
న్యూఢిల్లీ: కరోనాపై పోరు కోసం చేతులు కలిపే వారి జాబితా తాజాగా హాకీ ఇండియా (హెచ్‌ఐ), అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) చేరాయి. పీఎం కేర్స్ సహాయ నిధి కోసం హెచ్‌ఐ, ఏఐఎఫ్‌ఎఫ్ చెరో రూ. 25 లక్షలు బుధవారం విరాళంగా ప్రకటించాయి.
గంగూలీ ఉదారత
కరోనా కారణంగా ఆహారం లేక ఇబ్బంది పడే వారిని ఆదుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ముందుకొచ్చాడు. అతను బుధవారం రామకృష్ణ మిషన్ హెడ్‌కార్టర్స్ అయిన బేలూరు మఠానికి 2,000 కేజీల బియ్యాన్ని అందజేశాడు. ‘25 ఏళ్ల తర్వాత బేలూరు మఠాన్ని సందర్శించాను. అన్నార్థుల కోసం 2,000 కేజీల బియ్యాన్ని అప్పగించాను’ అని దాదా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment