రియో ఒలింపిక్స్‌కు ముందు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు హాకీ ఇండియా...
అజ్లాన్ షా హాకీ టోర్నీకి భారత జట్టు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు ముందు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) వారికి దశలవారీగా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. ఫలితంగా ఏప్రిల్ 6 నుంచి 16 వరకు మలేసియాలో జరిగే సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో పాల్గొనే భారత జట్టులో ఏకంగా ఏడుగురు సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. సర్దార్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అజ్లాన్ షా కప్‌లో భారత్‌తోపాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, జపాన్, కెనడా, మలేసియా జట్లు బరిలో ఉన్నాయి.