‘రూటు’ మారింది! | Indians was interested to go for Britain and Canada for Jobs | Sakshi
Sakshi News home page

‘రూటు’ మారింది!

Published Sun, Jan 13 2019 2:48 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

Indians was interested to go for Britain and Canada for Jobs - Sakshi

మన దేశంలోని యువత రూటు మార్చుకుంది. చదువులైపోగానే ఉద్యోగాల కోసం అమెరికాకు ఎగిరిపో దాం అనుకునే వారంతా తమ ఆలోచనలను మార్చుకున్నట్లు ఉన్నారు. గత రెండేళ్లుగా ఉద్యోగాల కోసం అమెరికా బదులు బ్రిటన్, కెనడాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని ‘ఇండీడ్‌’ అనే సంస్థ తాజా సర్వేలో పేర్కొంది. 2016 ఆగస్టు– 2018 జూలై మధ్య భారతీయులు అమెరికా ఉద్యోగాల కోసం అన్వేషించడం 10 శాతం తగ్గిందని ఈ సర్వే వెల్లడించింది. ఇక కెనడాలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే భారతీయుల సంఖ్య రెండింతలైంది. రెండేళ్ల కింద కెనడాలో ఉద్యోగాల కోసం వెతికే భారతీయు లు 6% ఉండగా, ఇప్పుడు 13 శాతానికి పెరిగింది. 

ఈ ఉద్యోగాల కోసమే.. 
కెనడాలో బిజినెస్‌ అనలిస్ట్, మెకానికల్‌ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వంటి ఉద్యోగాలకు ఎక్కువ మం ది భారతీయులు దరఖాస్తు చేసుకుంటున్నారు. పరి శోధనల కోసం బ్రిటన్‌ను ఎంచుకుంటున్నారు. మన దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌ (స్టెమ్‌) కోర్సులు చేసిన వారికి విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఇటీవల టెక్నాలజీ రంగంలో కెనడా దూసుకుపోతున్న నేపథ్యంలో అక్కడ ఈ రంగంలో ఉద్యోగాలకు విదేశీయులు ఎగబడుతున్నారు. దానికి తోడు కెనడా ప్రభుత్వం ఇటీవల వలస నిబంధనలు సడలించడంతో వీరి సంఖ్య మరింత పెరుగుతోంది. బ్రిటన్‌లో టెక్నాలజీ, ఫైనాన్స్, భాషా నైపుణ్య రంగా ల్లో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. 
భారతీయులే ఎక్కువ.. 
బ్రిటన్‌లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే విదేశీ యుల్లో అత్యధికులు భారతీయులేనని తాజా గణాంకాలు చెబుతున్నాయి. తర్వాతి స్థానాల్లో అమెరికా, ఫ్రాన్స్, పోలండ్, ఐర్లాండ్‌ దేశీయులున్నారు. బ్రిటన్‌లో ఉద్యోగాలు కోరుకుంటున్న భారతీయుల్లో ఐదింట ఒక వంతు మంది టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాలనే వెతుక్కుంటున్నారని ఇండీడ్‌ సర్వే వెల్లడించింది. 

ఆ దేశాలకే ఎందుకు?
కెరీర్‌ అభివృద్ధికి అవకాశాలు అపారంగా ఉండటంతో పాటు వలస విధానాలను సరళీకరించడం వంటివి భారతీయ ఉద్యోగార్థులను కెనడా, బ్రిటన్‌లవైపు మొగ్గుచూపేలా చేస్తున్నాయి. బ్రెగ్జిట్‌ నేపథ్యంలో బ్రిటన్‌ ఇటీవల విదేశీ విద్యార్థులు, ఉద్యోగార్థులకు సులభంగా అవకాశాలు కల్పిస్తోంది. ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ, గ్లోబల్‌ స్కిల్స్‌ వంటి వీసా విధానాలతో కెనడా కూడా విదేశీయుల్ని ఆకర్షిస్తోంది. ఒకవైపు అమెరికా వలస నిబంధనలను కఠినతరం చేస్తుంటే.. ఈ దేశాలు సరళీకరిస్తున్నాయి. దీంతో ఒక్క భారత్‌ నుంచే కాకుండా లాటిన్‌ దేశాల నుంచి యువత ఈ దేశాల వైపు మొగ్గుచూపుతున్నాయి. 

కెనడాలో భారతీయులు కోరుకుంటున్న ఉద్యోగాలు 
- బిజినెస్‌ అనలిస్ట్,
మెకానికల్‌ ఇంజనీర్‌ 
సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ 
ప్రాజెక్ట్‌ మేనేజర్‌ 
వెబ్‌ డెవలపర్‌ 
డేటా సైంటిస్ట్‌ 
జావా డెవలపర్‌  
సివిల్‌ ఇంజనీర్‌ 
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌       
డేటా అనలిస్ట్‌ 

బ్రిటన్‌లో దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలు 
రీసెర్చ్‌ ఫెలో  
స్టాఫ్‌ కన్సల్టెంట్‌ 
ఐఓఎస్‌ డెవలపర్‌  
ఆండ్రాయిడ్‌ డెవలపర్‌ 
ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ అనలిస్ట్‌ 
రీసెర్చ్‌ అసోసియేట్‌       
జావా డెవలపర్‌ 
- ఫిజీషియన్‌  
ఆర్కిటెక్ట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement