ఆసియా చాంపియన్స్‌ట్రోఫీకి హాకీ జట్టు ఎంపిక | Manpreet to lead hockey squad | Sakshi
Sakshi News home page

ఆసియా చాంపియన్స్‌ట్రోఫీకి హాకీ జట్టు ఎంపిక

Published Tue, Oct 29 2013 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

ఆసియా చాంపియన్స్‌ట్రోఫీకి హాకీ జట్టు ఎంపిక

ఆసియా చాంపియన్స్‌ట్రోఫీకి హాకీ జట్టు ఎంపిక

 న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టును హాకీ ఇండియా (హెచ్‌ఐ) సోమవారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ సర్ధారా సింగ్‌కు విశ్రాంతినిచ్చిన హెచ్‌ఐ సెలక్టర్లు జట్టు పగ్గాలు మన్‌ప్రీత్ సింగ్‌కు అప్పగించారు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ జపాన్‌లోని కకమిగహరలో వచ్చే నెల 2 నుంచి 10 వరకు జరగనుంది. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్‌లో మన్‌ప్రీత్ జూనియర్ జట్టును విజయపథాన నడిపించాడు. దీంతో అతని సారథ్యంలోని 18 మంది సభ్యుల సీనియర్ జట్టును ఎంపిక చేశారు. ఈ ఈవెంట్ తొలి మ్యాచ్‌లో నవంబర్ 2న భారత్... చైనాతో తలపడుతుంది. అనంతరం 3న జపాన్, 5న ఒమన్, 7న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోటీపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement