నేపాల్‌లో ఇటీవల సంభవించిన భూకంపంలో బాధితులను ఆదుకునేందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ముందుకు వచ్చింది...
న్యూఢిల్లీ: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భూకంపంలో బాధితులను ఆదుకునేందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ముందుకు వచ్చింది. రూ.10 లక్షల విరాళాన్ని ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్‌కు అందించింది. ‘మన పొరుగు దేశానికి ఇప్పుడు పూర్తి స్థాయిలో సహాయం అందాల్సి ఉంది. ఈ జాతీయ విపత్తు నుంచి వారు బయటపడేందుకు మేం శాయశక్తులా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. చిన్న మొత్తమైనా వారు తమ జీవితాలను తిరిగి ప్రారంభించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని హెచ్‌ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. నేపాల్‌కు ఆర్థిక సహాయం ప్రకటించిన క్రీడా సంఘాల్లో హెచ్‌ఐ మొదటిది కావడం విశేషం.