ప్యారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్స్‌కు ముందు భారత హాకీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. నిషేదం కారణంగా భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ మంగళవారం జెర్మనీతో జరగనున్న సెమీఫైనల్‌కు దూరమయ్యాడు. ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని రోహిదాస్‌పై ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(FIH )టెక్నికల్ డెలిగేట్ ఒక్క మ్యాచ్ నిషేధం విధించింది.
ఈ క్రమంలోనే సెమీస్ పోరుకు రోహిదాస్ దూరంగా ఉండనున్నాడు. సెమీఫైనల్లో హాకీ జట్టు 16 మంది సభ్యులకు బదులుగా 15 మందితో ఆడనుంది. అయితే హాకీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంపై భారత జట్టు అసహనంగా ఉంది.
అయితే హాకీ ఇండియా ఇప్పటికే ఎఫ్ఐహెచ్ నిర్ణయంపై సవాలు చేసింది. రోహిదాస్‌పై విదించిన బ్యాన్ పై పూనరాలోచించాలని హాకీ ఇండియా అప్పీల్ చేసింది. అయితే సెమీస్‌కు ముందు ఎఫ్ఐహెచ్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు తక్కువ.
అసలేం జరిగిందంటే?
మ్యాచ్ 17వ నిమిషంలో భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ స్టిక్ బ్రిటన్ ఫార్వర్డ్ విలియమ్ కల్నాన్ తలకు తగిలింది. వీడియో రీప్లే చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనిపించకపోయినా... మ్యాచ్ రిఫరీ తీవ్ర చర్య తీసుకున్నాడు. రోహిదాస్‌కు ‘రెడ్ కార్డ్’ చూపించడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దాంతో మిగిలిన మ్యాచ్ మొత్తం భారత్ 10 మందితోనే ఆడింది.
Comments
Please login to add a commentAdd a comment