Illegal immigration
-
ట్రంప్ వచ్చాక మనోళ్లు ఇంటికే..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారికి డిపోర్టేషన్ ముప్పు పొంచి ఉంది. తమ దేశంలో చట్టవిరుద్ధంగా తిష్టవేసిన వారిని వెనక్కి పంపిస్తానని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అక్రమ వలసదార్లపై కఠినంగా వ్యవహరించక తప్పదని తేల్చిచెప్పారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్‌కు శ్రీకారం చుట్టబోతున్నానని స్పష్టంచేశారు. ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని గణాంకాలను యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) క్రోడీకరించింది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల నుంచి వివరాలు సేకరించింది. దాదాపు 10.50 లక్షల మంది చట్టవిరుద్ధంగా ఉంటున్నట్లు తేల్చింది. వీరిలో 17,940 వేల మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించింది. వీరంతా అధికారికంగా లెక్కతేలినవారే. ఈ మేరకు గత నెలలో ఒక జాబితా సైతం సిద్ధం చేసింది. నూతన అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీరంతా స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం బలవంతంగానైనా వెనక్కి పంపిస్తుందని అంటున్నారు. -
డాలర్ డ్రీమ్స్ వేటలో.. కటకటాల పాలు!
అమెరికా కలను సాకారం చేసుకునేందుకు భారతీయులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అమెరికాలోకి భారతీయుల అక్రమ వలసలు విపరీతంగా పెరిగినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యూఎస్ సీబీపీ) తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు వాళ్లు ప్రధానంగా కెనడా సరిహద్దులను ఎంచుకుంటున్నారు. కెనడా గుండా అమెరికాలో ప్రవేశిస్తూ అరెస్టవుతున్న వారిలో భారతీయులే 22 శాతం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది! యూఎస్ సీబీపీ గణాంకాల ప్రకారం 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022లో కెనడా గుండా అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన 1,09,535 మందిలో భారతీయులు 16 శాతం కాగా 2023లో వారి సంఖ్య ఇంకా పెరిగింది. ఆ ఏడాది 1,89,402 మందిలో 30,010 మంది భారతీయులున్నారు. 2024లో 1,98,929 మంది సరిహద్దు దాటేందుకు అక్రమంగా ప్రయత్నించగా వారిలో 43,764 మంది భారతీయులే. లాటిన్ అమెరికా, కరేబియన్ వలసదారులతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. అయినా గత నాలుగేళ్లలో కెనడా గుండా అక్రమంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిలో అతిపెద్ద సమూహం భారతీయులేనని వాషింగ్టన్కు చెందిన ఇమిగ్రేషన్ విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా దళాలకు చిక్కకుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య తెలియదు. కెనడా సరిహద్దే ఎందుకు? అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దునే ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండటం వాటిలో ముఖ్యమైనది. కెనడా విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కేవలం 76 రోజుల్లో పూర్తవుతుంది. అదే అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసమైతే కనీసం ఏడాది వేచి ఉండాల్సిందే. అమెరికాతో కెనడా సరిహద్దు చాలా పొడవైనది. దాంతో అక్కడ రక్షణ తక్కువ. దాంతో అంత సురక్షితమైన మార్గం కానప్పటికీ దీన్నే ఎంచుకుంటున్నారు. పంజాబ్ నుంచే ఎక్కువ ఇలా కెనడా గుండా అమెరికాలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల్లో ఎక్కువ భాగం పంజాబ్, హరియాణాల వాళ్లే ఉంటున్నారు. తర్వాతి స్థానం గుజరాత్‌ది. విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాల కోసం పంజాబీ గ్రామీణ యువత బాగా ఆసక్తి చూపుతోంది. కానీ సరైన విద్యార్హతలు, ఆంగ్ల ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా పర్యాటక, విద్యార్థి వీసాలు పొందడం వీరికి గగనంగా మారుతోంది. ప్రత్యామ్నాయంగా అక్రమంగా సరిహద్దులు దాటించే ముఠాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చాలామంది లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులు దాటేందుకు అతి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వలసదారుల ఏరివేతకు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం
-
Narendra Modi: బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు
జంషెడ్పూర్: జార్ఖండ్‌లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూటమి ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వెల్లువలా వచి్చపడుతున్న బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్రమ వలసల వల్ల సంథాల్ పరగణాలు, కోల్హాన్ ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో వేగంగా మార్పులొస్తున్నాయి. స్థానికులు మైనారీ్టలుగా మారిపోయే ప్రమాదముంది. స్థానికేతరుల ఆధిపత్యం వల్ల గిరిజన జనాభా క్రమంగా తగ్గిపోతోంది. అక్రమ వలసదారులు పంచాయతీ వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారు. భూములు కబ్జా చేస్తున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తమకు భద్రత లేదని జార్ఖండ్‌లో ప్రజలు భావిస్తున్నారు’’ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం జంషెడ్‌పూర్‌లో ‘పరివర్తన్ మహార్యాలీ’లో మోదీ ప్రసంగించారు. విదేశాల నుంచి అక్రమంగా వలస వచి్చన వారికి జేఎంఎం అండగా నిలుస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీపై అక్రమ వలసదారులు పట్టు బిగించారన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లపై దర్యాప్తు కోసం స్వతంత్ర కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జనమే బుద్ధి చెబుతారు జార్ఖండ్‌కు జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెసే అతిపెద్ద శత్రువులని మోదీ అన్నారు. అధికార దాహంతో అవి ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్ముకున్నాయని ఆక్షేపించారు. ‘‘గిరిజనుల ఓట్లతో అధికారం దక్కించుకున్న జేఎంఎం ఇప్పుడు వారికి అన్యాయం చేస్తున్న శక్తులతో చేతులు కలిపింది. రాజకీయ స్వార్థం కోసం దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలను బలి పెడుతోంది. గిరిజన సీఎం చంపయ్ సోరెన్‌ను అన్యాయంగా పదవి నుంచి తప్పించి ఘోరంగా అవమానించారు. జార్ఖండ్‌లో గిరిజనులకు జరుగుతున్న ద్రోహానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. సీఎం హేమంత్ సోరెన్ తన వదిన సీతా సోరెన్‌కే తగిన గౌరవమివ్వడం లేదు. జేఎంఎంకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’’ అన్నారు. మతం పేరిట జేఎంఎం కూటమి ఓటు బ్యాంకును పెంచుకోజూస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ముప్పు తప్పాలంటే బీజేపీని బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని మోదీ ధీమా వ్యక్తంచేశారు. ఐదేళ్లపాటు జరిగిన అవినీతి అక్రమాలు, కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని విచి్ఛన్నం చేసేందుకు విపక్షాలు పెద్ద కుట్ర పన్నాయని ఆరోపించారు. జార్ఖండ్ సంక్షేమానికి కేంద్రం ఎంతో చేసిందన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకున్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై–జి) కింద జార్ఖండ్‌లో 32 వేల మంది లబ్ధిదారులకు ఈ సందర్భంగా మోదీ వర్చువల్‌గా అనుమతి పత్రాలు పంపిణీ చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గృహాలు పొందిన మరో 46 వేల మందికి తాళాలు అందజేశారు. జార్ఖండ్‌లో రూ.660 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు.నేడే వందేమెట్రోకు పచ్చజెండారాంచీ: మెట్రో నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాల కోసం దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సేవలను మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇది గుజరా త్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు 359 కి.మీ. దూరాన్ని కేవలం 5.45 గంటల్లో చేరనుంది. ఆరు వందే భారత్ రైళ్లను మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇవి టాటానగర్–పట్నా, బ్రహ్మపూర్–టాటానగర్, రుర్కెలా–హౌరా, దేవ్‌గఢ్–వారణాసి, భాగల్పూర్–హౌరా, గయా–హౌరా మార్గాల్లో ప్రయాణిస్తాయి. -
ఉసురు తీస్తున్న అమెరికా డ్రీమ్స్
అమెరికా. ఊహల స్వర్గం. ముఖ్యంగా భారత యువతకైతే ఎలాగైనా చేరి తీరాలనుకునే కలల తీరం. ఇందుకోసం చాలామంది ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. చదువు, నైపుణ్యం వంటి అర్హతలు లేకున్నా అక్రమంగానైనా అగ్రరాజ్యం చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో కరడుగట్టిన మాఫియా ముఠాల కబంధ హస్తాల్లో చిక్కి సర్వం కోల్పోతున్నారు. ధనం, మానంతో పాటు కొన్నిసార్లు నిస్సహాయంగా ప్రాణాలూ పోగొట్టుకుంటున్నారు. కన్నవారికి, అయినవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. అయినా అత్యంత ప్రమాదకరమైన ‘డంకీ’ మార్గాల్లో అమెరికా బాట పడుతున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది... – సాక్షి, నేషనల్ డెస్క్ ఇటీవల వచ్చిన షారుఖ్ ఖాన్ సినిమా డంకీ గుర్తుందా? అక్రమంగా ఇంగ్లండ్ చేరేందుకు కొందరు చేసే ప్రయత్నమే దాని ఇతివృత్తం. ఇలా అక్రమ దారుల్లో దేశాలు దాటడాన్ని ‘డంకీ మార్గం’గా పిలుస్తారు. ఇదో పంజాబీ పదం. ఇలా అమెరికా చేరేందుకు ప్రయతి్నస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆ క్రమంలో ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుంటూ, మనుషులను అక్రమంగా చేరవేసే మాఫియా చేతుల్లో నానారకాలుగా చిత్రవధకు గురవుతున్నట్టు స్కై న్యూస్ వార్తా సంస్థ వెల్లడించింది.ఈ విధంగా మానప్రాణాలను రిసు్కలో పెట్టుకుంటున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతున్నట్టు తన నివేదికలో పేర్కొంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2022 నాటికే అమెరికాలోకి అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల సంఖ్య ఏకంగా 7.25 లక్షలు దాటేసింది. ఈ జాబితాలో మెక్సికో, ఎల్ సాల్వెడార్ తర్వాత మనోళ్లు మూడో స్థానంలో ఉన్నారు. 2023లో రికార్డు స్థాయిలో ఏకంగా 96,917 మంది భారతీయులను అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా నిర్బంధించడమో, బలవంతంగా వెనక్కు పంపడమో జరిగినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాకు రూటు ఇలా.. అమెరికాలో అక్రమంగా ప్రవేశించదలచే భారతీయులు తొలుత పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా వంటి సెంట్రల్ అమెరికా దేశాలకు చేరతారు. మాఫియా ప్రపంచంలో వీటికి అమెరికాకు గేట్‌వేలుగా పేరు. ఈ దేశాల వీసా తేలిగ్గా లభిస్తుంది. పైగా అక్కడి నుంచి తొలుత మెక్సికోకు, ఆపై అమెరికాకు చేరడం సులువు. ఆయా దేశాల నుంచి వీళ్లను అమెరికా చేర్చేందుకు ఒక నమ్మకమైన గైడ్‌ను అక్రమ రవాణా మాఫియాయే ఏర్పాటు చేస్తుంది. అతన్ని కొయొటోగా పిలుస్తారు. అయితే అత్యంత కష్టతరం, ప్రమాదకరం అయిన మార్గాల గుండా సాగే ఈ ప్రయాణం అక్షరాలా ప్రాణాంతకమే! దీనికి కొన్నిసార్లు ఒక్రటెండేళ్ల సమయం కూడా పడుతుంది! భారతీయులపై నానారకాల అకృత్యాలు జరిగేది కూడా ఈ దశలోనే. అమెరికాలోకి సరిహద్దు దాటించేందుకు ఏటా మూడు సీజన్లుంటాయి. నేను సీజన్‌కు సగటున 500 మందిని పంపుతుంటా. – స్కై న్యూస్‌తో ఒక ఏజెంట్ ‘అమెరికా వెళ్లేందుకు నా సేవింగ్స్ అన్నీ ఊడ్చి మరీ మాఫియాకు రూ.40 లక్షలు చెల్లించా. కానీ నన్ను కఠ్మాండూ తీసుకెళ్లి బంధించారు. మావాళ్ల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. – సుభాష్ కుమార్ (26)ఆ సరిహద్దు.. ప్రత్యక్ష నరకంకిందా మీదా పడి అమెరికా సరిహద్దు దాకా చేరేవారిది మరో రకం దైన్యం. ముఖ్యంగా మెక్సికో బోర్డర్ వద్ద చిక్కుపడేవారైతే అక్షరాలా నరకం చవిచూస్తున్నారు. ఆ ప్రాంతమంతా మెక్సికన్ మాఫియా నియంత్రణలో ఉంటుంది. దాంతో బాలికలు, మహిళలపై ఇష్టారాజ్యంగా లైంగిక దాడులు, అత్యాచారం జరుగుతున్నాయి. వాళ్లను బలవంతంగా వేశ్యా వృత్తిలోకి కూడా దించుతున్నారు. అక్కడ సగటున ప్రతి ముగ్గురిలో ఒకరిపై లైంగిక దాడి జరుగుతున్నట్టు అంచనా. సర్వం తెగనమ్ముకుని..తమ పిల్లలను ఎలాగైనా అమెరికా పంపడమే లక్ష్యంగా సర్వం తెగనమ్ముకుంటున్న వారికి కొదవ లేదు. మాఫియా అడిగినంత ఇచ్చుకునేందుకు ఇల్లు, పొలం, నగా నట్రా వంటివన్నీ తాకట్టు పెట్టడమో, అమ్మడమో చేస్తున్నారు. అలా ఆస్తులన్నీ అమ్మించి అమెరికా బాట పట్టిన మలీ్కత్సింగ్ అనే 30 ఏళ్ల టెక్నాలజీ గ్రాడ్యుయేట్ దోహా, అల్మాటీ, ఇస్తాంబుల్, పనామా సిటీ గుండా చివరికి ఎల్ సాల్వడార్ చేరుకున్నాడు. అక్కడ మాఫియా చేతిలో దుర్మరణం పాలయ్యాడు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా అతని మృతదేహాన్ని గుర్తించి తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. సాహిల్ అనే మరో 19 ఏళ్ల యువకుడు పనామా నుంచి బయల్దేరి మార్గమధ్యంలోనే గల్లంతయ్యాడు. అప్పట్నుంచీ అతని ఆచూకీ కోసం తండ్రి శివకుమార్ (45) చేయని ప్రయత్నమంటూ లేదు.ఇదీ పరిస్థితి⇒ డంకీ రూటు సెంట్రల్ అమెరికా దేశాల మాఫియాకు కొన్నేళ్లుగా ఆకర్షణీయమైన వ్యాపారంగా మారింది. ⇒ అమెరికా చేర్చేందుకు 50 వేల నుంచి లక్ష డాలర్ల దాకా (రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షలు) వసూలుచేస్తున్నాయి. ⇒ వీళ్లకు ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఏజెంట్లున్నారు. ⇒ వీరి వల్లో పడేవాళ్లలో ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాల యువత సంఖ్యే అధికం. ⇒ ఆశావహులు ముందుగా విమాన మార్గంలో పనామా తదితర దేశాలకు చేరతారు. ⇒ అక్కడినుంచి వీళ్ల జుట్టు పూర్తిగా మాఫియా ముఠాల చేతికి చిక్కుతుంది. ⇒ దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలు, జలమార్గాలను దాటుతూ వెళ్లాల్సి ఉంటుంది. ⇒ అలా అమెరికా చేరేదాకా ప్రయాణమంతా ‘వాళ్ల దయ, వీళ్ల ప్రాప్తం’ అన్నట్టుగా ఉంటుంది. ⇒ చాలాసార్లు ఫేక్ బోర్డింగ్ పాసులు, వీసాలు చేతిలో పెట్టి ‘ఇదే అమెరికా’ అంటూ నమ్మించి మార్గమధ్యంలోనే వదిలేస్తుంటారు. ⇒ ఇలాంటి వాళ్లంతా పోలీసులకో, క్రిమినల్ గ్యాంగులకో చిక్కుతారు. అంతిమంగా వాళ్లకు చిప్ప కూడు, చిత్రహింసలే గతవుతాయి. -
Lok Sabha Election 2024: బెంగాల్లోకి అక్రమ వలసలు
కాక్ద్వీప్/మయూర్భంజ్/బాలాసోర్: ‘వికసిత్ భారత్’ సాకారం కావాలంటే ‘వికసిత్ బెంగాల్’ కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశి్చమ బెంగాల్లోకి అక్రమ వలసలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని, స్థానిక యువతకు దక్కాల్సిన అవకాశాలను చొరబాటుదార్లు కాజేస్తున్నారని ఆరోపించారు. ప్రజల భూములను, ఆస్తులను లాక్కుంటున్నారని, ఇది తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం పాకులాడుతోందని, అసలైన ఓబీసీల హక్కులను ముస్లింలకు కట్టబెడుతోందని మండిపడ్డారు. ముస్లింలకు ఓబీసీల పేరిట తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారిచేస్తోందని విమర్శించారు. బెంగాల్లోకి అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం పశ్చిమ బెంగాల్‌లోని కాక్ద్వీప్, ఒడిశాలోని మయూర్భంజ్, బాలాసోర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... దేశ భద్రతను పణంగా పెడుతున్నారు ‘‘ఇతర దేశాల్లో మత హింస కారణంగా వలస వచి్చన హిందువులకు, మతువాలకు భారత పౌరసత్వం ఇవ్వడాన్ని తృణమూల్ కాంగ్రెస్ నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తోంది. సమాజంలో ఓ వర్గాన్ని మచి్చక చేసుకోవడానికి రాజ్యాంగంపై దాడి చేస్తోంది. ముస్లింలకు ఓబీసీ హోదా కలి్పంచడాన్ని కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. కానీ, కోర్టు తీర్పును తృణమూల్ కాంగ్రెస్ అంగీకరించడం లేదు. ఈ తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తోంది. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తోంది. దేశ భద్రతను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పణంగా పెడుతోంది. అక్రమ చొరబాట్లపై చర్యలు తీసుకోవడం లేదు. నవీన్ పటా్నయక్ అనారోగ్యం వెనుక కుట్ర! ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ ఆరోగ్యంగా హఠాత్తుగా క్షీణించిందని చెబుతున్నారు. గత ఏడాది కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనివెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవీన్ పటా్నయక్ తరఫున ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బలమైన లాబీ ఈ కుట్రకు తెరతీసిందా? అనే సందేహాలు లేకపోలేదు. నవీన్ బాబు ఆరోగ్యం క్షీణించడం వెనుక మిస్టరీ ఏమిటో బయటపడాలి. ఒడిశాలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నవీన్ పటా్నయక్ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంపై కారణాలు తెలుసుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం’’. అని మోదీ స్పష్టం చేశారు. నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది: నవీన్ పటా్నయక్ తన ఆరోగ్యం క్షీణించడం వెనుక కుట్ర ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ ఖండించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
అక్రమ వలసల విపరిణామం
సుమారు 300 మంది భారతీయులు ప్రయాణిస్తున్న ఒక విమానాన్ని ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో నిర్బంధించడం అంతర్జాతీయ వార్తగా మారింది. నికరాగ్వాకు వెళ్తున్న ఇలాంటి వాళ్లందరూ అక్కడి నుంచి తమ దేశంలోకి అక్రమంగా వస్తున్నారని అమెరికా ఆరోపణ. ఫ్రెంచ్ అధికారులతో ఈ సమాచారాన్ని పంచుకున్న అమెరికన్ నిఘా వర్గాలు న్యూఢిల్లీని మాత్రం చీకట్లో ఉంచాయి. ఈ వార్తను పతాక శీర్షికల్లో వచ్చేలా చేయడం ద్వారా అక్రమ వలస రాకెట్‌ను సమర్థంగా బహిర్గతం చేయాలని వారు కోరుకున్నారు. తమ అమెరికా కలల్ని నెరవేర్చే అక్రమ ముఠాలకు భారీగా డబ్బులు ముట్టచెబుతూ, జనాలు తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. సమగ్ర వలస విధాన సంస్కరణల అవసరాన్ని ఈ ఉదంతం సూచిస్తుంది. తమ వలస, జాతీయతా చట్టంలో అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ నవంబర్ 21న ఒక నిబంధనను పొందుపర్చింది. నికరాగ్వాకు ప్యాసింజర్ విమానాల్లో రివాజుగా విదేశీయులను తీసుకెళ్తున్న వారిని గుర్తించి, వారి ప్రయత్నాలను విఫలం చేయడానికీ, అలాంటి వారిని శిక్షించడానికీ సంబంధించిన నిబంధన అది. విదేశీయులను ప్రమాదకరమైన భూభాగం, జలమార్గాల ద్వారా అమెరికాలోకి నెట్టడమే మానవ రవాణా చేస్తున్న వారి ఉద్దేశం అని అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆ సమయంలో భారతదేశంలో ఎవరికీ పెద్దగా తెలియని ఈ ప్రకటన, నాలుగు కీలక అంశాలను పేర్కొంది. ఒకటి, చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా అమెరికాకు రాబోయే వలసదారుల కోసం కొత్త అక్రమ రవాణా కేంద్రంగా నికరాగ్వా ఉద్భవించింది. రెండు, నేరస్థ ముఠాలు వలస వచ్చేవారి నుండి ’భారీ–స్థాయిలో డబ్బు’ను వసూలు చేస్తు న్నాయి, వారిని తీవ్ర ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. మూడు, అటు వంటి అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించినా, ఎలాగైనా వారిని తమ తమ దేశాలకు అమెరికా తిప్పి పంపుతుంది. నాలుగు, నికరాగ్వా లోకి చార్టర్ విమానాలను పంపించే కంపెనీల యజమానులు, అధి కారులు, సీనియర్ అధికారులతో కఠినంగా వ్యవహరించడానికి అమె రికా పాలనాయంత్రాంగం సిద్ధమవుతోంది. అమెరికా చట్టంలోని సెక్షన్ 212 (ఎ)(3)(సి) ‘యునైటెడ్ స్టేట్స్లో ప్రవేశించడం లేదా తీవ్రమైన అమెరికన్ ప్రతికూల విదేశాంగ విధాన పరిణామాలను కలిగి ఉన్న ఏ దరఖాస్తుదారుని అయినా సరే మినహాయించడానికి విదేశాంగ శాఖ మంత్రిని అమెరికా అనుమ తిస్తుంది’. నికరాగ్వా బడా ముఠాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహాయకులకు వ్యతిరేకంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ నిబంధనను ఉపయోగించడానికి పథక రచన చేశారని నవంబర్ ప్రకటన పేర్కొంది. నికరాగ్వాకు అలాంటి విమానాలను నడుపుతున్న వారినీ, అమెరికా–మెక్సికో సరిహద్దులోని చివరి గమ్య స్థానానికి వలసదారులను తీసుకువెళ్లేవారినీ వదిలిపెట్టబోమని అమె రికా విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. దురదృష్టవశాత్తు, వాషింగ్టన్ చేసిన ఈ రెండవ హెచ్చరిక కూడా భారతదేశం దృష్టిలోకి రాకుండా పోయింది. వందలాదిమంది అనుమానిత భారతీయులను తీసుకెళుతున్న లెజెండ్ ఎయిర్‌లైన్స్(రొమేనియన్ సంస్థ) విమానం ఇంధనం నింపు కోవడం కోసం ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో దిగుతోందన్న సమాచారాన్ని సేకరించిన అమెరికన్ ప్రభుత్వ నిఘావర్గాలు, వ్యవ స్థీకృత నేరాలపై పోరాడే ఒక ఫ్రెంచ్ ప్రభుత్వ విభాగానికి ఉప్పందించాయి. అట్లాంటిక్ సముద్ర ప్రాంతం పొడవునా నిఘా సమాచారాన్ని పంచుకోవడం అనేది ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మారుస్తుందన్నది దీని వెనుక ఉద్దేశం. కానీ ఇది కలవరపెట్టే ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది: అలాంటి నిఘా సమాచారాన్ని న్యూఢిల్లీతో ఎందుకు పంచుకోలేదు? అత్యవసర పరిస్థితుల కోసం తగినంతగా సన్నద్ధత లేని ఒక విమానాశ్రయంలో, నాలుగు రోజుల పాటు భారతీయ ప్రయాణికులు నిర్బంధించబడ్డారు. వాషింగ్టన్ లోని విశ్వసనీయ వర్గాల ప్రకారం, అమెరికన్ అధికా రులు ఆ విమానాన్ని ఎగరడానికి ముందే ఆపాలని అనుకోలేదు. పతాక శీర్షికల్లోకి వచ్చేలా చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో చర్యలు తీసుకునేలా అక్రమ వలస రాకెట్‌ను సమర్థవంతంగా బహిర్గతం చేయాలని వారు కోరుకున్నారు. ఎవరి తోడూ లేని మైనర్ ప్రయాణీకు లను కూడా కలిగి ఉన్న ఆ విమానం వాట్రీ విమానాశ్రయం వద్ద ముట్టడిలో ఉండగానే అది ప్రపంచవ్యాప్తంగా వార్తలను సృష్టించింది. యూరప్ టీవీల్లో అతిపెద్ద వార్తగా మారిన ఈ అసాధారణ సంఘటన కారణంగా, ఈశాన్య ఫ్రాన్స్‌లో క్రిస్మస్ వేడుకలకు, పారిస్‌లోని అధికా రిక వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ దేశాలకు వలస వచ్చే వారికోసం వేటాడే నేరస్థ ముఠాలు ఈ ఉదంతం కారణంగా, కనీసం కొంతకాలం అయినా ఇలాంటి విమాన వలసలకు ప్రయత్నించవు. అమెరికన్ విదేశాంగ శాఖ శిక్షా త్మకమైన వలస చట్టాన్ని అమలు చేయడానికి కొన్ని వారాల ముందు, హైతీ తన రాజధాని నుండి నికరాగ్వాకు అన్ని విమానాలను నిలిపి వేసింది. భారతదేశంలాగే, ప్రస్తుతం హైతీ కూడా అక్రమ వలసలకు ఒక వనరుగా ఉందని అమెరికా పేర్కొంది. సంపన్న దేశాలకు తమను అక్రమంగా తరలించేందుకు లక్షల రూపాయలు అప్పులు చేసి నికరాగ్వాకు వెళ్లే విమానం ఎక్కుతున్నారు భారతీయులు. ప్రభుత్వం ఈ నష్టాన్ని నివారించడంలో ఆలస్యం చేసింది. ఎట్టకేలకు డిసెంబరు 21న ఆర్భాటంగా, ఆకర్షణీయమైన సంక్షిప్త నామంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువత, నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం క్రమబద్ధమైన సహాయకరమైన వలసను ప్రోత్సహించే ‘ప్రయాస్’ కార్యక్రమం అది. అంతర్జాతీయ వలస చట్రానికి సంబంధించిన విషయాలపై మెరుగైన అవగాహనను ప్రోత్సహించడానికి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. నికరాగ్వాకు ఇటీవల కనీసం రెండు విమానాల్లో వెళ్లిన భారతీయులను ఎవరూ గుర్తించలేదని పోలీసులు ఇప్పుడు చెబుతున్నారు. అనేక వందల మంది భారతీయ అక్రమ వలసదారులు దొరకకుండా తప్పించుకు పోతుండటాన్ని నాటకీయంగా చూపించే తమ ప్రయత్నంలో అమెరికా, ఫ్రెంచ్ ప్రభుత్వాల నేరనిరోధక ఏజెన్సీలు... ప్రధానంగా పంజాబ్, గుజరాత్ల నుండి యూరప్ గుండా పశ్చిమ అర్ధ గోళానికి వలసదారులను చేర్చడం కోసం పనిచేస్తున్న విస్తృత నేరస్థ నెట్వర్క్ గురించి భారతదేశాన్నే కాకుండా ఐక్యరాజ్యసమితిని కూడా చీకటిలో ఉంచాయి. ప్రయాస్ అనేది ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ వలస సంస్థ, భారతీయ అంతర్జాతీయ వ్యవహారాల మండలి... ఉమ్మడి ప్రాజెక్ట్. మరో విడ్డూరం ఏమిటంటే, లెజెండ్ ఎయిర్‌లైన్స్ చార్టర్ ఫ్లైట్ ఉదంతం వెలుగులోకి రావడానికి ఒక వారం ముందు, ‘నమోదు కాని రిక్రూట్మెంట్ ఏజెంట్ల వల్ల మోసపోతున్న విదేశీ ఉద్యోగార్థుల సంఖ్య భారీగా పెరిగింది’ అని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులపై వేటు వేయడం ప్రపంచ స్థాయిలో జరుగుతోంది. ‘చాలా తూర్పు యూరోపియన్ దేశాలు, కొన్ని గల్ఫ్ దేశాలు, మధ్య ఆసియా, ఇజ్రాయెల్, కెనడా, మయన్మార్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్లలో వీటికి సంబంధించి కేసులు నమోదవుతున్నాయి’ అని హెచ్చరించింది. పార్లమెంట్‌లోని ప్రతి సెషన్ లోనూ, అక్రమ వలసల శాపం గురించి జీరో అవర్‌లో పెద్ద మొత్తంలో ప్రశ్నలు వస్తుంటాయి. భారత విదేశాంగ మంత్రి లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ ఈ సమస్య సంక్లి ష్టత రీత్యా తాము నిస్సహాయంగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. ‘బహి ష్కరణ ఉత్తర్వులు వచ్చే వరకు విదేశాలు చాలావరకు తమ తమ దేశాల్లో అక్రమంగా ఉంటున్న వారి గురించి సమాచారాన్ని అందించవు’ అని చెప్పారు. ‘విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటున్న లేదా పని చేస్తున్న భారతీయుల సంఖ్యపై మన దౌత్య కార్యాలయాల వద్ద ఎటువంటి విశ్వసనీయమైన డేటా లేదు’ అని అంగీకరించారు. ఇది షాకింగ్‌గా ఉందని చెబితే సమస్యను తక్కువ అంచనా వేయడమే అవుతుంది. వాట్రీ విమానాశ్రయ ఘటన ఉదంతం, సమస్య తీవ్ర తనూ, సమగ్ర వలస విధాన సంస్కరణల అవసరాన్నీ సూచిస్తుంది. ఈ విషయంలో విఫలమైతే ఎక్కువ మంది భారతీయులు... అంత ర్జాతీయ నేరస్థ ముఠాల బాధితులుగా మారతారు. కేపీ నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇది ఎవరి తప్పు?
ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ చిత్రం ‘డంకీ’ గత గురువారం విడుదలైనప్పుడు, సరిగ్గా అలాంటి కథే కళ్ళ ముందుకొస్తుందని ఆయనా ఊహించి ఉండరు. సరైన విద్యార్హతలు లేకున్నా, సంపాదనకై లండన్‌కు అక్రమంగా వలసపోవాలనుకొనే నలుగురు పంజాబీల చుట్టూ తిరిగే షారుఖ్ ఖాన్ సినిమా అది. ఈ రోజుల్లో అలాంటి కథ ఏ మేరకు ప్రాసంగికమంటూ కొందరు స్తనశల్య పరీక్ష చేస్తున్నవేళ, యాదృచ్ఛికంగా అచ్చంగా ఆ సినిమాలో లానే, ఇంకా చెప్పాలంటే అంతకు మించిన రీతిలో భారతీయ అక్రమ వలసల ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నికరాగ్వా వెళ్ళాల్సిన ప్రత్యేక విమానం ఇంధనం నింపుకోవడానికి ఫ్రాన్స్‌లో ప్యారిస్‌కు 150 కి.మీ.ల దూరంలోని వాత్రీ విమానాశ్రయంలో ఆగినప్పుడు ఊహించని విషయం బయటపడింది. విమానంలో మనుషుల అక్రమ రవాణా సాగుతున్నట్టు ఉప్పందడంతో ఫ్రాన్స్ పోలీసులు బరిలోకి దిగేసరికి, అమెరికాకు అక్రమంగా పోవాలనుకున్నవారి ఆశ అడియాస అయింది. పక్కన తోడెవరూ లేని 11 మంది మైనర్లతో సహా మొత్తం 303 మంది విమాన ప్రయాణికుల్లో అత్యధికులు భారతీయులే. భారత్ నుంచి నేటికీ భారీగా సాగుతున్న అక్రమ వలసలకు ఇది మచ్చుతునక. వివిధ దేశాలకు అక్రమ వలసలు కొత్త కాదు. కానీ ఈ పద్ధతిలో, ఇంత భారీ సంఖ్యలో జరగడం మాత్రం కొత్తే. నికరాగ్వా వీసా మాత్రమే ఉన్నప్పటికీ వారిని అక్రమంగా అమెరికా పంపాలనేది పథకమనీ, ఈ వ్యవహారం నడిపిన ఇద్దరు అనుమానితుల్ని ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకు న్నారనీ, ప్రయాణికుల్లో పాతిక మంది శరణార్థులుగా ఆశ్రయం కోరారనీ వార్త. ఇక, మిగిలిన 276 మంది మంగళవారం ముంబయ్‌కి విమానంలో సురక్షితంగా తిరిగొచ్చారు. వ్యవహారం ఇంతటితో ముగిసినట్టనిపిస్తున్నా, అసలు కథ ఇప్పుడే ఉంది. రొమేనియా దేశపు ప్రైవేట్ కంపెనీ నడుపుతున్న విమానంలో ఈ అక్రమ వలస యానం వెనుక అసలు ఉన్నదెవరు? అమెరికా ఆశ చూపి అమాయకు లకు టికెట్లు, వీసాలు ఏర్పాటు చేసిన ప్రయాణ ఏజెన్సీలేమిటి? ఈ ‘డాంకీ/ డంకీ రూట్’ (అక్రమ ప్రయాణమార్గం), ప్రత్యేక విమానాలను ఖరారు చేసిందెవరు? ఇలాంటి అనేక విషయాల దర్యాప్తు మిగిలే ఉంది. నికరాగ్వా చేరకముందే, ఫ్రాన్స్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొనేసరికి కొందరు శరణార్థులుగా ఆశ్రయం కోరడం అచ్చంగా ‘డంకీ’ సినిమాలోని సన్నివేశాలను గుర్తు చేస్తుంది. నిజానికి, అమెరికాలోని అక్రమ వలస జనాభా విషయంలో మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత మూడో స్థానం భారత్‌దే. 2021 నాటి ప్యూ రిసెర్చ్ సెంటర్ నివేదిక ఈ వాస్తవం వెల్లడించింది. భారతీయ అమెరికన్లలో దాదాపు 7.25 లక్షల మంది అక్రమ వలసదారులే! మరో మాటలో – అమెరికాలోని ప్రతి ఆరుగురు భారతీయ అమెరికన్లలో ఒకరు సరైన పత్రాలు లేకుండా ఆ దేశంలో ఉంటున్నవారే! గమనిస్తే, ఒక్క 2022– 23లోనే 96,917 మంది భారతీయులు అక్రమ వలసదారులుగా అమెరికాలో ప్రవేశించే ప్రయత్నం చేశారు. అంతకు మునుపటి ఏడాదితో పోలిస్తే, అది 51.61 శాతం ఎక్కువ. వీరిలో దాదాపు 41 వేల మందికి పైగా మెక్సికన్ సరిహద్దు మార్గం గుండా అమెరికాలోకి వెళ్ళాలని చూశారు. ఎలాగైనా సరే అగ్రరాజ్యపు సందిట్లోకి చేరాలనుకొనే వారికి ప్రయాణ పత్రాలు సులభంగా పుట్టే నికరాగ్వా వాటమైన మజిలీ. మధ్య అమెరికాలోని ఆ అతి పెద్ద దేశం మీదుగా వలస పోతున్నారు. మెక్సికో, కెనడాల నుంచి అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన వార్తలు ఇటీవల అనేకం వచ్చాయి. అసలింతమంది భారతీయులు విదేశాలకు వలస పోవాలని ఎందుకనుకుంటున్నట్టు? భార తీయ అమెరికన్ కుటుంబ సగటు ఆదాయం లక్షా 30 వేల డాలర్లు. స్వదేశంలో సరైన ఉపాధి, ఉద్యోగాలు లేక అధిక శాతం మంది విదేశాల వైపు చూస్తున్నారు. అమెరికా, కెనడా లాంటి చోట్ల మెరుగైన ఆదాయం, ఆనందమయ జీవితాలను వెతుక్కుంటూ, ‘డాంకీ/ డంకీ రూట్’లోనైనా సరే అక్కడకు చేరిపోవాలని ఆరాటపడుతున్నారు. చిత్రమేమిటంటే, తాజాగా దొరికిన లెజెండ్ ఎయిర్ లైన్స్ విమానంలో అధిక శాతం మంది పాశ్చాత్య సమాజంతో దీర్ఘకాలిక సంబంధమున్న సంపన్న రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్ల వారే! ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డవారు సొంత భాష, ప్రాంతానికి చెందిన ఈ అక్రమ వలసదారులకు అండగా, సురక్షిత ఆశ్రయంగా మారడం సహజమే. సంపన్న దేశాల్లో శ్రామికశక్తి లోటును భర్తీ చేయడానికి మనుషులు కావాలి కానీ, సాంస్కృతిక అంతరాల రీత్యా అక్కడ వలసదారులకు లభించే గౌరవం ఎంత అన్నది చర్చనీయాంశమే. దేశాల సరిహద్దులు చెరిపేసిన ప్రపంచీకరణ వ్యాపారంలో జరిగిందే తప్ప, ఇప్పటికీ వ్యక్తులను అనుమతించడంలో, ఆదరించడంలో కాలేదన్నది నిష్ఠురసత్యం. ఏ దేశానికి ఆ దేశం తనవైన నియమ నిబంధనలు పెట్టుకోవడం సహజమే. అయితే, ఉన్న ఊరినీ, కన్నతల్లినీ వదిలేసి, మెరుగైన జీతం, జీవితం కోసం మనవాళ్ళు గల్ఫ్ నుంచి అమెరికా దాకా వివిధదేశాలకు వలసపోతున్న తీరుకు కారణాలపై సమాజం, సర్కారు పెద్దలు ఇప్పటికైనా దృష్టి సారించాలి. భవిష్యత్తు అనిశ్చితమని తెలిసినా సరే, ఎండమావుల వెంటపడి ప్రాణాల్ని పణంగా పెడుతున్న భారతీయ శ్రామికశక్తికి ఇక్కడే ఎందుకు సలక్షణ జీవనమార్గం చూపించలేకపోతున్నామో ఆలోచించాలి. దూరపుకొండల వైపు ఆశగా చూస్తున్న అమాయకులను బుట్టలో వేసుకొని, కళ్ళ ముందు గాలి మేడలు చూపెడుతున్న ఏజెంట్ల వ్యవస్థను పసిగట్టాలి. ప్రాణాంతక అక్రమ వలసలకు ప్రోత్సహిస్తున్న వారి పనిపట్టాలి. ప్రాచీన కాలపు బానిస వ్యాపార వ్యవస్థకు ఆధునిక రూపాంతరమైన మానవ అక్రమ రవాణా వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలి. తాజా విమానయాన ఉదంతం అందుకు ఓ మేలుకొలుపు. -
ఎంత మోసం.. మాయరోగం నటించి విమానాన్ని దారి మళ్లించి..
