Rajiv Gandhi Khel Ratna
-
రాజీవ్ ఖేల్‌రత్న: హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్ పేరు నామినేట్
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్‌రత్న అవార్డ్‌కు హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్ పేరును నామినేట్ చేస్తున్నట్లు హాకీ ఇండియా శనివారం ప్రకటించింది. అదే విధంగా.. హాకీ మహిళా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారిణి దీపిక పేరును కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసింది. ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అవార్డుకు డాక్టర్ ఆర్పీ సింగ్, సంగాయి ఇబెంహాల్ పేర్లను ప్రతిపాదించింది. ద్రోణాచార్య పురస్కారానికి బీజే కరియప్ప, సీఆర్ కుమార్ పేర్లను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక అర్జున పురస్కారానికి హర్మన్‌ప్రీత్ సింగ్, వందనా కటారియాతో పాటు నవజోత్ కౌర్ పేర్లను ప్రతిపాదించింది. చదవండి: 2 డజన్లకు పైగా పతకాలు.. రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతూ -
కమాండెంట్ సింధు...
బ్యాడ్మింటన్ స్టార్‌కు సీఆర్పీఎఫ్ గౌరవం! న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు మరో గౌరవం లభించనుంది. ఈ హైదరాబాద్ అమ్మారుుకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కమాండెంట్ గౌరవ హోదా ఇవ్వనుంది. దాంతోపాటు ఆమెను సీఆర్పీఎఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనుంది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ హోం మంత్రిత్వశాఖకు తమ ప్రతిపాదనలు పంపించింది. లాంఛనాలు పూర్తయ్యాక అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్ ఈ నియామక ప్రకటన చేయనుంది. ఈ మేరకు సింధుకు కూడా సమాచారం అందించినట్లు సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి. సీఆర్పీఎఫ్లో కమాండెంట్ ర్యాంక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఎస్పీ)తో సమానం. సీఆర్పీఎఫ్లో కమాండెంట్ ర్యాంక్ ఉన్న వారు వెయ్యిమందితో కూడిన దళానికి నాయకుడిగా ఉంటారు. -
మన సింధు 'రత్నం'
-
మన సింధు 'రత్నం'
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి భారత జెండాను వినువీధుల్లో ఎగరేసిన తెలుగమ్మాయి పీవీ సింధు కీర్తి కిరీటంలో మరో కిలికితురాయి చేరింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డును సింధు సోమవారం అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో సింధు, సాక్షి మాలిక్‌లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా అవార్డులు స్వీకరించారు. ఈ ఇద్దరితో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన షూటర్ జితూరాయ్, మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కూడా ఖేల్‌రత్న అవార్డులను అందుకున్నారు. వీరికి పురస్కారంతో పాటు రూ. 7.5 లక్షల చెక్ ను అందజేశారు. దేశం నుంచి తొలిసారి ఒలింపిక్ రజతం సాధించిన మహిళగా సింధు ఘనత సాధించగా... తొలి మహిళా రెజ్లర్‌గా కాంస్యం దక్కించుకున్న సాక్షి ఆకట్టుకుంది. అలాగే కాంస్య పతకాన్ని తృటిలో కోల్పోయిన దీపా కర్మాకర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా పేరు తెచ్చుకుంది. ఇక గత రెండేళ్లుగా ఆరు అంతర్జాతీయ పతకాలను జితూ రాయ్ సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ నలుగుర్ని ఖేల్ రత్న అవార్డు వరించింది. మరోవైపు ఆరుగురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులను, 15 మందికి అర్జున అవార్డులను ప్రదానం చేశారు. నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), సాగర్ మాల్ దయాళ్ (బాక్సింగ్), రాజ్‌కుమార్ శర్మ (క్రికెట్), విశ్వేశ్వర్ నంది (జిమ్నాస్టిక్స్), ఎస్. ప్రదీప్ కుమార్ (స్విమింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్)లకు ద్రోణాచార్య పురస్కారం దక్కింది. మరోవైపు అర్జున అవార్డుకు ఎంపికైనవినేశ్ ఫోగట్ (రెజ్లింగ్) వీల్ చైర్లోనే అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైంది. రియో ఒలింపిక్స్‌లో మహిళల ఫ్రీస్టయిల్ 48 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్లో గాయంతో మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. సన్ యానన్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వినేశ్ కాలు తిరగబడి విలవిల్లాడింది. ఇంకా ఆమె గాయం పూర్తిగా నయం కాకపోవడంతో వీల్ చైర్లోనే అర్జున అవార్డును అందుకుంది. -
యువ క్రీడాకారులకు సింధు స్ఫూర్తి
వైఎస్ జగన్ అభినందన సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్ రత్నకు ఎంపికైన బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధును వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఖేల్ రత్న అవార్డుకు సింధు అర్హురాలని, భవిష్యత్‌లో తను యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని సాక్షి మలిక్, దీపా కర్మాకర్, జీతూ రాయ్‌లకు కూడా ఖేల్త్న్ర ఇవ్వనుండడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ద్రోణాచార్య, అర్జున, ధ్యాన్‌చంద్ అవార్డులకు ఎంపికైన వారిని కూడా ఈ సందర్భంగా ఆయన అభినందించారు. -
సింధు, సాక్షిలకు ‘ఖేల్‌రత్న’
* జీతూ రాయ్, దీపలకు కూడా... * అథ్లెటిక్స్ కోచ్ రమేశ్‌కు ద్రోణాచార్య * సత్తి గీతకు ధ్యాన్‌చంద్ అవార్డు * రహానేకు అర్జున పురస్కారం * 29న ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మలిక్‌లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న దక్కింది. అలాగే పట్టువదలని పోరాటంతో అందరి మనస్సులు గెలుచుకున్న షూటర్ జితూ రాయ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌లను కూడా ఈ పురస్కారం వరించింది. సోమవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈమేరకు ప్రకటించింది. దేశం నుంచి తొలిసారి ఒలింపిక్ రజతం సాధించిన మహిళగా సింధు ఘనత సాధించగా... తొలి మహిళా రెజ్లర్‌గా కాంస్యం దక్కించుకున్న సాక్షి ఆకట్టుకుంది. అలాగే కాంస్య పతకాన్ని కేవలం 0.15 పాయింట్ల తేడాతో కోల్పోయిన దీపా కర్మాకర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా పేరు తెచ్చుకుంది. ఇక గత రెండేళ్లుగా షూటర్ జీతూ రాయ్ ఆరు అంతర్జాతీయ పతకాలు సాధించాడు. వీరికి పురస్కారం కింద రూ.7.5 లక్షల నగదు ఇవ్వనున్నారు. ఒకే ఏడాది నలుగురికి ఖేల్త్న్ర ఇవ్వడం భారత క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్.రమేశ్‌కు ద్రోణాచార్య తెలంగాణకు చెందిన అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌కు ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్ మాజీ అథ్లెట్ సత్తి గీత (అథ్లెటిక్స్) ధ్యాన్‌చంద్ అవార్డ్‌కు ఎంపికయ్యింది. క్రికెటర్ అజింక్య రహానే, హాకీ క్రీడాకారులు వీఆర్ రఘునాథ్, రాణీ రాంపాల్ అర్జున అవార్డు అందుకోనున్నారు. ఈ పురస్కారాలను ఆగస్ట్ 29న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందిస్తారు. 