శ్రీజేశ్‌ పునరాగమనం | Return srijesh | Sakshi
Sakshi News home page

శ్రీజేశ్‌ పునరాగమనం

Published Tue, Jan 9 2018 12:47 AM | Last Updated on Tue, Jan 9 2018 12:47 AM

Return srijesh - Sakshi

న్యూఢిల్లీ: భారత స్టార్‌ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ ఎనిమిది నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌లో జరిగే నాలుగు దేశాల హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును హాకీ ఇండియా (హెచ్‌ఐ) సోమవారం ప్రకటించింది. 20 మంది సభ్యులు గల ఈ జట్టుకు మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యం వహిస్తాడు.

మోకాలి గాయంతో శ్రీజేశ్‌ గతేడాది కీలకమైన టోర్నీలకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ నెల 17 నుంచి జరిగే టోర్నీలో భారత్, కివీస్‌లతో పాటు బెల్జియం, జపాన్‌ జట్లు తలపడనున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement