18 వేల మందికి డిపోర్టేషన్ ముప్పు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారికి డిపోర్టేషన్ ముప్పు పొంచి ఉంది. తమ దేశంలో చట్టవిరుద్ధంగా తిష్టవేసిన వారిని వెనక్కి పంపిస్తానని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అక్రమ వలసదార్లపై కఠినంగా వ్యవహరించక తప్పదని తేల్చిచెప్పారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్‌కు శ్రీకారం చుట్టబోతున్నానని స్పష్టంచేశారు. ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ఈ నేపథ్యంలో దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని గణాంకాలను యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) క్రోడీకరించింది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల నుంచి వివరాలు సేకరించింది. దాదాపు 10.50 లక్షల మంది చట్టవిరుద్ధంగా ఉంటున్నట్లు తేల్చింది. వీరిలో 17,940 వేల మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించింది. వీరంతా అధికారికంగా లెక్కతేలినవారే. ఈ మేరకు గత నెలలో ఒక జాబితా సైతం సిద్ధం చేసింది. నూతన అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీరంతా స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం బలవంతంగానైనా వెనక్కి పంపిస్తుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment