదు. ఈ విధానం ప్రపంచం అంతటికీ వర్తిస్తుందన్నారు.

అమెరికా టూర్లో మోదీకి ట్రంప్ స్పెషల్ గిఫ్ట్

యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులు (Illegal Migrants)గా మారుతున్నారు. డబ్బు, ఉద్యోగాల ఆశజూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారు. అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారు. వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కూపంలోకి వెళ్తున్నారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాల్లో భారత్‌కు ట్రంప్‌ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.  ఇక, అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, అంతకుముందు.. వెస్ట్ వింగ్ లాబీలో భారత ప్రధాని నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో  మిమ్మల్ని చాలా మిస్సయ్యా అంటూ మోదీతో ట్రంప్‌ వ్యాఖ్యలు చేశారు. నాకు కూడా మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉందని భారత ప్రధాని మోదీ బదులిచ్చారు. ఇదే సమయంలో ట్రంప్ గతంలో​ భారత్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా దిగిన ఫోటోలను ఇద్దరు నేతలు తిలకించారు. ఈ క్రమంలో మోదీకి పుస్తకాన్ని ట్రంప్‌ బహుమతిగా ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement