
భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ ప్రతిష్టాత్మక ‘వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అడ్వెంచర్ క్రీడాకారుడు అల్బెర్టో గైన్స్ లోపెజ్ (స్పెయిన్), వుషూ ప్లేయర్ గియోర్డనో (ఇటలీ)లతో శ్రీజేశ్ పోటీ æపడ్డాడు. ఓటింగ్‌లో శ్రీజేశ్‌కు 1,27,647 ఓట్లు రాగా, లోపెజ్‌కు 67, 428, మైకేల్‌కు 52,046 ఓట్లే పోలయ్యాయి. భారత్ తరఫున 2020లో మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్‌కు ఈ అవార్డు లభించింది.