15ఏళ్ల శ్రమకు గుర్తింపు: రమేశ్ అల్వాల్: శిక్షణలో మానవీయ కోణం జోడిస్తే క్రీడాకారులకు నమ్మకం కలిగి మరింత ప్రోత్సాహం అందుతుందని ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ అన్నారు. ‘15 సంవత్సరాల పాటు నా శిక్షణ అనుభవానికి తగిన గుర్తింపు లభించింది. నాకు ఈ గౌరవం దక్కుతుందని గోపీచంద్, లక్ష్మణ్ తరచూ చెప్పేవారు’ అని సంతోషం వ్యక్తం చేశారు. అవార్డుల జాబితా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (రూ.7.5 లక్షలు) పీవీ సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్). అర్జున అవార్డులు (రూ.5 లక్షలు) అజింక్య రహానే (క్రికెట్), రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్,స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్ (హాకీ), వి.ఆర్ రఘునాథ్ (హాకీ), గురుప్రీత్ సింగ్ (షూటింగ్), అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్), వీరేందర్ సింగ్ (రెజ్లింగ్). ద్రోణాచార్య అవార్డు లు(రూ.5 లక్షలు) నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), సాగర్ మాల్ దయాళ్ (బాక్సింగ్), రాజ్‌కుమార్ శర్మ (క్రికెట్), విశ్వేశ్వర్ నంది (జిమ్నాస్టిక్స్), ఎస్. ప్రదీప్ కుమార్ (స్విమింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). ధ్యాన్ చంద్ అవార్డులు (రూ.5 లక్షలు) సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రసాద్ షెల్కే ( రోయింగ్). -
సానియా ‘ఖేల్ రత్న’కు మార్గం సుగమం
నేడు జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న’ అవార్డు విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కాస్త ఊరట లభించింది. మొదట ప్రకటించినట్లుగానే సానియాకు ‘ఖేల్ రత్న’ను అందజేయాలని కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన నోటీసులు అవార్డు ఇవ్వడానికి అడ్డంకిగా మారబోవని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అవార్డుల కార్యక్రమంలో మొదట ఎంపిక చేసిన జాబితాను అమలు చేస్తామన్నారు. మరోవైపు సానియా గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధారణ విభాగంలో పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. నాలుగేళ్ల కాల వ్యవధితో పాటు అవార్డు ఇచ్చే ఏడాది... ఏ క్రీడాకారుడైనా అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే ఖేల్త్న్రతో గౌరవించొచ్చని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం నేడు రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది. వినోద్ కుమార్‌కూ ఇవ్వండి... మరోవైపు భారత రెజ్లింగ్ మాజీ చీఫ్ కోచ్ వినోద్ కుమార్‌కు కూడా ‘ద్రోణాచార్య పురస్కారం’ అందించాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2012లోనే వినోద్‌కు ‘ధ్యాన్‌చంద్ అవార్డు’ ఇచ్చినందున ఆయన పేరును ద్రోణాచార్యకు పరిశీలించలేమంటూ కేంద్రం, మాజీ కోచ్ పేరును పక్కన పెట్టింది. అయితే తనకు నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నాయని, గత అవార్డు దీనికి అడ్డంకి కాదంటూ వినోద్ కోర్టుకెక్కారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు వినోద్ సాధించిన విజయాలు, ఘనతలను సెలక్షన్ కమిటీ పరిశీలనలోకి తీసుకోవాలంటూ తీర్పు చెప్పింది. -
ఆమె విజయాలు అసమానం!
భారత టెన్నిస్ స్టార్, మహిళల డబుల్స్ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి సానియా మీర్జాకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్ ఖల్ రత్న' దక్కింది. జూన్ నెలలో మార్టినా హింగిస్ తో కలిసి వింబుల్డన్ డబుల్ టైటిల్ నెగ్గిన సానియాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మంగళవారం ఖేల్ రత్న ప్రకటించింది. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోనప్పటికీ ఆమెను ఈ పురస్కారం వరించడం విశేషం. ఒడిదుడుకులు తట్టుకుని అసమాన ఆటతీరుతో నయా చరిత్ర లిఖించిన సానియాకు ఖేల్ రత్న వచ్చిన సందర్భంలో ఆమె సాధించిన ముఖ్యమైన విజయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. గ్రాండ్ స్లామ్ టైటిల్స్ 2003 అలీసా క్లెనోవా(రష్యా)తో కలిసి బాలికల విభాగంలో వింబుల్డన్ డబుల్స్ విజేత 2009 మహేష్ భూపతితో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబ్సుల్ టైటిల్ గెలుపు 2012 మహేష్ భూపతితో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుపు 2014 బ్రునో సోరెస్(బ్రెజిల్)తో కలిసి యూఎస్ ఓపెన్ టైటిల్ ఆఫ్రో-ఆసియన్ గేమ్స్ (హైదరాబాద్) 2003 మహిళల సింగిల్స్ టైటిల్ 2003 మహిళల డబుల్స్ టైటిల్ 2003 మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ 2003 మహిళల టీమ్ టైటిల్ ఆసియన్ గేమ్స్ 2000 బుసాన్- మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ 2006 దోహా- మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ 2006 దోహా- మహిళల సింగిల్స్ టైటిల్ 2006 దోహా- మహిళల టీమ్ టైటిల్ 2011 గ్వాంగ్ గ్జౌ- మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ 2011 గ్వాంగ్ గ్జౌ- మహిళల సింగిల్స్ టైటిల్ 2014 ఇంచియాన్- మహిళల డబుల్స్ టైటిల్ 2014 ఇంచియాన్- మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ కామన్వెల్త్ గేమ్స్ 2010 ఢిల్లీ- మహిళల సింగిల్స్ టైటిల్ 2010 ఢిల్లీ- మహిళల డబుల్స్ టైటిల్ పురస్కారాలు 2004 అర్జున అవార్డు 2005 డబ్ల్యూటీఏ న్యూకమర్ ఆఫ్ ది ఇయర్ 2006 పద్మశ్రీ 2014 తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం -
ఖేల్ రత్న రేసులో పళ్లికల్
న్యూఢిల్లీ : భారత క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న కోసం స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ పేరును తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. టాప్-10 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న తొలి స్క్వాష్ ప్లేయర్‌గా 23 ఏళ్ల దీపికా రికార్డులకెక్కింది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో జోష్నా చిన్నప్పతో కలిసి దేశ స్క్వాష్ చరిత్రలో తొలిసారి దీపికా స్వర్ణం సాధించింది. తమిళనాడు క్రీడా అభివృద్ధి అథారిటీ దీపిక పేరును కేంద్రానికి ప్రతిపాదించినప్పుడు తన ర్యాంకు 11 ఉండగా ప్రస్తుతం 18వ స్థానంలో కొనసాగుతోంది. -
ఈసారి ఖేల్ రత్న లేనట్లే!
► ఏడుగురి పేర్లూ తిరస్కరణ ► ఏ అథ్లెట్‌నూ సిఫారసు చేయని సెలక్షన్ కమిటీ ► ‘అర్జున’కు 15 మంది సిఫారసు న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’కు ఈ ఏడాది ఏ అథ్లెట్ పేరును ప్రతిపాదించొద్దని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. 1991లో స్థాపించిన ‘ఖేల్ రత్న’ పురస్కారం చరిత్రలో ఏ క్రీడాకారుడి పేరును సిఫారసు చేయకపోవడం ఇది మూడోసారి. ఈ అవార్డు కోసం ఎంపిక చేసిన తుది జాబితాలో వికాస్ గౌడ, కృష్ణ పూనియా (డిస్కస్ త్రోయర్లు), సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (టెన్నిస్), జీవ్ మిల్కా సింగ్ (గోల్ఫ్), పి.వి.సింధు (బ్యాడ్మింటన్), దేవేంద్ర జజారియా (జావెలిన్ త్రో) ఉన్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నేతృత్వం వహిస్తున్న ఈ సెలక్షన్ కమిటీ ‘అర్జున’ అవార్డుల కోసం 15 మంది పేర్లను మాత్రం సిఫారసు చేసింది. ఇందులో క్రికెటర్ అశ్విన్, మేటి షూటర్ హీనా సిద్ధూ... అమెరికాలోని విఖ్యాత ఎన్బీఏ సెలక్షన్స్‌లో పాల్గొన్న కేరళ స్టార్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ గీతూ అన్నా జోస్... 2012 ప్రపంచకప్ కబడ్డీ విజేత భారత జట్టులో సభ్యురాలైన మమతా పూజారి ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన మమత దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తోంది. ఇండియన్ రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాకపోతే ఆంధ్రప్రదేశ్ తరఫున బరిలోకి దిగుతుంది. ‘పిస్టల్ షూటర్’ హీనా సిద్ధూ ప్రపంచకప్ ఫైనల్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. బీసీసీఐ నుంచి కేవలం క్రికెటర్ అశ్విన్ పేరును సిఫారసు చేయగా అతనికి ‘అర్జున’ ఖాయమైంది. అశ్విన్ మొత్తం 20 టెస్టుల్లో పాల్గొని 104 వికెట్లు తీశాడు. 79 వన్డేల్లో 106 వికెట్లు పడగొట్టాడు. గతేడాది ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన సింధుకు ఈసారి ‘ఖేల్త్న్ర’ దక్కుతుందని భావించారు. ‘ఖేల్త్న్ర రేసులో ఉన్న ఏడుగురి పేర్లను చర్చించాం. కపిల్ ప్రతిపాదించిన గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్‌పై ఎక్కువ సమయం చర్చ జరిగింది. అయితే జీవ్పై మిగతా సభ్యులు అంతగా ఆసక్తి చూపలేదు’ అని సెలక్షన్ కమిటీ సభ్యుడొకరు తెలిపారు. ‘అర్జున’ కోసం సెలక్షన్ కమిటీ పంపించిన 15 మంది పేర్లను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ పరిశీలిస్తుంది. వీలైతే కొంతమంది పేర్లను చేర్చడంగానీ, తొలగించడంగానీ జరుగుతుంది. ఇదే జాబితాకు ఆమోదముద్ర పడే అవకాశం కూడా ఉంటుంది. జాతీయ క్రీడాదినోత్సవం ఆగస్టు 29న ఈ అవార్డులు అందజేస్తారు. అర్జున అవార్డుల ప్రతిపాదిత జాబితా: అభిషేక్ వర్మ (ఆర్చరీ), టింటూ లుకా (అథ్లెటిక్స్), హెచ్.ఎన్.గిరీష (పారాలింపిక్స్), వి.దిజు (బ్యాడ్మింటన్), గీతూ అన్నా జోస్ (బాస్కెట్‌బాల్), జై భగవాన్ (బాక్సింగ్), అశ్విన్ (క్రికెట్), అనిర్బన్ లాహిరి (గోల్ఫ్), మమతా పూజారి (కబడ్డీ), సాజీ థామస్ (రోయింగ్), హీనా సిద్ధూ (షూటింగ్), అనక అలంకమోని (స్క్వాష్), టామ్ జోసెఫ్ (వాలీబాల్), రేణుబాల చాను (వెయిట్‌లిఫ్టింగ్), సునీల్ రాణా (రెజ్లింగ్). -
నాకు అన్యాయం జరిగింది!
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఆమె బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ను కలిసింది. రోజంతా ప్రయత్నించినా మంత్రి కార్యాలయాల్లో జితేంద్రను కలవలేకపోయిన పూనియాకు ఎట్టకేలకు ఆయన ఇంట్లో ఆ అవకాశం లభించింది. ఆమె అభ్యర్థనకు సంబంధించి వివరాలు తెలుసుకొని తగిన చర్య తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు పూనియా వెల్లడించింది. ‘15 నిమిషాల పాటు ఆయన ఓపిగ్గా నా మాటలు విన్నారు. ఎంపికలో ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుతామని మంత్రి చెప్పారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది’ అని పూనియా వెల్లడించింది. రెజ్లర్ సుశీల్ కుమార్... పూనియాకు మద్దతుగా నిలిచాడు. సోధితో పాటు సంయుక్తంగా పూనియాకు అవార్డు ఇవ్వాలన్నాడు. ద్వంద్వ ప్రమాణాలు... లండన్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన అందరికీ అవార్డులు దక్కాయని, తనకు మాత్రం ఇవ్వకుండా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని పారాలింపియన్ గిరీష విమర్శించాడు. గత ఏడాది విజయ్‌కుమార్‌కు ఇచ్చిన తరహాలో తననూ ఖేల్త్న్రకు ఎంపిక చేయాలని కోరాడు. ఒక వేళ సాధ్యం కాకపోతే ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ కనీసం అర్జున అవార్డును ప్రకటించాలని విజ్ఞప్తి చేశాడు. ‘ఖేల్’ మార్చిన అంజలి... వాస్తవానికి పెరీరా నేతృత్వంలోని కమిటీ ముందు ఖేల్త్న్ర అవార్డు కోసం పూనియా, గిరీష పేర్లే వచ్చాయి. చివరి నిమిషంలో సోధి పేరు చేర్చాల్సిందిగా మాజీ షూటర్ అంజలీ భగవత్ ఒత్తిడి తెచ్చి తన పంతం నెగ్గించుకున్నారు. గిరీషను తప్పించి పూనియా, సోధి మధ్య ఓటింగ్ జరపగా 12 మంది సభ్యులు 6-6తో ఇద్దరినీ సమర్ధించారు. ‘సాయ్’ డెరైక్టర్ థామ్సన్, సోధికి మద్దతు పలకడంతో ఎంపిక ఖరారైంది.