న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్‌ఐ) గురువారం ప్రకటించింది. 18 మందితో కూడిన భారత బృందానికి మన్‌ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 16 వరకు భువనేశ్వర్‌లో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియం, కెనడా, దక్షిణాఫ్రికాలతో కలిసి భారత్ పూల్ ‘సి’లో ఉంది.
రూపిందర్ పాల్‌సింగ్, ఎస్‌వీ సునీల్‌లకు ఈసారి కూడా చాన్స్ దక్కలేదు. ‘అందుబాటులో ఉన్న వారి నుంచి అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేశాం’ అని కోచ్ హరేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు కప్‌లో పాకిస్తాన్ పాల్గొనడం సందేహంగా మారింది. అర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్ హాకీ సమాఖ్య డబ్బు కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి మొర పెట్టుకోగా... పీసీబీ నిరాకరించింద
భారత జట్టు: గోల్‌కీపర్స్: పీఆర్ శ్రీజేశ్, బహదూర్ పాఠక్. డిఫెండర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్, బిరేంద్ర లక్డా, వరుణ్ కుమార్, కొతాజిత్ సింగ్, ఖడంగ్‌బమ్, సురేందర్ కుమార్, అమిత్ రొహిదాస్. మిడ్‌ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), చింగ్లెన్‌సనా సింగ్ (వైస్ కెప్టెన్), నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్, సుమీత్. ఫార్వర్డ్స్: ఆకాశ్‌దీప్ సింగ్, మన్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, సిమ్రన్‌జీత్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment