వాల్ష్ వైదొలిగితే హాకీ ఇండియాకు కష్టాలు తప్పవు!
న్యూఢిల్లీ:హాకీ ఇండియా చీఫ్ కోచ్ గా ఉన్న టెర్రీ వాల్ష్ బాధ్యతల నుంచి తప్పుకుంటే జట్టు కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హాకీ ఇండియా పాలనా అధికారి రోలెంట్ ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డాడు. తన డిమాండ్లను నెరవేర్చకపోతే తాను వైదొలుగుతానని వాల్ష్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆల్ట్‌మన్ పై విధంగా స్పందించారు. 2016 రియోలో జరిగే ఒలింపిక్స్ కు వాల్స్ కోచ్ గా ఉంటే హాకీ ఇండియాకు మేలు జరుగుతుందన్నాడు. ఒకవేళ వాల్ష్ వెళ్లిపోతే మాత్రమ కష్టాలు తప్పవని స్పష్టం చేశాడు.
ఈ మధ్య దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత జట్టు స్వర్ణం సాధించి 16 ఏళ్ల చరిత్రను తిరరాసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే తాను ఏమిటో వాల్ష్ నిరూపించుకున్నాడని, తదుపరి ఒలింపిక్స్ కు అతను చీఫ్ కోచ్ గా లేకపోతే ఎఫెక్ట్ తప్పదని హెచ్చరించాడు. తన డిమాండ్లను నెరవేర్చకపోతే కోచ్ పదవిలో కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన వాల్ష్ భవితవ్యంపై ఈనెల 17న నిర్ణయం తీసుకోనున్నారు.