భారత దిగ్గజం, మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) స్టార్స్ అవార్డుల రేసులో నిలిచారు. ఎఫ్‌ఐహెచ్ విడుదల చేసిన తుది జాబితాలో భారత పురుషుల జట్టు నుంచి వీరిద్దరిరు మాత్రమే నామినేట్ అయ్యారు. ఇక మహిళల జట్టులో ఏ ఒక్కరు రేసులో నిలువలేకపోయారు.
ఎవరు ఏ కేటగిరీలో అంటే?
కాగా.. ఇటీవల ప్యారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్యం గెలవడంలో కెప్టెన్ హర్మన్‌తో పాటు గోల్‌కీపర్ శ్రీజేశ్‌లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ కేటగిరీలో హర్మన్‌ప్రీత్‌తో పాటు బ్రింక్‌మన్, జోప్ డి మోల్ (నెదర్లాండ్స్), ముల్లర్ (జర్మనీ), వాలెస్ (ఇంగ్లండ్) నామినేట్‌య్యాడు.
ఇక.. ‘బెస్ట్ గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కోసం పీఆర్ శ్రీజేశ్, పిర్మన్ బ్లాక్ (నెదర్లాండ్స్), కాల్‌జడో (స్పెయిన్), డేన్‌బర్గ్ (జర్మనీ), శాంటియగో (అర్జెంటీనా) పోటీపడుతున్నారు. ఎఫ్‌ఐహెచ్ నియమించిన నిపుణుల ప్యానెల్ వీరిని తుది జాబితాకు ఎంపిక చేసింది. ఈ ప్యానెల్‌లో పలువురు ప్లేయర్లు, కోచ్‌లు, వివిధ దేశాలకు చెందిన సమాఖ్యల్లోని సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు.
విజేతల్ని ఎంపిక చేస్తారిలా!
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రొ లీగ్, నేషన్స్ కప్ హాకీ, ఒలింపిక్ క్వాలిఫయర్స్, ఒలింపిక్స్‌లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా నిపుణుల ప్యానెల్... ఆటగాళ్లను అవార్డుల కోసం నామినేట్ చేసింది.
ఇక వచ్చే నెల 11 వరకు జరిగే ఓటింగ్‌లో పోల్ అయిన ఓట్ల శాతంతో విజేతల్ని ప్రకటిస్తారు. కాగా ప్యారిస్‌లో భారత్ కాంస్యం గెలిచిన తర్వాత శ్రీజేశ్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. హర్మన్‌ప్రీత్ తాజాగా ఆసియా చాంపియన్స్‌లో భారత్‌కు టైటిల్ అందించిన జోష్‌లో ఉన్నాడు.
చదవండి: అజేయంగా ‘ఆసియా’ విజేతగా
Comments
Please login to add a commentAdd a comment