పాల్మా(స్పెయిన్): మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ మనుషులు పరాయి దేశాలకు వలస వెళ్లడం సర్వసాధారణం. కొందరు చట్టబద్ధంగా వెళ్తే.. ఆ అవకాశం లేని మరికొందరు అక్రమంగా మరో దేశంలోకి ప్రవేశిస్తుంటారు. పుట్టిన గడ్డపై బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి మరీ విదేశాలకు వలస వెళ్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఇదొక కొత్త రకం అక్రమ వలస. శుక్రవారం స్పెయిన్‌లో చోటుచేసుకుంది. ఎయిర్ అరేబియా విమానం మొరాకోలోని కాసాబ్లాంకా నుంచి టర్కీలోని ఇస్తాంబుల్‌కు బయలుదేరింది. ఇందులో చాలామంది మొరాకో దేశస్తులున్నారు. మార్గమధ్యంలో ఓ ప్రయాణికుడు తనకు అనారోగ్యమంటూ విలవిల్లాడాడు. దీంతో విమానాన్ని స్పెయిన్ దేశానికి చెందిన పాల్మా డి మాలోర్కా దీవిలో ఉన్న ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. ఇది స్పెయిన్‌లో బిజీ ఎయిర్‌పోర్టు. ఇక్కడి నుంచి నిత్యం వందలాది విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బాధిత ప్రయాణికుడికి చికిత్స అందించేందుకు(మెడికల్ ఎమర్జెన్సీ) ఎయిర్ అరేబియా ఫ్లైట్‌ను మాలోర్కా ఎయిర్‌పోర్టులో దించారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వెంట ఓ సహాయకుడు ఉన్నాడు. విమానంలో ఆగడంతో ఇదే అదనుగా భావించి దాదాపు 22 మంది కిందికి దిగి, పరుగులు ప్రారంభించారు. కొందరు ఎయిర్‌పోర్టు కంచెను దాటుకొని బయటకు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.12 మందిని పట్టుకున్నారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. ఈ గందరగోళం కారణంగా విమానాశ్రయాన్ని శుక్రవారం 4 గంటలపాటు మూసివేయాల్సి వచ్చింది. దాదాపు 60 విమానాలను దారి మళ్లించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రయాణికుడు అనారోగ్యం అంటూ విమానంలో నాటకం ఆడినట్లు తేలింది. అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు గుర్తించారు. ప్రయాణికుడి వెంట వచ్చిన సహాయకుడు సైతం పరారయ్యాడు. ఇలాంటి సంఘటన తమ ఎయిర్‌పోర్టులో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెప్పారు. స్పెయిన్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికే మొరాకో దేశస్తులు ఈ కుట్ర పన్నినట్లు గుర్తించారు. (చదవండి: టెక్సాస్ మ్యూజిక్ ఫెస్ట్‌లో తొక్కిసలాట) -
హెచ్1బీ మరింత కఠినతరం
వాషింగ్టన్: ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసా నిబంధనలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. హెచ్–1బీ వీసాకు కంపెనీలు సమర్పించే దరఖాస్తుల్లో తాజాగా మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం హెచ్–1బీ వీసా కోసం కంపెనీలు దరఖాస్తు చేసే సమయంలోనే.. అప్పటికే తమ కంపెనీలో విదేశీ ఉద్యోగులు ఎంత మంది పనిచేస్తున్నారో కూడా ఆయా కంపెనీలు తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా విదేశీయులను ఏ పని కోసం నియమించుకుంటున్నారో కూడా కంపెనీలు దరఖాస్తులో పేర్కొనాలి. ఆ పని చేయగలిగిన వారు అమెరికాలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతనే విదేశీయుడిని నియమించుకునేందుకు కంపెనీకి అనుమతి లభిస్తుంది. కొత్త వారిని ఏయే ప్రదేశాల్లో, ఏయే స్థానాల్లో నియమిస్తారు? ఎంత కాలం వరకు వారు ఉద్యోగాల్లో ఉంటారు? ఇప్పటికే ఆ ప్రదేశం/స్థానంలో ఎంత మంది విదేశీ ఉద్యోగులు పనిచేస్తున్నారు? తదితర వివరాలన్నింటినీ కంపెనీలు అమెరికా కార్మిక విభాగానికి తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే హెచ్–1బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగులు అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదులు సమర్పించే పత్రంలోనూ ప్రభుత్వం పలు మార్పులు తీసుకొచ్చింది. సంస్థలు నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ఫిర్యాదు స్వభావం, తీవ్రతను మరింత విపులంగా తెలిపేలా ఈ మార్పులు ఉన్నాయి. కొత్త మార్పులన్నీ రాబోయే కొన్ని వారాల తర్వాత అమలవుతాయనీ, కచ్చితంగా ఎప్పటి నుంచి అమలవుతాయో కార్మిక విభాగం ప్రకటిస్తుందని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అయితే విదేశీయులకు ఉద్యోగాలు కల్పించే కంపెనీలను లక్ష్యంగా చేసుకునే తాజా నిబంధనలు రూపుదిద్దుకున్నాయని పలువురు పేర్కొంటున్నారు. త్వరలోనే గ్రీన్‌కార్డులు: ట్రంప్ అమెరికా పౌరులు కానప్పటికీ ఆ దేశంలో శాశ్వతంగా నివసించే అవకాశం కల్పించే గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి ట్రంప్ శుభవార్త చెప్పారు. సంవత్సరాలుగా వేచి చూస్తున్న వారందరికీ గ్రీన్‌కార్డులు వస్తాయన్నారు. అక్రమ వలసలపై తమ ప్రభుత్వ విధానం గురించి ట్రంప్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గ్రీన్ కార్డుల కోసం కొంత మంది చాలా ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్నారు. చాలా కాలం నుంచి వారు ఓపికగా ఉంటున్నారు. వాళ్లు అన్నింటినీ అద్భుతంగా చేశారు. వారికి త్వరలోనే గ్రీన్ కార్డులు అందబోతున్నాయి. చాలా మందికి అతి త్వరలోనే గ్రీన్‌కార్డులు రాబోతున్నాయి. మా దేశానికి కంపెనీలు వస్తున్నాయి. వాటిలో పనిచేసేందుకు ఉద్యోగులు కావాలి. ప్రస్తుతం గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారంతా ప్రతిభతో ఇక్కడికొచ్చిన వారు. కాబట్టి వారందరికీ త్వరలోనే మంచి జరుగుతుంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎల్ సాల్వడార్, హోండురాస్, గ్వాటెమాల దేశాల నుంచి దాదాపు 5 వేల నుంచి 7 వేల మంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వస్తుండటంపై ఉద్రిక్తతలు ఏర్పడుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దాదాపు 6 లక్షల మంది భారతీయులు అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసి నిరీక్షిస్తున్నారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి స్థిరపడిపోయే వారి వల్ల దేశంలోకి ప్రతిభతో, చట్టబద్ధంగా వచ్చిన వారి హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోందని ట్రంప్ పేర్కొన్నారు. ఇతరులను తమ దేశ పౌరులుగా చేర్చుకునేందుకు ఏ దేశానికైనా ఓ పరిమితి ఉంటుందనీ, ఇప్పటికే అన్ని దేశాల కన్నా అమెరికాలోకే విదేశీయులను ఎక్కువగా ఆహ్వానించేలా తమ వలస విధానాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. 1970 నుంచి ఇప్పటి వరకు 4 కోట్ల మందికి అమెరికా గ్రీన్ కార్డులు మంజూరు చేసిందని వివరించారు. రాళ్లు విసిరితే కాల్చేస్తారు మూడు దేశాల నుంచి అమెరికాకు తరలి వస్తున్న దాదాపు 7 వేల మంది సమూహాన్ని అడ్డుకుంటామనీ, వారు భద్రతా సిబ్బందిపై రాళ్లు విసిరితే సైన్యం ఆ ప్రజలపై కాల్పులు జరిపే అవకాశం ఉంటుందని ట్రంప్ అన్నారు. ఈ చొరబాటుదారులను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో వేలాది సైనికులను మోహరించారు. అక్రమ చొరబాటుదారులపై అమెరికా అనుసరిస్తున్న ‘పట్టుకోడం, వదిలేయడం’ విధా నం లోపభూయిష్టంగా ఉందనీ, దేశంలోకి అనవసర వలసలు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. ఇకపై అక్రమ చొరబాటు దారులను పట్టుకోవడమే కానీ వదిలిపెట్టడం ఉండదని హెచ్చరించారు. అమెరికాలో బిడ్డ పుట్టినంత మాత్రాన అమెరికా పౌరసత్వం ఇచ్చేస్తుండటంతో ఇది ‘బర్త్ టూరిజం’గా మారిందనీ, చైనీయులు ఈ ‘వెర్రి, పిచ్చి’ విధానం వల్ల లాభం పొందారని ట్రంప్ ఆరోపించారు. -
హెచ్1బీపై ట్రంప్ దూకుడు
సంస్కరణలకు వ్యూహాలు రచిస్తున్న అమెరికా సర్కారు ► వీసా సంస్కరణలపై కాంగ్రెస్‌లో ఇప్పటికే ఆరు బిల్లులు వాషింగ్టన్ : భారత ఇంజనీర్లు, కంపెనీలపై పెను ప్రభావం చూపే హెచ్1బీ వీసాల సం స్కరణలపై ట్రంప్ సర్కారు సీరియస్‌గా ఆలోచిస్తోంది. అధికారంలోకి వచ్చాక చేసిన ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో దూకుడు మీదున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీలైనంత త్వరగా హెచ్1బీ వీసాల చట్టానికి మార్పులు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. అమెరికన్ల ఉద్యోగాలను భారత ఐటీ కంపెనీలు కొల్లగొడుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో హెచ్1బీ వీసాల చట్ట సవరణకోసం ఇప్పటికే ఆరుకుపైగా బిల్లులు అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులన్నింటి లక్ష్యం.. యూఎస్‌లోని భారత కంపెనీల్లో అమెరికన్లకు ఉద్యోగాలివ్వాలనటమే. కాగా, అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న వాదనను పరిశోధక విద్యార్థులు, ఆర్థికవేత్తలు, సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్‌లు ఖండిస్తున్నారు. వలసలకు చెక్?: హెచ్1బీ వర్క్ వీసాలు కలిగిన వారిలో అధికంగా భారత ఐటీ ఉద్యోగులు, కంపెనీలే ఉన్నాయి. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోపే రిపబ్లికన్ సెనెటర్ చక్ గ్రాస్లీ మరో సెనేటర్‌తో కలిసి ‘హెచ్1బీ, ఎల్1 సంస్కరణ చట్టం’ను ప్రవేశపెట్టారు. సెనేట్ జ్యుడీషియరీ కమిటీ చైర్మన్ కూడా అయిన గ్రాస్లీ.. నిపుణులు, అమెరికా కార్మికులకు ప్రయోజనం చేకూరేలా వీసాల జారీలో మార్పులు చేసే ఉద్దేశంతో దీన్ని తెరపైకి తెచ్చారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్1బీ, ఎల్1 వీసాదారులను తీసుకోవడాన్ని నిషేధించటం, ఈ వీసాలపై అమెరికా వచ్చిన నిపుణుల కనీస వేతనాలను రెట్టింపు చేయాలన్న నిబంధన సిలికాన్ వ్యాలీలోని అధిక శాతం భారతీయ కంపెనీలపై ప్రభావం చూపనుంది. గత నెలలో సెనేటర్ షెరాడ్ బ్రౌన్ తదితరులు అవుట్‌సోర్సింగ్‌ను నియంత్రించే బిల్లును ప్రవేశపెట్టారు. ఫిబ్రవరిలో రిపబ్లికన్ సెనేటర్లు టామ్ కాటన్ , డేవిడ్ పరడ్య... సుస్థిరమైన ఉద్యోగాల కోసం అమెరికన్ వలసల సంస్కరణ (రైజ్) చట్టం ప్రవేశపెట్టారు. మరోవైపు, హెచ్1బీ వీసాలతోపాటుగా గ్రీన్ కార్డు జారీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అర్కాన్సాస్ రిపబ్లికన్ సెనేటర్ టామ్ కాటన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసి సూచించారు. భారత్‌కు నష్టం తాత్కాలికమే! ప్రీమియం (ఫాస్ట్ ట్రాక్) హెచ్1బీ వీసాల ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దుచేయాలన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయం భారత అమెరికన్లకు తాత్కాలిక నష్టమేనని ప్రపంచబ్యాంకు మాజీ ఆర్థిక వేత్త కౌశిక్ బసు అభిప్రాయపడ్డారు. ‘హెచ్1బీ వీసాల తాత్కాలిక రద్దు నిర్ణయం భారత్‌కు కాస్త ఇబ్బందికరమే అయినా తర్వాత మేలు జరుగుతుంది. కానీ అమెరికాకు మాత్రం తీవ్ర నష్టం కలిగిస్తుంది’ అని కౌశిక్ బసు ట్వీటర్లో పేర్కొన్నారు. వీసాల సంస్కరణల్లో ఔట్‌సోర్సింగ్‌ను నియంత్రించాలన్న నిబంధన ఆచరణ సాధ్యం కాదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అమెరికా హెడ్ రాధిక బాత్రా చెప్పారు. ఇది ఉత్పత్తి, ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఓ తాజా అధ్యయనం ప్రకారం 2020 నాటికి యూఎస్‌లో పదిలక్షల మంది సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. దేశ ఆర్థిక, సాంకేతిక రంగంపై ప్రతికూల ప్రభావం తప్పదని నిపుణులు భావిస్తున్నారు. అక్రమ వలసలను అడ్డుకునేందుకే! అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడమే అమెరికా లక్ష్యం తప్ప, హెచ్1బీ వీసాల్ని అడ్డుకోవడం కాదని ఆ దేశ సీనియర్ అధికారులు భారత్‌కు స్పష్టం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. హెచ్1బీ వీసాలపై భారత నిపుణుల్లో నెలకొన్న ఆందోళనల్ని తగ్గించే క్రమంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే గురువారం విలేకరులతో మాట్లాడారు. హెచ్1బీ వీసాలపై డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంతో సంప్రదింపులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. భారతీయుల నైపుణ్యంపై అమెరికాలో బలమైన గుర్తింపు, గౌరవం ఉన్నాయని.. అలాగే అమెరికా ఆర్థిక రంగానికి భారత్ సాంకేతిక నిపుణులు సాయం చేస్తున్నారన్న అభిప్రాయం అక్కడి ఉన్నతాధికారులతో చర్చల్లో వ్యక్తమైందన్నారు. హెచ్1బీ వీసాల జారీ వాణిజ్య, వ్యాపార, ఆర్థిక అంశమని అమెరికాకు స్పష్టం చేశామని గోపాల్ తెలిపారు. -
వలసల్ని దాచేస్తాం!
