
Anurag Thakur Comments On Hockey India Decison: వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి భారత హాకీ జట్లు తప్పుకుంటున్నట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. జాతీయ క్రీడా సమాఖ్యలు ఇలాంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని లేదంటే సంబంధిత శాఖను సంప్రదించాలన్నారు. నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికే వదిలేయాలని... జట్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాయని, క్రీడా సమాఖ్యలకు కాదని ఠాకూర్ అన్నారు.