
హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్(పీటీఐ ఫొటో)
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్‌రత్న అవార్డ్‌కు హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్ పేరును నామినేట్ చేస్తున్నట్లు హాకీ ఇండియా శనివారం ప్రకటించింది. అదే విధంగా.. హాకీ మహిళా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారిణి దీపిక పేరును కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసింది. ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అవార్డుకు డాక్టర్ ఆర్పీ సింగ్, సంగాయి ఇబెంహాల్ పేర్లను ప్రతిపాదించింది. ద్రోణాచార్య పురస్కారానికి బీజే కరియప్ప, సీఆర్ కుమార్ పేర్లను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక అర్జున పురస్కారానికి హర్మన్‌ప్రీత్ సింగ్, వందనా కటారియాతో పాటు నవజోత్ కౌర్ పేర్లను ప్రతిపాదించింది.
చదవండి: 2 డజన్లకు పైగా పతకాలు.. రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతూ
Comments
Please login to add a commentAdd a comment