ట్రంప్ ముప్పు నుంచి అక్రమ వలసదారులకు అమెరికన్ల అభయం ► దేశవ్యాప్తంగా ప్రతిఘటన.. ‘ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్’ ఆవిర్భావం ► వివిధ మత సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలతో కొత్త ‘నెట్వర్క్’ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌కు అమెరికన్లనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ఉధృతంగా సాగుతున్న ఈ ప్రతిఘటన (రెసిస్టెన్స్ ) ఉద్యమం ఇప్పుడు.. తమ దేశంలో సరైన పత్రాలు లేకుండా వలసదారులుగా ఉంటున్నవారికి అండగా నిలుస్తోంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులను బలవంతంగా వారి దేశాలకు పంపించాలనుకుంటున్న ట్రంప్ సర్కారు చర్యలను ‘ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్’ వ్యూహాత్మకంగా అడ్డుకుంటోంది. వివిధ మత సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలతో ఏర్పాౖటెన ఈ టీమ్‌లో మూవ్ఆన్ .ఆర్గ్, ద ఇన్ జిబుల్ గైడ్, రెసిస్టెన్స్ క్యాలెండర్ వంటి చాలా సంస్థలు భాగమయ్యాయి. అమెరికా వ్యాప్తంగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్మెంట్ (ఐసీఈ) దాడులు మొదలయ్యాయి. అమెరికాకు చాలా ఏళ్లక్రితం వలసవచ్చి అక్కడే జీవితం గడుపుతున్న వారిలో సరైన పత్రాలు లేని వారిని గుర్తించి.. బలవంతంగా వారి దేశాలకు తిప్పిపంపటం ఈ దాడుల లక్ష్యం. ఈ క్రమంలో చాలా మంది తమ కుటుంబాలకు, తమ పిల్లలకు దూరమవ్వాల్సిన దుస్థితి తలెత్తుతోంది. భార్యాభర్తలు విడిపోవాల్సిన పరిస్థితులూ దాపురిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇమిగ్రేషన్ అధికారుల కంటపడకుండా వలసదారులను రక్షించే మార్గాలను ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ రచిస్తోంది. ప్రైవేటు ఇళ్లలో ఆశ్రయం సొంత దేశాల్లో హింసను తప్పించుకోవడానికి అమెరికాకు వచ్చిన వారికి (1980ల్లో) చాలా మత సంస్థలు ఆశ్రయం కల్పించాయి. ఆ తర్వాత మార్చిన చట్టాల ప్రకారం చర్చిలు, ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల్లోనూ పోలీసులు సోదాలు చేయొచ్చు. కానీ 2011లో హోంశాఖ పాఠశాలలు, మత సంస్థలకు సోదాలనుంచి మినహాయింపునిచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండకపోవచ్చనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సరికొత్త ఆలోచనలపై దృష్టిపెట్టింది. ప్రైవేటు ఇళ్లలో ఈ వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు నడుంబిగించింది. వలసదారులు దాక్కునేందుకు వీలుగా కొత్త ఇళ్లు కొనడం, తమ సొంత ఇళ్ల మీద అంతస్తులు నిర్మించడం ఈ ప్రణాళికలో భాగం. ఎందుకంటే.. ప్రయివేటు ఇళ్లలోకి ప్రవేశించాలన్నా, సోదాలు చేయాలన్నా ఐసీఈ లేదా పోలీసులకు వారెంట్లు అవసరం. ఆ వారెంట్లు తెచ్చుకునేలోగా ఇంట్లో తలదాచుకున్న వారిని వేరో చోటుకు తరలించొచ్చు. కానీ, వలసలకు ఆశ్రయం ఇచ్చినట్లు అధికారులు గుర్తిస్తే.. ఇంటి యజమానులు న్యాయపరంగా భారీ జరిమానా, కఠినమైన జైలుశిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వీటికి భయపడేది లేదని లాస్ ఏంజిలస్కు చెందిన పాస్టర్ ఆదా వాలియెంటి పేర్కొన్నారు. బలవంతంగా తిప్పిపంపించడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితిలో ఉన్న వారికి ఆశ్రయం ఇవ్వటం వీరి ప్రాధాన్యత. సరైన పత్రాలు లేని వలసలదారులకు ఆశ్రయం కల్పించటంతోపాటు.. వీరిని అధికారులు బలవంతంగా తిప్పిపంపే ప్రయత్నం చేస్తే.. ఉచితంగా న్యాయ సలహాలివ్వటం, ఇంటర్వూ్యలకు తోడుగా వెళ్లటం ‘ర్యాపిడ్ రెస్పాన్స్ టీం’ పని. ఒక వలస తల్లి కథ! జీనెట్ విజ్గ్వెరా సరైన ధృవీకరణ పత్రాలు లేని వలసదారు. కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్‌లో నివసిస్తున్నారు. 1997లో మెక్సికో నుంచి భర్త, పెద్దకూతురు తానియాతో కలిసి వలసవచ్చారు. అనంతరం వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. పిల్లలు ముగ్గురూ అమెరికాలోనే పుట్టడంతో వారికి జన్మతః అమెరికా పౌరసత్వం ఉంది. వలసదారుల పిల్లలపై అమెరికా చట్టాల ప్రకారం పెద్ద కూతురుకు వచ్చిన సమస్యేమీ లేదు. వచ్చిన ఇబ్బందల్లా జీనెట్కే. 12 ఏళ్లవరకు ఇబ్బందులు లేకుండా హోటళ్లలో, స్థానిక ఇళ్లలో చిన్నా చితకా పనులు చేస్తూ జీవించిన జీనెట్.. అక్రమ వలసదారు అన్న విషయం 2009లో అధికార యంత్రాంగానికి తెలిసింది. దీంతో ఆమెను పంపించేందుకు అధికారులు ప్రయత్నించగా.. కొలరాడో వలసదారుల సంఘం ఒత్తిడి, రాజకీయ లాబీయింగ్ కారణంగా ఈమెను మెక్సికోకు పంపటంపై స్టే లభించింది. అయితే ఈ స్టే (నిలుపుదల ఉత్తర్వుల)కు ఫిబ్రవరి రెండో వారంతో గడువు తీరిపోయింది. దీంతో ఆమె అమెరికాలో ఉండేందుకు దారులన్నీ మూసుకుపోయాయి. అంతకుముందు వారంలో మరొక తల్లి గ్వాడాలూప్ గార్సియాను కూడా ఇలాగే నిర్బంధించి బలవంతంగా ఆమె స్వదేశానికి తిప్పిపంపించేశారు. దీంతో జీనెట్, ఆమె పిల్లలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆమె కొలరాడో చర్చిలో ఆశ్రయం పొందుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అక్రమ వలసలపై కేంద్రం చర్యలు: సోనియా
ఐజ్వాల్: మిజోరం రాష్ట్రానికి సమీపంలోని దేశాల నుంచి నానాటికీ పెరుగుతున్న అక్రమ వలసలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, వాటిని నిరోధించేందుకు సరైన సమయంలో చర్యలు చేపడుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నొక్కిచెప్పారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పెరుగుతున్న అక్రమ వలసల సమస్య తీవ్రమైనదన్నారు. ఐజ్వాల్‌కు 200 కి.మీ. దూరంలోని లంగ్లీ పట్టణంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో సోనియా పాల్గొన్నారు.