kenada
-
భారీగా పెరిగిన నెట్‌ప్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరలు! ఎక్కడంటే!
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. యూజర్లకు మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సబ్స్క్రిప్షన్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు కాస్ట్లీగా మారాయి. గతనెల డిసెంబర్ లో నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో సబ్స్క్రిప్షన్ ధరల్ని తగ్గించింది. అయితే తాజాగా భారత్‌ను మినహాయించి యూకే, కెనడా దేశాల్లో సబ్స్క్రిప్షన్ సేవల్ని పెంచుతున్నట్లు అధికారింగా ప్రకటించింది. ప్లాన్‌ను బట్టి యూఎస్‌లో నెలవారీ సబ్స్క్రిప్షన్ ధరలు ఒకడాలర్ నుండి రెండు డాలర్ల వరకు పెరుగుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇక ఇండియాలో నెట్‌ప్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరలు ఇలా ఉన్నాయి. యూకేలో బేసిక్ ప్లాన్ వన్ స్క్రీన్ కాస్ట్ 9.99 డాలర్లు ఉండగా..14డాలర్లుగా ఉన్న స్టాండర్డ్ ప్లాన్‌ను 15.50కి పెంచింది. ఈ స్టాండర్డ్ ప్లాన్‌లో ఒకేసారి రెండు స్క్రీన్లలో లాగిన్ అవ్వొచ్చు. 4కే ప్లాన్ ధర 18డాలర్ల నుండి నెలకు 20కి పెంచగా.. ఇందులో ఒకేసారి నాలుగు స్క్రీన్లలో వీక్షించవవచ్చు. నెట్‌ఫ్లిక్స్ కెనడాలో తన సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరల్ని కూడా పెంచింది. కెనడాలో బేసిక్ ప్లాన్ 14.99 డాలర్ల నుండి 16.49కి పెంచింది. ప్రీమియం ప్లాన్ ధర 2డాలర్ల నుంచి 20.99కి పెంఇచంది. అయితే కెనడాలో మాత్రం నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ధరల్ని పెంచలేదు. బేసిక్ ప్లాన్ ధర రూ.9.99గా ఉంది. చదవండి: నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ప్యాకేజీ తగ్గింపు.. అమెజాన్ ప్రైమ్‌కు దెబ్బ! -
‘రూటు’ మారింది!
మన దేశంలోని యువత రూటు మార్చుకుంది. చదువులైపోగానే ఉద్యోగాల కోసం అమెరికాకు ఎగిరిపో దాం అనుకునే వారంతా తమ ఆలోచనలను మార్చుకున్నట్లు ఉన్నారు. గత రెండేళ్లుగా ఉద్యోగాల కోసం అమెరికా బదులు బ్రిటన్, కెనడాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని ‘ఇండీడ్’ అనే సంస్థ తాజా సర్వేలో పేర్కొంది. 2016 ఆగస్టు– 2018 జూలై మధ్య భారతీయులు అమెరికా ఉద్యోగాల కోసం అన్వేషించడం 10 శాతం తగ్గిందని ఈ సర్వే వెల్లడించింది. ఇక కెనడాలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే భారతీయుల సంఖ్య రెండింతలైంది. రెండేళ్ల కింద కెనడాలో ఉద్యోగాల కోసం వెతికే భారతీయు లు 6% ఉండగా, ఇప్పుడు 13 శాతానికి పెరిగింది. ఈ ఉద్యోగాల కోసమే.. కెనడాలో బిజినెస్ అనలిస్ట్, మెకానికల్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్ వంటి ఉద్యోగాలకు ఎక్కువ మం ది భారతీయులు దరఖాస్తు చేసుకుంటున్నారు. పరి శోధనల కోసం బ్రిటన్ను ఎంచుకుంటున్నారు. మన దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) కోర్సులు చేసిన వారికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇటీవల టెక్నాలజీ రంగంలో కెనడా దూసుకుపోతున్న