రఘు ప్రసాద్- నీరజ్ చోప్రా
Paris Olympics 2024: వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో హాకీ ఈవెంట్‌లో విధులు నిర్వహించే అంపైర్ల వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రకటించింది. పురుషుల, మహిళల మ్యాచ్‌లకు కలిపి మొత్తం 28 మంది అంపైర్లును ఎంపిక చేశారు.
భారత్ నుంచి రఘు ప్రసాద్ ఒక్కడే అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపికయ్యాడు. 2003 నుంచి అంపైర్‌గా వ్యవహరిస్తున్న రఘు 186 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైర్‌గా పని చేశాడు. 2012 లండన్, 2021 టోక్యో ఒలింపిక్స్‌లోనూ రఘు ప్రసాద్ అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించాడు.
నీరజ్ చోప్రా ఒక్కడే
ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌లో భారత్ నుంచి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మాత్రమే పోటీపడుతున్నాడు. అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్), మురళీ శ్రీశంకర్ (లాంగ్‌జంప్) కూడా అర్హత సాధించినా ఆసియా క్రీడల నేపథ్యంలో ఈ ఇద్దరు దూరంగా ఉన్నారు. ఈనెల 16, 17వ తేదీల్లో అమెరికాలోని యుజీన్‌లో ఈ ఫైనల్స్ జరుగుతాయి. గత ఏడాది జ్యూరిక్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ జావెలిన్ త్రో ఈవెంట్ స్వర్ణ పతకం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment