
ఆమె విజయాలు అసమానం!
భారత టెన్నిస్ స్టార్, మహిళల డబుల్స్ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి సానియా మీర్జాకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్ ఖల్ రత్న' దక్కింది. జూన్ నెలలో మార్టినా హింగిస్ తో కలిసి వింబుల్డన్ డబుల్ టైటిల్ నెగ్గిన సానియాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మంగళవారం ఖేల్ రత్న ప్రకటించింది. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోనప్పటికీ ఆమెను ఈ పురస్కారం వరించడం విశేషం. ఒడిదుడుకులు తట్టుకుని అసమాన ఆటతీరుతో నయా చరిత్ర లిఖించిన సానియాకు ఖేల్ రత్న వచ్చిన సందర్భంలో ఆమె సాధించిన ముఖ్యమైన విజయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
గ్రాండ్ స్లామ్ టైటిల్స్
2003 అలీసా క్లెనోవా(రష్యా)తో కలిసి బాలికల విభాగంలో వింబుల్డన్ డబుల్స్ విజేత
2009 మహేష్ భూపతితో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబ్సుల్ టైటిల్ గెలుపు
2012 మహేష్ భూపతితో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుపు
2014 బ్రునో సోరెస్(బ్రెజిల్)తో కలిసి యూఎస్ ఓపెన్ టైటిల్
ఆఫ్రో-ఆసియన్ గేమ్స్ (హైదరాబాద్)
2003 మహిళల సింగిల్స్ టైటిల్
2003 మహిళల డబుల్స్ టైటిల్
2003 మిక్స్ డ్ డబుల్స్ టైటిల్
2003 మహిళల టీమ్ టైటిల్
ఆసియన్ గేమ్స్
2000 బుసాన్- మిక్స్ డ్ డబుల్స్ టైటిల్
2006 దోహా- మిక్స్ డ్ డబుల్స్ టైటిల్
2006 దోహా- మహిళల సింగిల్స్ టైటిల్
2006 దోహా- మహిళల టీమ్ టైటిల్
2011 గ్వాంగ్ గ్జౌ- మిక్స్ డ్ డబుల్స్ టైటిల్
2011 గ్వాంగ్ గ్జౌ- మహిళల సింగిల్స్ టైటిల్
2014 ఇంచియాన్- మహిళల డబుల్స్ టైటిల్
2014 ఇంచియాన్- మిక్స్ డ్ డబుల్స్ టైటిల్
కామన్వెల్త్ గేమ్స్
2010 ఢిల్లీ- మహిళల సింగిల్స్ టైటిల్
2010 ఢిల్లీ- మహిళల డబుల్స్ టైటిల్
పురస్కారాలు
2004 అర్జున అవార్డు
2005 డబ్ల్యూటీఏ న్యూకమర్ ఆఫ్ ది ఇయర్
2006 పద్మశ్రీ
2014 తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం