యోగేశ్వర్ దత్ ఎంతో హుందాగా ప్రవర్తించాడు!
భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఎంతో హుందాతనంతో ప్రవర్తించాడు. మంచి ఆటగాడిగానే కాదు మంచి మనసున్న వ్యక్తిగానూ ఈ రెజ్లర్ నిరూపించుకున్నాడు. డోపింగ్ ఫలితాలలో పాజిటీవ్ అని తేలిన రెజ్లర్ ప్రస్తుతం మన మధ్య లేనందున.. ఇప్పటికే బాధపడుతున్న ఆ కుటుంబానికి సాంత్వన చేకూర్చేలా ప్రవర్శించాడు రెజ్లర్ యోగేశ్వర్.
2012 లండన్ ఒలింపిక్స్‌లో తను సాధించిన కాంస్యం.. నాలుగేళ్ల తర్వాత రజతంగా మారిన విషయం తెలిసిందే. ఆ గేమ్స్‌లో రజతం సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్ ఫలితం రావడంతో ఆ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో యోగేశ్వర్‌కు రజతం దక్కింది.
ఈ విషయంపై యోగేశ్వర్ దత్ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ మంచి వస్తాదు అని కితాబిచ్చాడు. 'ఇప్పటికే ఆ రెజ్లర్ను కోల్పోయి కుదుఖోవ్ కుటుంబం ఎంతో బాధలో ఉండి ఉంటుంది. అందుకే ఆ రెజ్లర్ సాధించిన పతకాన్ని అతడి గౌరవార్థం ఆ కుటుంబం వద్దనే ఉండాలి. అయితే చనిపోయిన తర్వాత డోపింగ్ టెస్టులో విఫలమవడం దురదృష్టకరం. ఈ సమయంలో మనం మానవతాదృక్పథంతో నడుచుకోవాలి'అని తన ట్వీట్లలో వెల్లడించాడు.
Besik Kudukhov शानदार पहलवान थे। उनका मृत्यु के पश्चात dope test में fail हो जाना दुखद हैं। मैं खिलाड़ी के रूप में उनका सम्मान करता हूँ।
— Yogeshwar Dutt (@DuttYogi) 31 August 2016
अगर हो सके तो ये मेडल उन्ही के पास रहने दिया जाए। उनके परिवार के लिए भी सम्मानपूर्ण होगा। मेरे लिए मानवीय संवेदना सर्वोपरि है।
— Yogeshwar Dutt (@DuttYogi) 31 August 2016