స్వీట్ సిస్టర్స్
సాధారణంగా ఎవరికైనా కవలలు పుట్టడం గురించి తెలుసు.. మహా అయితే ముగ్గురు పుట్టడాన్ని కూడా చూసే ఉంటారు! కానీ కెనడాలో ఒక జంటకు ఏకంగా నలుగురు శిశువులు ఒకే కాన్పులో జన్మించారు. నలుగురికి జన్మ ఇవ్వడం గూర్చి కూడా ఇది వరకే ఎక్కడో విన్నాం అంటారా? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం ఇంతవరకు మీరు విని ఉండరు.
కెనడాలోని బెతని, టిమ్ వెబ్ దంపతులకు జన్మించిన ఈ నలుగురు ఆడ శిశువులు ఒకే రూపంతో జన్మించారు. ఒకే కాన్పులో నలుగురు జన్మించడం అనేది 7,29,000 కేసుల్లో ఒకరికి సంభవిస్తుంది. కానీ ఇలా ఒకే రూపంతో నలుగురు శిశువులు జన్మించడం అనే విషయం మాత్రం 15 మిలియన్ సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందట! ఇలా ఏంజిల్స్‌లా కనిపిస్తున్న ఈ సిస్టర్స్ పేర్లు అబిగలీ, మెకేలా, గ్రేస్, ఎమిలీ. వీరు ఈ ఏడాది మే లో జన్మించారు. ఈ ఫొటోషూట్‌ను మూడు గంటల పాటు జరపగా అంతసేపు ఈ నలుగురు నిద్రలోనే కదలకుండా ఉన్నారంటా!