Besik Kudukhov
-
ఆ రజతం వాళ్ల దగ్గరే ఉంచండి
► రెజ్లర్ కుదుఖోవ్ మరణంతో అతని కుటుంబం బాధలో ఉంది ► భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ అభ్యర్థన న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్‌లో తాను గెలిచిన కాంస్య పతకంతో సంతృప్తిగా ఉన్నానని... రష్యా దివంగత రెజ్లర్ బెసిక్ కుదుఖోవ్ డోప్ పరీక్షలో విఫలమైనప్పటికీ... అతని రజత పతకం వెనక్కి తీసుకొని తనకు ఇవ్వాల్సిన అవసరం లేదని భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధికారులకు విజ్ఞప్తి చేశాడు. మానవతా దృక్పథంతో వ్యవహరించి కుదుఖోవ్ కుటుంబ సభ్యుల వద్దే ఈ రజత పతకం ఉండేలా చూడాలని 2012 లండన్ ఒలింపిక్స్‌లో 60 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన యోగేశ్వర్ దత్ అన్నాడు. ‘రజత పతకం వెనక్కి తీసుకుంటే కుదుఖోవ్ కుటుంబానికి బాధ కలుగుతుంది. పతకం రూపంలోనైనా కుదుఖోవ్ తల్లిదండ్రులకు తమ కుమారుడి జ్ఞాపకాలు మిగిలి ఉంటారుు. 2013 డిసెంబరులో కుదుఖోవ్ కారు ప్రమాదంలో చనిపోయాడని తెలిసింది. ఒకవేళ అతను బతికిఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ అతను ఈ లోకంలో లేడు. నిన్ననే అతని కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల గురించి ఆలోచించాను. కేవలం తమ కుమారుడి జ్ఞాపకాలతోనే వారు జీవిస్తున్నారు. కుదుఖోవ్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడనేది అనవసరం. కొడుకు సాధించిన పతకం జ్ఞాపకంతో జీవిస్తున్న ఆ కుటుంబం నుంచి నేను దానిని తీసుకోదల్చుకోలేదు. రజత పతకం వారి వద్దే ఉండటం సబబుగా ఉంటుంది’ అని యోగేశ్వర్ దత్ అభిప్రాయపడ్డాడు. ‘డోప్ పరీక్షలో కుదుఖోవ్ విఫలమయ్యాక నేను సాధించిన కాంస్యం రజతం అవుతున్న వార్త విని అంతగా సంతోషపడలేదు. కుదుఖోవ్ నాకు మంచి మిత్రుడు. లండన్ ఒలింపిక్స్‌కంటే ముందు రష్యాలో నేను రెండు నెలలు ప్రాక్టీస్ చేశాను. నా కాంస్యం నా వద్దే ఉంది. ఇప్పుడు ఏ పతకమున్నా పెద్దగా తేడా ఉండదు’ అని హరియాణా పోలీసు విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న యోగేశ్వర్ అన్నాడు. యోగేశ్వర్ శాంపిల్‌నూ పరీక్షిస్తారు... లండన్ ఒలింపిక్స్ సందర్భంగా యోగేశ్వర్ దత్ వద్ద సేకరించిన డోప్ పరీక్షల ఫలితాలు క్లీన్‌గా వస్తేనే అధికారికంగా అతనికి రజత పతకం ఖరారు చేస్తారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) కొత్త నిబంధనల ప్రకారం అంతర్జాతీయ టోర్నీలలో క్రీడాకారుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను 10 ఏళ్లపాటు డీప్‌ఫ్రీజ్‌లో పెడుతున్నారు. తాజా టెక్నాలజీని ఉపయోగించి బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లలో క్రీడాకారుల నుంచి సేకరించిన నమూనాలను మళ్లీ పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారానే కుదుఖోవ్ లండన్ ఒలింపిక్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడని తేలింది. -
యోగేశ్వర్ దత్ ఎంతో హుందాగా ప్రవర్తించాడు!
భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఎంతో హుందాతనంతో ప్రవర్తించాడు. మంచి ఆటగాడిగానే కాదు మంచి మనసున్న వ్యక్తిగానూ ఈ రెజ్లర్ నిరూపించుకున్నాడు. డోపింగ్ ఫలితాలలో పాజిటీవ్ అని తేలిన రెజ్లర్ ప్రస్తుతం మన మధ్య లేనందున.. ఇప్పటికే బాధపడుతున్న ఆ కుటుంబానికి సాంత్వన చేకూర్చేలా ప్రవర్శించాడు రెజ్లర్ యోగేశ్వర్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో తను సాధించిన కాంస్యం.. నాలుగేళ్ల తర్వాత రజతంగా మారిన విషయం తెలిసిందే. ఆ గేమ్స్‌లో రజతం సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్ ఫలితం రావడంతో ఆ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో యోగేశ్వర్‌కు రజతం దక్కింది. ఈ విషయంపై యోగేశ్వర్ దత్ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ మంచి వస్తాదు అని కితాబిచ్చాడు. 'ఇప్పటికే ఆ రెజ్లర్‌ను కోల్పోయి కుదుఖోవ్ కుటుంబం ఎంతో బాధలో ఉండి ఉంటుంది. అందుకే ఆ రెజ్లర్ సాధించిన పతకాన్ని అతడి గౌరవార్థం ఆ కుటుంబం వద్దనే ఉండాలి. అయితే చనిపోయిన తర్వాత డోపింగ్ టెస్టులో విఫలమవడం దురదృష్టకరం. ఈ సమయంలో మనం మానవతాదృక్పథంతో నడుచుకోవాలి'అని తన ట్వీట్లలో వెల్లడించాడు. Besik Kudukhov शानदार पहलवान थे। उनका मृत्यु के पश्चात dope test में fail हो जाना दुखद हैं। मैं खिलाड़ी के रूप में उनका सम्मान करता हूँ। — Yogeshwar Dutt (@DuttYogi) 31 August 2016 अगर हो सके तो ये मेडल उन्ही के पास रहने दिया जाए। उनके परिवार के लिए भी सम्मानपूर्ण होगा। मेरे लिए मानवीय संवेदना सर्वोपरि है। — Yogeshwar Dutt (@DuttYogi) 31 August 2016 -
యోగేశ్వర్ దత్‌కు ఒలింపిక్స్ రజత పతకం!
తాజాగా జరిగిన రియో ఒలింపిక్స్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిబాట పట్టిన భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్‌కు కాస్త ఊరట లభించనుంది. అదేంటీ.. పతకం ఓడిన వ్యక్తికి లాభించే అంశం ఏమిటని ఆలోచిస్తున్నారా..! లండన్ ఒలింపిక్స్‌లో 60 కేజీ ఫ్రీస్టైల్ విభాగంలో బరిలోకి దిగన యోగేశ్వర్ కాంస్య పతకాన్ని 'పట్టు'కొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఒలింపిక్స లో రజతం సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ శాంపిల్స్ పై తాజాగా జరిపిన డోప్ టెస్టుల్లో అతడి శాంపిల్స్ పాజిటీవ్ అని తేలింది. ఇప్పటివరకూ అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి ప్రటకన వెలువడలేదు. 2013లో జరిగిన రోడ్డుప్రమాదంలో కుదుస్కోవ్ మరణించిన విషయం తెలిసిందే. అత్యాధునిక టెక్నాలజీ గత ఒలింపిక్స్ వరకూ లేని కారణంగా దాదాపు అన్ని దేశాల అథ్లెట్ల శాంపిల్స్ పై తాజాగా టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ జరిపిన టెస్టుల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లుగా తేలింది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన తమ అథ్లెట్ కుదుఖోవ్ డోపింగ్ టెస్టుల్లో విఫలమవడంతో రష్యా అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుదుఖోవ్ తో పాటు ఉజ్బెకిస్తాన్ కు చెందిన రెజ్లర్ తేమజోవ్(120కేజీ) కూడా పాజిటీవ్ అని తేలింది. తేమజోవ్ బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణపతకం సాధించాడు. వాడా టెస్టుల ఫలితాలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం వెల్లడిస్తే వారి పతకాలు వెనక్కి తీసుకుంటారు. దీంతో లండన్ లో కాంస్యంతో మెరిసిన యోగేశ్వర్ రజత పతక విజేతగా మారి ఆ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సుశీల్ కుమార్ సరసన నిలవనున్నాడని అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధికారి ఒకరు వెల్లడించారు.