నేపథ్యంలో అక్కడ ఈ రంగంలో ఉద్యోగాలకు విదేశీయులు ఎగబడుతున్నారు. దానికి తోడు కెనడా ప్రభుత్వం ఇటీవల వలస నిబంధనలు సడలించడంతో వీరి సంఖ్య మరింత పెరుగుతోంది. బ్రిటన్‌లో టెక్నాలజీ, ఫైనాన్స్, భాషా నైపుణ్య రంగా ల్లో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. భారతీయులే ఎక్కువ.. బ్రిటన్‌లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే విదేశీ యుల్లో అత్యధికులు భారతీయులేనని తాజా గణాంకాలు చెబుతున్నాయి. తర్వాతి స్థానాల్లో అమెరికా, ఫ్రాన్స్, పోలండ్, ఐర్లాండ్ దేశీయులున్నారు. బ్రిటన్‌లో ఉద్యోగాలు కోరుకుంటున్న భారతీయుల్లో ఐదింట ఒక వంతు మంది టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాలనే వెతుక్కుంటున్నారని ఇండీడ్ సర్వే వెల్లడించింది. ఆ దేశాలకే ఎందుకు? కెరీర్ అభివృద్ధికి అవకాశాలు అపారంగా ఉండటంతో పాటు వలస విధానాలను సరళీకరించడం వంటివి భారతీయ ఉద్యోగార్థులను కెనడా, బ్రిటన్లవైపు మొగ్గుచూపేలా చేస్తున్నాయి. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్ ఇటీవల విదేశీ విద్యార్థులు, ఉద్యోగార్థులకు సులభంగా అవకాశాలు కల్పిస్తోంది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ, గ్లోబల్ స్కిల్స్ వంటి వీసా విధానాలతో కెనడా కూడా విదేశీయుల్ని ఆకర్షిస్తోంది. ఒకవైపు అమెరికా వలస నిబంధనలను కఠినతరం చేస్తుంటే.. ఈ దేశాలు సరళీకరిస్తున్నాయి. దీంతో ఒక్క భారత్ నుంచే కాకుండా లాటిన్ దేశాల నుంచి యువత ఈ దేశాల వైపు మొగ్గుచూపుతున్నాయి. కెనడాలో భారతీయులు కోరుకుంటున్న ఉద్యోగాలు - బిజినెస్ అనలిస్ట్, - మెకానికల్ ఇంజనీర్ - సాఫ్ట్వేర్ డెవలపర్ - ప్రాజెక్ట్ మేనేజర్ - వెబ్ డెవలపర్ - డేటా సైంటిస్ట్ - జావా డెవలపర్ - సివిల్ ఇంజనీర్ - సాఫ్ట్వేర్ ఇంజనీర్ - డేటా అనలిస్ట్ బ్రిటన్‌లో దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలు - రీసెర్చ్ ఫెలో - స్టాఫ్ కన్సల్టెంట్ - ఐఓఎస్ డెవలపర్ - ఆండ్రాయిడ్ డెవలపర్ - ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్ - రీసెర్చ్ అసోసియేట్ - జావా డెవలపర్ - ఫిజీషియన్ - ఆర్కిటెక్ట్ -
హాకీ ప్రపంచకప్ జట్టు ఇదే
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) గురువారం ప్రకటించింది. 18 మందితో కూడిన భారత బృందానికి మన్‌ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 16 వరకు భువనేశ్వర్‌లో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియం, కెనడా, దక్షిణాఫ్రికాలతో కలిసి భారత్ పూల్ ‘సి’లో ఉంది. రూపిందర్ పాల్‌సింగ్, ఎస్వీ సునీల్‌లకు ఈసారి కూడా చాన్స్ దక్కలేదు. ‘అందుబాటులో ఉన్న వారి నుంచి అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేశాం’ అని కోచ్ హరేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు కప్‌లో పాకిస్తాన్ పాల్గొనడం సందేహంగా మారింది. అర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్ హాకీ సమాఖ్య డబ్బు కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి మొర పెట్టుకోగా... పీసీబీ నిరాకరించింద భారత జట్టు: గోల్‌కీపర్స్: పీఆర్ శ్రీజేశ్, బహదూర్ పాఠక్. డిఫెండర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్, బిరేంద్ర లక్డా, వరుణ్ కుమార్, కొతాజిత్ సింగ్, ఖడంగ్బమ్, సురేందర్ కుమార్, అమిత్ రొహిదాస్. మిడ్ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), చింగ్లెన్సనా సింగ్ (వైస్ కెప్టెన్), నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్, సుమీత్. ఫార్వర్డ్స్: ఆకాశ్‌దీప్ సింగ్, మన్దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, సిమ్రన్‌జీత్ సింగ్. -
గ్రేట్ రైటర్ : సోల్ బెలో
రష్యా నుంచి కెనడాకు వలస వచ్చింది సోల్ బెలో కుటుంబం. సోల్ బెలో (1915–2005) కెనడాలోనే పుట్టాడు. దాదాపుగా మురికివాడల రౌడీలా పెరిగాడు. బెలో చిన్నతనంలోనే వాళ్ల కుటుంబం మళ్లీ అమెరికాకు వెళ్లింది. తన రచనల్లోని పాత్రలన్నీ ఒక ఉత్కృష్టస్థితిని పొందడానికి పరితపించేవిగా కనబడతాయని చెబుతారు, అది వెలివాడల పరిస్థితుల నుంచే కాదు వెలివాడల మానసిక సంకెళ్ల నుంచి కూడా. యూదు కుటుంబం కావడాన, ఇంట్లో, ముఖ్యంగా వాళ్లమ్మ నుంచి మతం గురించిన ఒత్తిడి ఎక్కువుండేది. కొడుకును రబ్బీని చేయాలని కూడా కోరుకుంది. కానీ ఊపిరిసలపని ఛాందసం భరించరానిదంటూ దానికి ఎదురు తిరిగాడు. చిన్న వయసులోనే రాయడం మీద ఆసక్తి కలిగింది. ‘అంకుల్ టామ్స్ క్యాబిన్’ చదివాక రచయిత కావాలనుకున్నాడు. ఇరవయ్యో శతాబ్దపు ప్రభావశీల నవలాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. 1976లో నోబెల్ పురస్కారం వరించింది. ది ఎడ్వెంచర్స్ ఆఫ్ ఆగి మార్చ్, హెండర్సన్ ద రెయిన్ కింగ్, హెర్జోగ్, మిస్టర్ శామ్లర్స్ ప్లానెట్, సీజ్ ద డే ఆయన నవలల్లో కొన్ని. మోస్బీస్ మెమొయిర్స్, హిమ్ విత్ హిజ్ ఫూట్ ఇన్ హిజ్ మౌత్ ఆయన కథా సంకలనాలు. విమర్శకుల స్పందనలను ఖాతరు చేసేవాడు కాదు. ఒక పిచ్చివాడు నీళ్లలోకి విసిరిన రాయిని పదిమంది వివేకవంతులు కూడా దొరికించుకోలేరన్న హీబ్రూ సామెతను ఉదహరించేవాడు. తన వ్యక్తిగత వివరాలకు రచయిత ప్రాధాన్యత ఇవ్వడం ఆయనకు నచ్చేది కాదు. -
స్వీట్ సిస్టర్స్
సాధారణంగా ఎవరికైనా కవలలు పుట్టడం గురించి తెలుసు.. మహా అయితే ముగ్గురు పుట్టడాన్ని కూడా చూసే ఉంటారు! కానీ కెనడాలో ఒక జంటకు ఏకంగా నలుగురు శిశువులు ఒకే కాన్పులో జన్మించారు. నలుగురికి జన్మ ఇవ్వడం గూర్చి కూడా ఇది వరకే ఎక్కడో విన్నాం అంటారా? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం ఇంతవరకు మీరు విని ఉండరు. కెనడాలోని బెతని, టిమ్ వెబ్ దంపతులకు జన్మించిన ఈ నలుగురు ఆడ శిశువులు ఒకే రూపంతో జన్మించారు. ఒకే కాన్పులో నలుగురు జన్మించడం అనేది 7,29,000 కేసుల్లో ఒకరికి సంభవిస్తుంది. కానీ ఇలా ఒకే రూపంతో నలుగురు శిశువులు జన్మించడం అనే విషయం మాత్రం 15 మిలియన్ సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందట! ఇలా ఏంజిల్స్లా కనిపిస్తున్న ఈ సిస్టర్స్ పేర్లు అబిగలీ, మెకేలా, గ్రేస్, ఎమిలీ. వీరు ఈ ఏడాది మే లో జన్మించారు. ఈ ఫొటోషూట్‌ను మూడు గంటల పాటు జరపగా అంతసేపు ఈ నలుగురు నిద్రలోనే కదలకుండా ఉన్నారంటా!